హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ ఏరియాలలో తాగునీటి సరఫరా బంద్
Hyderabad Metropolitan Water Supply and Sewerage Board | సెప్టెంబర్ 24న హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్ కానుంది. ఈ ఏరియాల వారు నీళ్లు చూసుకుని వాడుకోవాలని అధికారులు సూచించారు.

Water Supply disruption in Hyderabad | హైదరాబాద్: వేసవి కాలంలోనే కాదు భారీగా వర్షాలు కురుస్తున్న సమయంలోనూ హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాలలో నీటి సరఫరా బంద్ చేస్తుంటారు. అందుకు పలు కారణాలుంటాయి. దాంతో ఆ ఏరియాలలో తాగునీటి సమస్య తీవ్రతరం అవుతుంది. అందుకే ముందు జాగ్రత్తగా అధికారులు నీటి సరఫరా బంద్ చేయడానికి ఒకట్రెండు ముందుగా ఆ ఏరియాల ప్రజలకు సమాచారం అందిస్తుంటారు. హైదరాబాద్ మునిసిపల్ వాటర్ సరఫరా మరియు సీవరేజ్ బోర్డు (HMWSSB) నిర్వహిస్తున్న మరమ్మతుల కారణంగా సెప్టెంబర్ 24వ తేదీన నగరంలోని పలు ప్రాంతాల్లో నీటిఫరా ఉండదు.
మంజీరా ప్రాజెక్టులో లీకులకు మరమ్మతులు
హైదరాబాద్ వాటర్ బోర్డ్ మరమ్మతులు హైదరాబాద్‌కు తరలించాలన్న మంజీరా ఫేజ్-2 నీటి సరఫరా ప్రాజెక్టులో ప్రధాన లీకులను పరిష్కరించడానికి మరమ్మతులు చేపట్టారు. కాలబగూర్ నుంచి హైడర్ నగర్ వరకు పంపింగ్ మెయిన్ పై లీకులు ఏర్పడినట్లు HMWSSB తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లీకులను నివారించడానికి మరమ్మతులు చేపట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం, సెప్టెంబరు 24, ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మరమ్మతుల పనులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కనుక సెప్టెంబర్ 24 ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు కింద పేర్కొన్న పలు ఏరియాలలో నీటి సరఫరా నిలిపివేయనున్నారు. దాంతో ఆయా ఏరియాలలో నీటి సరఫరా అంతరాయంతో నీళ్ల సమస్య ఉండనుంది.
సెప్టెంబర్ 24న ఈ ఏరియాలలో నీటి సరఫరా బంద్
1. RC పురం, అశోక నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందనగర్, గంగారం, మాడినగూడ, మియాపూర్
2. O&M డివిజన్ 22: బిరంగుడ, అమీన్‌పూర్
3. ట్రాన్స్మిషన్ డివిజన్ 2: ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్లు
4. O&M డివిజన్ 6: ఎర్రగడ్డ, ఎస్.ఆర్. నగర్, అమీర్ పేట్
5. O&M డివిజన్ 9: KPHB కాలనీ, కూకట్‌పల్లి, భగ్యనగర్ కాలనీ ప్రగతి నగర్
వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో నాళాలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు వర్షం కురిసే సమయంలో ఇండ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. మ్యాన్ హోల్స్, నాళాల్లో పడి వరద నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుందని అప్రమత్తం చేశారు.






















