పాకిస్తాన్ ఫ్యూచర్ తేలేది నేడే.. ఓడితే ఇంటికే
Asia Cup 2025 సీజన్లో పాకిస్తాన్ ఫ్యూచర్ ఏంటో ఈ రోజు తేలబోతోంది. సూపర్ 4s లో భాగంగా పాక్ ఈరోజు మంగళవారం శ్రీలంకతో తలపడబోతోంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు do-or-die మ్యాచే. ఫస్ట్ సూపర్ 4 మ్యాచ్ లో India చేతిలో చిత్తుగా ఓడిన పాక్.. టోర్నీలో ముందుకెళ్లాలంటే కచ్చితంగా శ్రీలంక, బంగ్లాదేశ్ లతో జరగబోయే 2 మ్యాచ్ లు గెలవాల్సిందే. ఈ రెండు మ్యాచ్ ల్లో ఒక్క దాంట్లో ఓడినా పాక్ ప్లేయర్లు హ్యాపీగా ఇంటికి రిటర్న్ టికెట్స్ వేసుకోవచ్చు. అందుకే ఆ జట్టుకి ఈ మ్యాచ్ అంత ఇంపార్టెంట్. ఇక మరోవైపు శ్రీలంక ది కూడా సేమ్ సిట్యుయేషన్. Super4s సెకండ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడ్డ లంక.. చెత్త బౌలింగ్ చేసి ఓడిపోయింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్, ఇండియాలతో ఆడబోయే 2 మ్యాచుల్లో గెలిస్తెనే ఆ జట్టుకు కూడా ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ అయ్యేది. అందుకే ఈ మ్యాచ్ లంకకి కూడా చాలా క్రూషియల్. అయితే శ్రీలంక, పాకిస్తాన్.. రెండు జట్లూ కూడా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండు department's లో ఇబ్బంది పడుతున్నాయి. రెండు జట్లకి బ్యాటింగ్ లో middle order సమస్య వెంటాడుతోంది. అదే బౌలింగ్ లో లంక దగ్గర పేస్ బౌలర్లు మాత్రమే కొద్దిగా ఫామ్ లో ఉంటే.. స్పిన్నర్లు అంతగా రాణించట్లేదు. కానీ పాక్ బౌలింగ్ అట్టాక్ లో మాత్రం పేస్ తో పాటు స్పిన్ కూడా చాలా బలంగా ఉంది. ఇదే పాక్ కి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. UAE లాంటి స్పిన్ పిచ్ లపై పాక్ తన స్పిన్ తో లంకని చుట్టేసే అవకాశం లేకపోలేదు. మరి చూడాలి ఈ మ్యాచ్ లో ఎవరు పై చేయి సాధిస్తారో, టోర్నీలో ఎవరు ముందుకెళ్తారో. అయితే మీరెవరు గెలవాలని కోరుకుంటున్నారు? శ్రీలంకనా? పాకిస్థానా?





















