Acharya Balkrishna Record: ఆచార్య బాలకృష్ణ అరుదైన ఘనత, ప్రపంచంలోని టాప్ సైంటిస్టులలో చోటు- చారిత్రాత్మకమని బాబా రాందేవ్ కితాబు
Acharya Balkrishna joins world top scientists | ఆచార్య బాలకృష్ణను స్టాన్‌ఫోర్డ్, ఎల్సెవియర్ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో చేర్చారని పతంజలి సంస్థ తెలిపింది. చారిత్రాత్మకం అన్నారు బాబా రాందేవ్.

పతంజలి ఆయుర్వేదం సీఈఓ ఆచార్య బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధన బృందం, ప్రపంచ ప్రసిద్ధ ప్రచురణకర్త ఎల్సెవియర్ విడుదల చేసిన ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న 2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో చేర్చారు. ఈ విషయాన్ని పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ వెల్లడించింది. ఈ ఘనత ఆచార్య బాలకృష్ణకు వ్యక్తిగతంగానే కాకుండా, పతంజలి, ఆయుర్వేదంతో పాటు భారతదేశానికి గర్వకారణమని సంస్థ పేర్కొంది.
పతంజలి సంస్థ ఇలా స్పందించింది. "భారతదేశ సనాతన జ్ఞానాన్ని ఆధారిత శాస్త్రీయ విధానాలతో నిరూపించడం ద్వారా, బలమైన సంకల్పం ఉంటే ఏ పనైనా అసాధ్యం కాదని బాలకృష్ణ నిరూపించారు. ఆయన చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా నిరూపితమవుతున్నాయి. ప్రపంచంలోని శాస్త్రవేత్తలకు సహజ మూలికలకు సంబంధించి చేస్తున్న పరిశోధనలకు మార్గం సుగమం చేస్తాయి" అని పతంజలి పేర్కొంది.
అంతర్జాతీయ రీసెర్చ్ పేపర్లలో 300 కంటే ఎక్కువ పరిశోధనలు - పతంజలి
ఆచార్య బాలకృష్ణ చేసిన పరిశోధన, ఆయుర్వేద పనులలో లోతైన నైపుణ్యం అతని మార్గదర్శకత్వం నుండి ప్రేరణ పొంది ప్రపంచ వ్యాప్తంగా 300 కంటే ఎక్కువ పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ పరిశోధన పత్రికలలో ప్రచురితం అయ్యాయని పతంజలి పేర్కొంది. ఆచార్యు బాలకృష్ణ నిరంతర మార్గదర్శకత్వంలో, పతంజలి 100 కంటే ఎక్కువ ఆయుర్వేద ఔషధాలను అభివృద్ధి చేసిందని తెలిపారు. ఇది ప్రజలకు ఆయుర్వేద ఔషధాలను మరింత సులభంగా, ఎలోపతి మందుల దుష్ప్రభావాలు లేకుండా చేయడంలో తోడ్పడిందని సంస్థ పేర్కొంది.
ఆయుర్వేదంపై నమ్మకం, అంకితభావానికి ఫలితం - పతంజలి
యోగా, ఆయుర్వేదంపై 120 కంటే ఎక్కువ పుస్తకాలు, 25 కంటే ఎక్కువ అప్రచురిత పురాతన ఆయుర్వేద తాళపత్రాల రచన ద్వారా ఆయుర్వేదంపై ఆయనకున్న విశ్వాసం, అంకితభావానికి ఫలితమని పతంజలి తెలిపింది. సహజ మూలికలను హెర్బల్ ఎన్‌సైక్లోపీడియా ద్వారా జత చేయడం ద్వారా భవిష్యత్ శాస్త్రీయ తరానికి సమగ్ర నిధిని అందించాలన్న ఆయన దూరదృష్టిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల బృందాలు ప్రశంసించాయి.
ప్రపంచంలోని అనేక దేశాలలో వాడుకలో ఉన్న సాంప్రదాయ వైద్య విధానాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, ఉత్తరాఖండ్‌లోని మాలాగావ్ లోని హెర్బల్ వరల్డ్ ద్వారా ప్రజలకు ఒక జ్ఞానపూర్వక రూపంగా ఆచార్య బాలకృష్ణ అందించారు. ఇది సందర్శకులలో అవగాహన పెంచుతుందని పతంజలి సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రపంచ నాయకత్వం దిశగా ఒక చారిత్రాత్మక అడుగు - బాబా రామ్‌దేవ్
ఈ సందర్భంగా యోగా గురువు స్వామి రామ్‌దేవ్ స్పందించారు. "ఆచార్య బాలకృష్ణ ఆయుర్వేదాన్ని శాస్త్రీయ ఆధారాలతో నిరూపించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులకు ఆయుర్వేదంలో పరిశోధనలకు కొత్త మార్గాలు తెరిచారు" అని అన్నారు. "ప్రపంచంలోని అగ్రశ్రేణి శాస్త్రవేత్తలలో ఆయన పేరు చేర్చడం సహజ మూలికలు, సనాతన ఆయుర్వేద జ్ఞానంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి ఇది నిదర్శనం. ఇది భారతదేశ పరిశోధనా సామర్థ్యం, ఇందులోనూ ప్రపంచ నాయకత్వం దిశగా ఒక చారిత్రాత్మక అడుగు" అని బాబా రాందేవ్ అన్నారు.
పతంజలి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనురాగ్ వార్ష్ణేయ్ మాట్లాడుతూ.. "ఆచార్య బాలకృష్ణతో కలిసి పనిచేసే అవకాశం లభించడం మా అదృష్టం. ఆయుర్వేదాన్ని ఆధునిక నిర్ధారణ పద్ధతుల ద్వారా ప్రపంచ వేదికపై స్థాపించడానికి ఆయన చేసిన పరిశోధనలు, అంకితభావాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తాం ఆచార్య బాలకృష్ణ చేసిన ఈ కృషి మన సనాతన జ్ఞానం, ఆధునిక విజ్ఞానాన్ని సమన్వయం చేస్తుంది. ఆరోగ్యకరమైన, ఆత్మనిర్భర్ భారతదేశానికి బలమైన పునాది వేయడానికి దేశ ప్రజలను మరింత ప్రేరేపిస్తుంది" అని అన్నారు.





















