పీసీబీకి అంపైర్ ఫోబియో.. మరో రిఫరీపై ఐసీసీకి కంప్లైంట్
ఆసియా కప్ 2025 సీజన్లో పాకిస్తాన్‌కి అంపైర్ ఫోబియో పట్టుకున్నట్లుంది. అది కూడా ముఖ్యంగా ఇండియాతో మ్యాచ్ జరిగినప్పుడు, ఆ మ్యాచ్‌లో పాక్ చిత్తు చిత్తుగా ఓడిపోయినప్పుడు.. ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చుకోవాలో తెలియక.. అంపైర్లపై పడి ఏడుస్తోంది పీసీబీ. టోర్నీలో భారత్ చేతిలో 2 సార్లు చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఇండియాని డీఫేమ్ చేయడానికి అన్ని రకాలుగా ట్రై చేస్తోంది. ఈ ప్రయత్నంలో టోర్నీ స్టార్టింగ్ నుంచే ఐసీసీకి చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్ టైంలో ఇండియన్ ప్లేయర్స్ మాకు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదంటూ మొదట టీమిండియాపై, ఆ తర్వాత ఆ మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్‌పై ఐసీసీకి కంప్లైంట్ ఇచ్చిన పీసీబీ.. రీసెంట్‌గా సూపర్ 4 మ్యాచ్‌లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత మళ్లీ ఏడుపు రాగం ఎత్తుకుంది. తమ టీమ్ ఓపెనర్ ఫకర్ జమాన్ అవుటైన విధానం అనుమానాస్పదంగా ఉందంటూ రీసెంట్‌గా ఇంకోసారి ఐసీసీకి కంప్లైంట్ ఇచ్చింది. అప్పటికే 3 ఫోర్లు కొట్టి మంచి ఊపు మీదున్న ఫకర్ జమాన్.. హార్దిక్ పాండ్యా వేసిన ఓ అవుట్‌సైడ్ డెలివరీని ఆఫ్ సైడ్ షాట్ ఆడటానికి కట్ చేశాడు. కానీ బాల్ ఎడ్జ్ తీసుకుని కీపర్ సంజు చేతుల్లోకి వెళ్లింది. సంజూ అద్భుతమైన లో క్యాచ్ అందుకుని అపీల్ చేశాడు. అయితే బంతి నేలకి తాకిందేమో అనే డౌట్‌తో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కి అపీల్ చేస్తే.. థర్డ్ అంపైర్ చెక్ చేసి అది అవుట్ అని తేల్చాడు. అయితే జెయింట్ స్క్రీన్‌పై అవుట్ అని కనిపించగానే.. ఫకర్ జమాన్ ఆశ్చర్యపోయి కోపంగా వెళ్లిపోయాడు. డగౌట్‌లో ఉన్న పాక్ కోచ్ మైక్ హొస్సేన్ కూడా షాకయ్యాడు. ఇక ఇదే విషయంలో ఇప్పుడు పీసీబీ ఐసీసీకి కంప్లైంట్ ఇచ్చింది. ఈ విషయాన్ని పీసీబీ స్వయంగా ప్రకటించింది. అవును ఇండియా, పాక్ సూపర్4 మ్యాచ్‌కి థర్డ్ అంపైర్‌గా ఉన్న రుచియ పల్లియగురుగేపై ఐసీసీకి కంప్లైంట్ చేశామని చెప్పింది. మ్యాచ్‌లో సంజూ క్లియర్ క్యాచ్ పట్టలేదని.. బంతి కీపర్ గ్లోవ్స్‌లోకి వెళ్లేముందే నేలపై పిచ్ పడటం క్లియర్‌గా కనిపికంచినా.. అన్ని యాంగిల్స్ నుంచి చెక్ చేయకుండా.. థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడని.. దీనిపై తప్పనిసరిగా పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరినట్లు పీసీబీ చెప్పింది. మరి ఇండియా చేతిలో ఓడిన అవమానాన్ని పాక్ జనాలు మర్చిపోయేలా చేయాలంటే ఇలాంటి జిమ్మిక్కులు చేయక తప్పదు కదా..!





















