అన్వేషించండి

Bigg Boss 6 Telugu Episode 17: అడవిలో ఆట గేమ్‌లో నచ్చినట్టు ఆడిన గీతూ, బిగ్‌బాస్ రూల్స్ కూడా బేఖాతర్, చిరాకు పడ్డ ఇంటి సభ్యులు

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ఆటను గీతూ చుట్టే ఆడిస్తున్నట్టు కనిపిస్తున్నాడు.

Bigg Boss 6 Telugu: నామినేషన్లు పూర్తయ్యాక తరువాత ఏం జరిగిందో ఎపిసోడ్లో కాసేపు చూపించారు. నేహా తనను రేవంత్ ‘పునుగులు, నూడుల్స్’ అని పిలుస్తున్నాడని, అది తనకు నచ్చడం లేదంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆది రెడ్డి - గీతూ కూర్చుని ఇనయాను తిట్టుకుంటూ కనిపించారు. గీతూ ‘తిక్క దెయ్యం’ అంటూ ఇనయాను తిడితే, ఆదిరెడ్డి  ‘ఆమే వేస్ట్, వరస్ట్’ అంటూ తిట్టుకొచ్చాడు. కెమెరా కోసమే అలా మాట్లాడుతుంది అని చెప్పుకొచ్చారు. ఇక రేవంత్ అందరూ తనను టార్గెట్ చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. శ్రీసత్య మాట్లాడుతూ తాను మనీ,ఫేమ్ కోసమే వచ్చానని, వాళ్లు కోరుకునే కంటెంట్ తన నుంచి రాదని అంది. అర్జున్ - శ్రీ సత్య మధ్య లవ్ ట్రాక్ గురించి ఆమె ఇలా మాట్లాడింది. 

ఏం తిప్పావ్ బిగ్‌బాస్ ఆట 
ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌ను ఇచ్చారు బిగ్‌బాస్. అడవిలో ఆట గేమ్ లో ఆదిరెడ్డి, చంటి, ఆదిత్య, రోహిత్, రాజ్, ఫైమా, శ్రీసత్య పోలీసులుగా, రేవంత్, నేహ, కీర్తి, శ్రీహాన్, సూర్య, అర్జున్, వాసంతి, ఆరోహి దొంగలుగా ఆడతారు. ఇక గీతూకి మాత్రం చాలా స్పెషల్ పాత్ర ఇచ్చారు బిగ్ బాస్. ఆమె ‘అత్యాశ గల వ్యాపారస్తురాలు’ అని చెప్పారు బిగ్ బాస్. ఆమె దొంగలు తెచ్చిన బొమ్మలు కొనుక్కోవాలని చెప్పారు, అలాగే ఆమె కోసం తినేందుకు ప్రత్యేక ఆహారాన్ని కూడా తెచ్చిచ్చారు. గీతూ ఇదంతా చూసి ‘బొమ్మలు కొనక్కుండానే కొన్నానని ఆడతా, ఏం తిప్పావ్ బిగ్‌బాస్ ఆట నా వైపు’ అంది. 

ఇక ఆట మొదలయ్యాక దొంగలు అడవిలో వస్తువుల్ని దొంగిలించి దాచడానికి ప్రయత్నిస్తుంటే, పోలీసులు అడ్డుకున్నారు. ఇది కాస్త ఫిజికల్ గా మారింది. నేహాను కాళ్లు పట్టుకుని ఆదిత్య ఆపడానికి ప్రయత్నించడంతో ఆమె కింద పడింది. ఇక వాసంతి తాను ఇన్ఫార్మర్ గా ఉంటానని పోలీసు అయిన ఫైమాతో డీల్ కుదుర్చుకుంది. దొంగలు వస్తువులు ఎక్కడో దాచారో నేను చెబుతానని, నేను దొంగతనం చేసేటప్పుడు మీరు పట్టుకోవడానికి ప్రయత్నించడకూడదని చెప్పింది. దానికి ఫైమా ఓకే చెప్పింది. 

గీతూ ఆట స్పెషల్...
బిగ్‌బాస్ రూల్స్‌కి బదులు గీతూ తన రూల్స్ కొత్తగా పెట్టుకుని ఆడడం మొదలుపెట్టింది. దీనిపై చాలా చిరాకు పడ్డారు ఇంటి సభ్యులు. ఇక శ్రీ సత్య ‘ఇలా ఆడితేనే చప్పట్లు కొడతారు’ అంటూ నాగార్జునకేనా చురకలేసింది. తాను బొమ్మలు కొనకుండానే బొమ్మలు దొంగిలించడం మొదలుపెట్టింది.

‘వాడు’పై గొడవ
శ్రీహాన్‌ను ఉద్దేశించి ఇనయా ‘వాడు’ అనే పదం సంభోధించింది. దీంతో పెద్ద గొడవ జరిగింది. శ్రీహాన్, రేవంత్ కలిసి ఆమెతో గొడవకు దిగారు. రేవంత్ అయితే ‘లాగి కొడతా’ అని ఇనయాను అన్నాడు. దానికి ఇనయా ‘నన్ను కొడతానని ఎలా అంటావ్’ అంటూ చాలా సేపు లాగింది గొడవని. నేహా కూడా మాట్లాడడం నేర్చుకో అంటూ అరిచింది.

Also read: తన టీమ్‌కు వెన్నుపోటు పొడిచి గీతూతో కలిసిన రేవంత్, ఇంటి సభ్యులకు ఇది మామూలు షాక్

Also read: ‘నోరు అదుపులో పెట్టుకో.. వాడు వీడు ఏంటి? లాగి కొడతా’ ఇనయాపై ఫైర్ అయిన రేవంత్, శ్రీహాన్

టాప్ హెడ్ లైన్స్

Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Embed widget