News
News
X

Bigg Boss 6 Telugu: దొంగల టీమ్‌లో ఉండి పోలీసుల టీమ్‌ను గెలిపిస్తానన్నా రేవంత్, కారణం ఏంటో తెలుసా?

Bigg Boss 6 Telugu: రేవంత్ మళీ మండింది. ఆయనకు మండితే గేమ్ ఎలా ఆడతాడో ఆయనకే తెలియదు.

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: ‘మీరు కన్నింగ్ అయితే, నేను మహా కన్నింగ్... ఆడి చూపిస్తా’ అంటూ రేవంత్ ఆటను మలుపు తిప్పేలా కనిపిస్తున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం ‘అడవిలో ఆట’ గేమ్ కొనసాగుతోంది. ఇందులో పోలీసుల టీమ్, దొంగల టీమ్ గా విడిపోయి ఆడుతున్నారు. రేవంత్ దొంగల టీమ్. ఇక గీతూ అత్యాశ గల వ్యాపారిగా ఆడుతోంది. అంతే దొంగలు కొట్టేసిన బొమ్మలు, వస్తువులు తెచ్చి ఆమెకు అమ్ముతారు. ఇందులో రేవంత్ చాలా బొమ్మలను కొట్టి దాచి పెట్టాడు. కొన్నింటిని గీతూకి అమ్మాడు. కొన్నిబొమ్మలను సోఫా కింద దాచాడు. వాటిని నేహా, ఆరోహి కలిసి దొంగిలించారు. వీరు కూడా దొంగల టీమే. దొంగల టీమ్ ఐక్యంగా ఆడకపోవడం వల్ల వారిలో చాలా గొడవలు వస్తున్నాయి. ఇక పోలీసులంతా కలిసి ఆడుతున్నారు. గీతూ తన గేమ్ ఆడుతోంది. 

రేవంత్ శపథం..
రేవంత్ తన బొమ్మలు ఎవరో కొట్టేశారని తెలిశాక అందరినీ అడిగాడు. ఎవరూ సమాధానం ఇవ్వలేదు. గీతూ ‘నీ బొమ్మలు మీ వాళ్లే కొట్టేశారు, వాళ్ల గేమ్ వాళ్లు ఆడారు, అంత సీరియస్ అవ్వకు’ అంది. దానికి రేవంత్ ‘మరి అలాంటప్పు నీతి సూక్తులు ఎందుకు చెప్పడం’ అంటూ ఫైర్ అయ్యాడు. నిద్రపోదామనుకున్నా, కానీ నిద్రపోనూ, పోలీసుల టీమ్ ను గెలిపిస్తా అంటూ శపథం చేశాడు. అంతేకాదు తన దగ్గరున్న కొన్ని వస్తువులు పోలీసులకు ఇచ్చేసేందుకు ప్రయత్నించాడు, కానీ ఇవ్వలేదు. ఇక సుదీప ‘నువ్వు టీమ్ మొత్తాన్ని డిస్ క్వాలిఫై చేస్తావా’ అంటూ కోప్పడింది. కానీ రేవంత్ చివరికి ఏం చేశాడో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాలి. 

రేవంత్ కోపంలో ఎన్ని మాటలు అన్నా తన టీమ్ లో ఓడిపోయేలా చేయడమే నమ్మకం మాత్రం ప్రేక్షకుల్లో ఉంది.  అలా చేస్తే ఆయన కెప్టెన్సీ కంటెండెర్ కాలేడు. పైగా వీకెండ్లో నాగార్జున చేత తిట్లు తప్పవు. కాబట్టి చివరికి ఏం ఆలోచిస్తాడో చూడాలి. 

ఈ వారం నామినేషన్లలో మొత్తం తొమ్మిది మంది నిలిచారు. 
1. వాసంతి
2. ఆదిత్య
3. చంటి
4. ఆరోహి
5. నేహ
6. ఇనయా
7. శ్రీహాన్
8. రేవంత్
9. గీతూ

ఈ తొమ్మిది మందిలో బాగా వీక్ కంటెస్టెంట్ వాసంతి. ఆమె వెళ్లే ఛాన్సులు అధికంగా ఉన్నాయి. ఆమె కాకపోతే ఇనయాకు ఎసరు తప్పేలా లేదు.

Also read: అడవిలో ఆట గేమ్‌లో నచ్చినట్టు ఆడిన గీతూ, బిగ్‌బాస్ రూల్స్ కూడా బేఖాతర్, చిరాకు పడ్డ ఇంటి సభ్యులు

Also read: బేబీ ఎమోషన్ నీకు తెలియదు అంటూ గీతూకి సుదీప క్లాస్, మరో నటరాజ్ మాస్టర్‌లా కనిపించిన ఆదిరెడ్డి, నామినేషన్లో అరుపులు

Published at : 21 Sep 2022 11:07 AM (IST) Tags: Revanth Bigg Boss 6 Telugu neha Arohi Rao Bigg boss 6 Telugu Written Updates

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

టాప్ స్టోరీస్

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Jinping House Arrest: షాకింగ్! గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు- సైన్యం చేతిలోకి దేశం!

Jinping House Arrest: షాకింగ్! గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు- సైన్యం చేతిలోకి దేశం!

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ