రికార్డుల రారాజు.. బ్యాటంబాంబ్ అభిషేక్
ఆసియా కప్ 2025 సీజన్లో బౌండరీల మోత మోగిస్తూ పరుగుల సునామీ సృష్టిస్తున్న టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసియా కప్ రికార్డుల్లో టాప్ ప్లేస్ కొట్టేశాడు. ఊసరవెల్లి సినిమాలో కంటి ముందు టార్గెట్ ఉన్నప్పుడు అది తప్ప ఇంకేం కనిపించకూడదు అని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్‌ని పూర్తిగా ఫాలో అవుతున్నట్లున్నాడు మనోడు. బ్యాట్ పట్టుకుని గ్రౌండ్‌లోకొస్తే చాలు.. బౌలర్ విసిరే బంతుల్ని బౌండరీ దాటించడం తప్ప ఇక దేనిపై ఫోకస్ పెట్టట్లేదు. మనోడు ఏ రేంజ్‌లో రెచ్చిపోతున్నాడంటే.. ఆసియాకప్ 2025 సీజన్లో బౌండరీల మోత మోగిస్తూ.. టీమిండియా విజయాల్లో కీ రోల్ పోషించడమే కాకుండా.. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో అయితే పూనకం వచ్చినట్లు రెచ్చిపోయి దాయాది బౌలర్లకి చుక్కలు చూపించాడు. ముఖ్యంగా సూపర్ 4 మ్యాచ్‌లో మొత్తం పాక్ జట్టుకే పీడకలలా మారాడు. ఈ దెబ్బతో ఆసియాకప్ టోర్నీలో అభిషేక్ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ సీజన్లో హయ్యస్ట్ స్కోర్ 74 రన్స్ కొట్టిన బ్యాటర్‌గా శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండిస్‌తో కలిసి టాప్ ప్లేస్‌లో నిలిచాడు. అయితే మెండిస్ 74 రన్స్ కొట్టడానికి 52 బంతులు తీసుకుంటే మనోడు మాత్రం కేవలం 39 బంతుల్లోనే 74 రన్స్ బాదేశాడు. ఇక టోర్నీలో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా 12 సిక్స్‌లతో టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. ఈ 12 సిక్స్‌ల్లో 5 సిక్స్‌లో పాకిస్తాన్‌తో జరిగిన సూపర్ మ్యాచ్‌లో మనోడు బాదాడంటే పాక్ బౌలింగ్‌ని ఏ రేంజ్‌లో ఊచకోత కోశాడో అర్థం చేసుకోండి. ఇది మాత్రమే కాదు.. టోర్నీ టాప్ స్కోరర్ కూడా మనోడే. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 173 రన్స్ చేసిన అభిషేక్.. ఆసియా కప్ 2025లో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఇక మనోడి స్పీడ్ చూస్తుంటే.. రాబోయే మ్యాచ్‌ల్లో ఇలాంటి ఇంకెన్నో రికార్డులు బద్దలు కొట్టేలా ఉన్నాడు. ఇక ఈ దెబ్బతో టీమిండియా ఫ్యాన్స్ అంతా కలిసి ఆటంబాంబు షాట్లతో రెచ్చిపోతున్న అభిషేక్‌కి ముద్దుగా బ్యాటంబాంబ్ అని పిలుచుకోవడం స్టార్ట్ చేశారు. మరి ఈ పేరు మీకెలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.




















