Moon Water Wars : VIPER, Blue Origin & NASA సీక్రెట్ పాలిటిక్స్ | ABP Desam
చంద్రుడిపై నీటి కోసం మహా యుద్ధం జరగుతోంది. చంద్రుడిపై నీళ్లు ఉన్నాయని ఏ క్షణాన మన ఇస్రో చంద్రయాన్ ప్రయోగాల ద్వారా తేల్చి చెప్పిందో...అప్పటి నుంచి చంద్రుడిపై నీటిని తవ్వి తీసే అధికారం కోసం స్పేస్ కార్పొరేట్ కంపెనీలు పోటీలు పడుతున్నాయి. ఇన్నాళ్లూ నాసాకు అన్నీ తానై ఉన్న ఎలన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ ను కాదని నాసా కొత్తగా..అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కు ఆ బాధ్యతలు అప్పగిస్తోంది. 8 అడుగులు..నిజంగా 8 అడుగులుండే భారీ రోబోను చంద్రుడి సౌత్ పోల్ పై దింపుతున్నారు. నాసా వైపర్ అని పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం పెద్ద యుద్ధమే జరుగుతోంది అమెరికాలో. అసలేంటీ వైపర్..చంద్రుడిపై రోబో ఏంటీ ఈ వారం అంతరిక్ష కథల్లో మాట్లాడుకుందాం.
చంద్రయాన్ సిరీస్...బాహుబలి, RRR సినిమాలకు పెట్టిన బడ్జెట్ తో మన ఇస్రో చంద్రయాన్ ద్వారా చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయి తేల్చి చెప్పింది. చంద్రయాన్ 3 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ ను దింపి ఆ ఫీట్ ను సాధించిన తొలి దేశంగా నిలిచింది. అయితే ఇప్పుడు నాసా ఈ ప్రయోగాలను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లాలనుకుంటోంది. ఇస్రో శాస్త్రవేత్తలు అందించిన డేటా ఆధారంగా చంద్రుడిపైకి 8 అడుగులు ఉండే రోబోను పంపించాలని డిసైడ్ అయ్యింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే మనిషి కంటే ఎత్తుండే ఆ రోబో రోవర్ చంద్రుడి ఉపరితలాన్ని డ్రిల్ చేసి ముక్కలుగా మార్చి లోపల పొరల్లో ఐస్ లాంటివి ఏమన్నా ఉన్నాయా అని పరిశోధనలు చేయనుంది. దీనికే నాసా Volatiles Investigating Polar Exploration Rover _ VIPER అని పేరు పెట్టింది.
వైపర్ ప్రాజెక్ట్ కోసం దాదాపు 500కోట్ల వరకూ ఖర్చు అవుతుంది. ముందు నాసానే ఈ ప్రాజెక్ట్ చేపడతామని చూసినా...చివరకు ఖర్చు ఎక్కువైపోవటంతో అసలు వైపర్ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేస్తున్నామని 2024లో ప్రకటన చేసింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ. కానీ తర్వాత మారిన పరిస్థితుల దృష్య్టా ఈ ప్రాజెక్ట్ లో ఓ ప్రైవేట్ స్పేస్ కంపెనీని భాగస్వామ్యం చేయాలనుకుని ఆ బాధ్యతలను అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ కి ఉన్న స్పేస్ టెక్ కంపెనీ బ్లూ ఆరిజన్ ను సెలెక్ట్ చేసింది. అయితే ఈ సెలక్షన్ ఇప్పుడు మరో చర్చకు కారణమైంది. రీజన్ నిన్న మొన్నటి వరకూ నాసా కు కబాలిలా అన్ని పనులు చేసి పెట్టిన ఎలన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ ను కాదని బ్లూ ఆరిజన్ కు ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ నాసా ఎందుకు అప్పగించింది అనేది డిబేట్.
అసలు ఎలన్ మస్క్ గోల్ ఏంటంటే మార్స్ పై కాలనీలు ఏర్పాటు చేయాలని...అందుకోసం ముందుగా చంద్రుడిని ఓ బేస్ గా మార్చుకోవాలని మస్క్ ఆలోచిస్తున్నాడు. అయితే అంతటి లక్ష్యం ఉండి డబ్బులు పెడతానంటున్న మస్క్ ను కాదని జెఫ్ బెజోస్ వైపు నాసా మొగ్గు చూపటానికి కారణం..రీసెంట్ గా ట్రంప్, ఎలన్ మస్క్ మధ్య వచ్చిన గొడవలే దీనికి కారణం అంటున్నారు. ట్రంప్ అధ్యక్షుడు అవ్వటానికి భారీ సాయం చేసి పెట్టిన మస్క్ కు డోజ్ అనే సంస్థను అప్పగించి ప్రతిఫలం అందించారు ట్రంప్. కానీ ఆ తర్వాత ఎలక్ట్రిక్ కార్లు, కంపెనీలకు సంబంధించిన విషయంలో మాటా మాటా పెరిగి..మస్క్ ట్రంప్ తో బహిరంగంగా నే గొడవపడి బయటకు వచ్చేశాడు. సో ఆ వివాదం తర్వాత ఎంత నాసా స్వతంత్ర సంస్థ అయినా కూడా అల్టిమేట్ గా పాలకుడి ఇష్టాఇష్టాలకు తగ్గట్లుగా నడుచుకోవాలి కాబట్టే..స్పేస్ ఎక్స్ కు పోటీగా బ్లూ ఆరిజన్ ను రేస్ లోకి తీసుకువచ్చేందుకే జెఫ్ బెజోస్ కు వైపర్ ను చంద్రుడిపై ల్యాండ్ చేసే ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. లేదంటే కేవలం స్పేస్ ఎక్స్ సంస్థను కార్గో సర్వీసెస్ కు మాత్రమే వాడుకుని...సైంటిఫిక్ ఎక్స్ పెరిమింట్స్ కోసం ఇప్పటివరకూ గొప్పగా ట్రాక్ రికార్డ్ లేని బ్లూ ఆరిజన్ కు ఆఫర్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఇప్పుడు డిబేటబుల్ పాయింట్.
2027 నాటికి చంద్రుడిపైకి 8 అడుగులు ఎత్తుండే ఈ వైపర్ రోవర్ ను పంపించేందుకు బ్లూ ఆరిజన్ అయితే సిద్ధమైపోతోంది. చంద్రుడిపై పొరలు తవ్వి లోపల ఉండే మంచు గడ్డలనో లేదా నీటికి వెలికితీసే మహాయుద్ధంలో ఇప్పుడు స్పేస్ ఎక్స్ కి పోటీగా వచ్చి బ్లూ ఆరిజన్ మరో స్పేస్ దిగ్గజంగా వెతికే అవకాశాలు ఈ భారీ కాంట్రాక్ట్ తో దక్కనున్నాయి. మనిషి అవసరాలకు, స్వార్థాలకు భూమి నాశనమైపోతుందని ఓ వైపు పర్యావరణ వేత్తలు బాధపడుతుంటే...చంద్రుడు, మార్స్ అంటూ వేరే గ్రహాలపై పనుల కోసం కాంట్రాక్టులు పొందే రేసులో టెక్ దిగ్గజాలు, ప్రపంచ కుబేరులు ఇలా పోటీలు పడుతుండటం...సైంటిఫిక్ ప్రయోగాల్లోనూ చొచ్చుకొస్తున్న రాజకీయాలు ఎటు వైపు దారి తీయనున్నాయి అనేది అసలు ఆందోళన కలిగించే అంశం.





















