News
News
X

శ్రీసత్యతో అర్జున్ పులిహోర, అన్నయ్యా అన్నా అదే పని - టాస్క్‌లో పోలీస్ టీమ్ గెలుపు?

గీతూ, శ్రీసత్యలో ఒకరు ఈ వారం కెప్టెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్సీ టాస్క్‌లో పోలీసుల టీమ్ గెలిచినట్లు సమాచారం.

FOLLOW US: 

‘బిగ్ బాస్’ సీజన్ 6లో కెప్టెన్సీ టాస్క్ చివరి దశకు చేరింది. కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసేందుకు బిగ్ బాస్ పెట్టిన ‘అడవిలో ఆట’ పోటీ నువ్వా, నేనా అన్నట్లు సాగుతోంది. కంటెస్టెంట్లు అంతా పోలీసులు, దొంగలుగా విడిపోయారు. అయితే, దొంగలు ఐక్యంగా ఆడకపోవడం వల్ల చివరికి వారే ఓడిపోయినట్లు సమాచారం. చివరికి శ్రీసత్య, గీతూల మధ్య కెప్టెన్సీ పోటీ పెట్టినట్లు తెలిసింది. అయితే, అది ఎంతవరకు నిజమనేది ఎపిసోడ్ ప్రసారమయ్యాకే తెలుస్తుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రకారం.. నేహా, మరీనా మధ్య పెద్ద గలాటేనే జరిగింది. మరోవైపు గీతూ బొమ్మలను అమ్ముతూ కనిపించింది. దీన్నిబట్టి కెప్టెన్ ఎవరు అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు చిన్న లవ్ స్టోరీ కూడా మొదలైంది. శ్రీసత్యతో అర్జున్ పులిహోర కలపడంలో బిజీగా ఉన్నాడు. ‘‘నేను అందరినీ అన్నయ్య అని పిలుస్తానని అనుకున్నాను. దాన్ని యాక్సెప్ట్ చేయడం, చేయకపోవడం మీ ఇష్టం’’ అని అర్జున్‌తో చెప్పింది. దీనికి అర్జున్ ‘వావ్’ అనడం తప్ప ఏమీ మాట్లాడలేకపోయాడు. మరోవైపు గీతూ, శ్రీహన్‌లు శ్రీసత్య, అర్జున్‌ల గురించి మాట్లాడుకున్నారు. ‘‘వాళ్లద్దరి మధ్య ఏం జరుగుతుంది?’’ అని నేహా అడిగితే.. ‘‘అర్జున్‌కు ఆ అమ్మాయి మీద ఫీలింగ్ ఉంది’’ అని తెలిపాడు. మరి, అర్జున్ పులిహోర సక్సెస్ అవుతుందో లేదో అనేది ఈ రోజు (గురువారం) ప్రసారమయ్యే ఎపిసోడ్‌లోనే చూడాలి. 

‘బిగ్ బాస్’ ప్రోమో: 

బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగింది?: 
ఆరోహి, నేహా కలిసి రేవంత్ దాచుకున్న బొమ్మలను కొట్టేశారు. రేవంత్, ఆరోహి, నేహా దొంగల టీమే. అయితే వారు ఐక్యంగా ఆడలేదు. తన బొమ్మలు పోయాయని తెలిసి రేవంత్ నోటికి పనిచెప్పాడు. తన బొమ్మలు దాచిన వారికి సిగ్గు సెన్స్ ఉండాలి అంటూ అరిచాడు. ఇక గీతూ  మీ వాళ్లే తీశారు అని చెప్పింది గీతూ. ఎవరు తీశారో మాత్రం చెప్పలేదు. నేను పోలీసుల టీమ్ గెలిచేలా ఆడతా అంటూ అరిచాడు. ‘నీతి కబుర్లు, నీతి సూక్తులు చెప్పకూడదు’ అంటూ కోప్పడ్డాడు. అతని బొమ్మలను నేహా తీసి సుదీపకు ఇచ్చింది. సుదీప వాటిని దాచింది. 

నేహాను కొట్టి, ఆరోహిని తన్ని: ఇనయ కాసేపు ఇంట్లో హడావుడి చేసింది. పోలీసుల అయిన ఆమె స్టోర్ రూమ్ లో రైడ్ కు వెళ్లింది. దొంగలు దాచిన బొమ్మలు కోసం వెతికింది. రైడ్ టైం ముగిసిన ఆమె అక్కడే ఉండడంతో దొంగలు ఈడ్చిపడేశారు. తోపులాట కాసేపు సాగింది. ఆ తోపులాటలో ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆరోహిని కాలితో తన్నేసింది. నేహా చెంప మీద కొట్టేసింది. దీంతో నేహా చాలా బాధపడింది పెద్ద గొడవ చేసింది. ఇనయ తన డ్రెస్ ఎవరో లాగారంటూ అరిచింది. ఈ మధ్యలో గీతూ వచ్చి క్లాసులు తీసుకుంది. దొరికిందే ఛాన్సు అని ఇనయకు వ్యతిరేకంగా మాట్లాడింది. తప్పు మాటలు మాట్లాడుతున్నావ్, మాటలు మారుస్తున్నావు అంటూ వాదించింది. ఈ గొడవ కాసేపు గట్టిగానే సాగింది. గీతూ నుంచి బొమ్మలు కొట్టేయాలని దొంగల టీమ్ అనుకున్నా కూడా పెద్దగా ప్రయత్నించలేదు. గీతూ జోలికి ఎవరూ వెళ్లకపోవడం వల్ల ఆమె సులువైంది. బొమ్మలు కాపాడేందుకు సూర్యతో డీల్ కుదుర్చుకుని డబ్బులు ఇచ్చింది గీతూ. అలాగే శ్రీహాన్ తో కూడా డీల్ కుదుర్చుకుని డబ్బులు ఇచ్చింది.

బుధవారం ఎపిసోడ్ పూర్తయ్యేసమయానికి శ్రీహాన్ వద్ద 14000 దాకా డబ్బులు ఉన్నాయి. ఇక గీతూ దగ్గర 25 బొమ్మలతో పాటూ, 15800 డబ్బులు ఉన్నాయి. సూర్య దగ్గర 10100 క్యాష్ ఉంది. ఇక పోలీసుల టీమ్ లో శ్రీ సత్య దగ్గర గోల్డెన్ కలర్ కొబ్బరి బోండాం ఉండడం వల్ల ఆమె కూడా కెప్టెన్సీ కంటెండెర్ అయ్యే ఛాన్సు ఉంది. ఇక క్యాష్ అధికంగా ఉన్న శ్రీహాన్, సూర్య, గీతూ కూడా కెప్టెన్సీ కంటెండెర్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. రేపటి ఎపిసోడ్ లో ఎవరెవరు అయ్యారో బిగ్ బాస్ ప్రకటిస్తారు. 

Also read: నువ్వరిస్తే అరుపులే నేనరిస్తే మెరుపులే - ఓవర్ అవుతున్న గీతూ, ఫిజికల్ అయిపోయిన టాస్క్

Also read: దొంగల టీమ్‌లో ఉండి పోలీసుల టీమ్‌ను గెలిపిస్తానన్నా రేవంత్, కారణం ఏంటో తెలుసా?

Published at : 22 Sep 2022 11:04 AM (IST) Tags: Bigg Boss Telugu Bigg Boss 6 Telugu Bigg Boss Season 6 Bigg Boss Telugu season 6 Bigg Boss Telugu 6 Sri Satya Geetu

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: హౌస్ లో మోస్ట్ కన్నింగ్, మోస్ట్ మానిప్యులేటివ్ పర్సన్ అతడే - గీతూ కామెంట్స్, శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: హౌస్ లో మోస్ట్ కన్నింగ్, మోస్ట్ మానిప్యులేటివ్ పర్సన్ అతడే - గీతూ కామెంట్స్, శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Rashmika: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో రిలేషన్ - రష్మిక మాటలు విన్నారా?

Rashmika: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో రిలేషన్ - రష్మిక మాటలు విన్నారా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Ghost Hindi Release Date : హిందీలో రెండు రోజుల ఆలస్యంగా నాగార్జున 'ఘోస్ట్' - ఎందుకో వివరించిన నిర్మాత

Ghost Hindi Release Date : హిందీలో రెండు రోజుల ఆలస్యంగా నాగార్జున 'ఘోస్ట్' - ఎందుకో వివరించిన నిర్మాత

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మంట పెట్టిన బీబీ ఛాట్ బండార్ - వరస్ట్ పానీపూరి ఎవరికి వచ్చింది?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మంట పెట్టిన బీబీ ఛాట్ బండార్ - వరస్ట్ పానీపూరి ఎవరికి వచ్చింది?

టాప్ స్టోరీస్

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు

Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు