By: ABP Desam | Updated at : 28 Sep 2021 01:50 PM (IST)
Biggboss5 (Image Credit:Starmaa)
బిగ్ బాస్ ప్రోమోను తక్కువగా తీసిపారేయలేం... దాని కోసం ఎదురుచూసే వీరాభిమానులున్నారు. మంగళవారం ఎపిసోడ్ కు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది.ఈ ప్రోమో మొత్తం రవి చుట్టూనే తిరిగింది. అందరినీ ఓదార్చే రవికే ఇప్పుడు హౌస్ లో కష్టాలు మొదలయ్యాయి. సింగిల్ మెన్ అనే పదం లహరి-ప్రియ-రవిల మధ్య పెద్ద దుమారాన్నే రేపింది. అమ్మతోడు అంటూ అబద్ధాల ఒట్టులతో వీడియోకు అడ్డంగా దొరికిపోయి, నాగార్జునచేత చీవాట్లు కూడా తిన్నాడు. ఈ వారం నామినేషన్లలో కూడా ఉన్నాడు రవి. ఇక ప్రోమో విషయానికి వస్తే నటరాజ్ మాస్టర్, విశ్వ, కాజల్ లతో రవికి అభిప్రాయ బేధాలు వచ్చినట్టు కనిపించాయి. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ అన్నాతమ్ముడిగా చెప్పుకునే విశ్వ -రవిల మధ్య గొడవ పెట్టినట్టు కనిపిస్తోంది.
ముందుగా రవి , లోబో, నటరాజ్ మాస్టర్ కూర్చుని మాట్లాడుకుంటుండగా, మాస్టర్ పీకాక్ ఎగిరిపోయింది అని అన్నాడు. దానికి లోబో పీకాక్ అంటే లహరి అని చెప్పాడు. రవి, మాస్టర్ ను పట్టుకుని ‘గుంటనక్క అంటే నేనే కదా, ప్రతి వారం నాగార్జున సార్ గుంటనక్క అంటుంటే అందరూ నా వైపే చూస్తున్నారు,సిగ్గయితుందన్నా’ అని అన్నాడు. దానికి మాస్టర్ ‘ఒక ఊసరవెల్లి నాతో రవికి పర్ ఫెక్ట్ పేరు పెట్టావ్’ అని అంది అని సమాధానమిచ్చాడు. దానికి రవి ‘విశ్వనా’ అని అడిగితే, అవునన్నట్టు తలూపాడు మాస్టర్. రవి, విశ్వతో ఇదే విషయాన్ని ప్రశ్నించాడు. దానికి విశ్వ చాలా ఆశ్చర్యపోయినట్టు ముఖం పెట్టాడు. దానికి ఏం సమాధానమిచ్చాడో ఎసిపోడ్ లో చూడాల్సిందే.
మధ్యలో కాజల్ గొడవ...
ఇక రవి, కాజల్ దగ్గరకొచ్చి కూర్చోగానే ఆమె కోపంతో లేచి వెళ్లిపోయింది. ‘ఫిజికల్’ అని క్వశ్చన్ చేసింది. దానికి రవి ‘హిట్టింగ్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్’ అని తిరిగి క్వశ్చన్ చేశాడు. దానికి కాజల్ ‘ఆ పదం వాడతావా, నాతో మాట్లాడకు’ అంటూ కోపంగా గార్డెన్ ఏరియా నుంచి వెళ్లిపోయింది. లోపల సిరిని పట్టుకుని వెక్కివెక్కి ఏడ్చింది. బయట రవికి ఏమీ అర్థం కాక మానస్ చూస్తూ ఉండిపోయాడు. ప్రోమోను బట్టి మంగళవారం ఎపిసోడ్ కూడా వాడివేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది. మళ్లీ రవినే సెంటర్ ఆప్ వివాదం అయ్యేట్టు కనిపిస్తున్నాడు.
After effects of nominations...Set avtarani wait cheddam!#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/Vv7UWW0scj
— starmaa (@StarMaa) September 28, 2021
Also Read: ఇంట్లో దోమలు ఎక్కువయ్యాయా... వెల్లుల్లితో తరిమికొట్టండి
Also read: అలాంటి తల్లులకు శుభవార్త.. వారి పాలల్లో పది నెలల పాటూ యాంటీ బాడీలు, బిడ్డలకు రక్ష
Prabhas - Tirumala Darshan : ఉదయమే ఏడు కొండల వేంకటేశ్వరుని దర్శించుకున్న ప్రభాస్
Karate Kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి
షారుక్‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!
Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం
Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?
పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం
దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ
డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు