Janaki Kalaganaledu February 4th: రామతో కన్నీళ్లు పెట్టించిన అఖిల్- వంట రాక తిప్పలు పడుతున్న మలయాళం
రామా చేసిన అప్పు వల్ల జ్ఞానంబ కుటుంబం కష్టాలు పడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ఇంట్లోకి వచ్చిన మలయాళం తనని తాను పరిచయం చేసుకుంటాడు. తను వంట చేయడానికి వచ్చాడని జ్ఞానంబ చెప్తుంది. నేను ఉన్నా అని జానకి అంటే అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్లిపోతున్నారు, నువ్వు చదువుకోవాలి, జెస్సి కడుపుతో ఉంది అందుకే వంట చేయడానికి ఇతన్ని పిలిపించామని జ్ఞానంబ చెప్తుంది. జానకి అతన్ని తీసుకుని కిచెన్ లోకి వెళ్ళి సరకులు అన్నీ ఎక్కడ ఉన్నాయో చూపిస్తుంది. వంట గదిలోకి వచ్చినట్టు లేదు యుద్దానికి వచ్చినట్టు ఉందని మలయాళం బిక్క మొహం వేస్తాడు. అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటే ఇల్లంతా కళకళాడుతుందని గోవిందరాజులు సంతోషపడతాడు.
శొంటి కాఫీ ఎలా చేయాలో అర్థం కాక మలయాళం తిప్పలు పడుతూ ఉంటాడు. మొదటిసారి ఇంట్లో అద్భుతమైన కాఫీ రుచి చూడబోతున్నారని గోవిందరాజులు తెగ బిల్డప్ ఇచ్చేస్తాడు. అది తాగి గోవిందరాజులు షాక్ అవుతాడు. బాగోకపోయిన పరువు పోకుండా ఉండటం కోసం దాన్ని మింగి బాగుందని పైకి మెచ్చుకుంటాడు. మల్లిక లోపలికి వెళ్ళగానే మిరియాల కాఫీ ఇస్తావా అని అసలు నీకు నిజంగా వంట వచ్చా అని తిడతాడు. తన వంటని అవమానించొద్దని కాసేపు కామెడీ చేయడానికి ట్రై చేస్తాడు. అఖిల్ ఉద్యోగానికి వెళ్తుంటే ఇంట్లో వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని జెస్సి సలహా ఇస్తుంది. కానీ అఖిల్ మాత్రం తనని కసురుకుంటాడు. తర్వాత తల్లి దగ్గరకి వెళ్ళి ఆశీర్వదించమని అడుగుతాడు. అఖిల్ కి జానకి ఆల్ ది బెస్ట్ చెప్తుంది కానీ అఖిల్ వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు.
Also Read: నందు కేఫ్‌కి సామ్రాట్ సాయం- విడాకులిస్తానంటూ అంకితని బెదిరించిన అభి
అది చూసి రామా, జానకి చాలా బాధపడతారు. మొదటి రోజు ఆఫీసుకి వెళ్తున్నప్పుడు రామా వాళ్ళకి చెప్పొచ్చు కదా అని గోవిందరాజులు అంటాడు. రామా తమ్ముడి కోసం చేసిన సాయం గుర్తు చేసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంటే జానకి వస్తుంది. బాధ కనిపించకుండా తన దగ్గర ఎందుకు దాస్తారని జానకి అడుగుతుంది. మీరు తమ్ముడిని ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు, అలాంటిది తమ్ముడి మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్తే ఎంత బాధపడతారో నేను అర్థం చేసుకోలేనా అని జానకి అంటుంది. మీరు తమ్ముడికి ఎంత చేశారో అత్తయ్య చెప్పారు చివరికి ఆ తమ్ముడికి సాయం చేయాలనే కదా మోసపోయింది. ఇంత చేసిన మీకు కనీసం ఒక మాట కూడా చెప్పలేకపోయాడు అని తిడుతుంది. చెప్పనంత మాత్రాన తమ్ముడు కాకుండా పోతాడా, వాడికి ఉద్యోగం దొరికింది కదా అది చాలు అని బాధని దిగమింగుకుంటాడు.
Also Read: యష్, వేద క్యూట్ రొమాన్స్- పెళ్లి చేసుకుంటానని మాళవికకి మాటిచ్చిన అభిమన్యు
గుత్తి వంకాయ కూర చేయమన్నారు ఈ గండం ఎలా తప్పుతుందా అని మలయాళం కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. మల్లిక వచ్చి మలయాళంను పలకరిస్తుంది. నీకు వంటలన్నీ వచ్చా అని అడుగుతుంది. వెజ్, నాన్ వెజ్ వచ్చా అంటుంది. ఇంట్లో అందరూ నాన్ వెజ్ తో పనేముందని గుటకలు వేసి నేను నాన్ వెజ్ తింటానని ఎవరికి చెప్పొద్దని అంటుంది. వీడికి అన్ని వంటలు వస్తే రీల్స్ చేసి సోషల్ మీడియాలో పెడితే రెండు చేతులా సంపాదించొచ్చు అని ప్లాన్ వేస్తుంది మల్లిక. అసలు వంటలే రావని బాధపడుతుంటే ఈవిడ ఏంటి సోషల్ మీడియా అంటుందని మళ్ళీ ఏడుపు మొదలెడతాడు. జానకి పేరు కాలేజ్ నోటీస్ బోర్డులో ఉందని తన ఫ్రెండ్ వచ్చి చెప్తుంది. ఫీజు కట్టని వాళ్ళ పేర్లలో నీది కూడా ఉందని తను అనేసరికి జానకి వెళ్ళి చూసి బాధపడుతుంది. తన స్నేహితురాలి దగ్గర జానకి అప్పు తీసుకుంటుంది.