అన్వేషించండి

Bigg Boss 6 Telugu: ‘నోరు అదుపులో పెట్టుకో.. వాడు వీడు ఏంటి? లాగి కొడతా’ ఇనయాపై ఫైర్ అయిన రేవంత్, శ్రీహాన్

Bigg Boss 6 Telugu: బిగ్‌‌బాస్ హౌస్ హీటెక్కిపోయింది. ఇనయాను కొడతా అంటూ వచ్చాడు రేవంత్.

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6లో వినిపించే గొంతులు రేవంత్, ఇనయా, గీతూ. వీళ్లే ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఈరోజు ఇనయాతో శ్రీహాన్, రేవంత్ ఇద్దరూ గొడవకు దిగారు. నేటి ఎపిసోడ్‌కు సంబంధించి విడుదలైన కొత్త ప్రోమోలో ఇనయా, రేవంత్, శ్రీహాన్ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. అసలేమైందంటే...

బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇచ్చారు. అడవిలో ఆట అని ఇచ్చి ఈ టాస్క్‌లో కొంతమంది ఇంటి సభ్యులు పోలీసులుగా, కొంతమంది దొంగలుగా వ్యవహరిస్తారు. ఇక గీతూ ‘అత్యాశ గల వ్యాపారి’గా ప్రవర్తిస్తుంది. ఆట ఏంటో పూర్తిగా తెలియదు కానీ పోలీసులుగా మెరీనా, రోహిత్, శ్రీ సత్య, ఇనయా, ఆదిరెడ్డి, చంటి, బాలాదిత్య వ్యవహరించారు. ఇక మిగతా వారంతా దొంగలు. ఈ ఆటలో దొంగలంతా వస్తువులు దాచేస్తూ కనిపించారు. వారిని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. 

వాడు లాగాడు...
కాగా ఆరోహి గేమ్‌లో గాయపడడంతో ఎత్తుకుని తీసుకెళ్లారు. ఇనయా ఆ విషయంపై అరస్తూ ‘నొప్పి అని స్ట్రాటజీలు యూజ్ చేసుకుని తీసుకెళ్లిపోతే...’ అనగానే శ్రీసత్య ‘ఆమెకు నిజంగానే కాలికి దెబ్బ ఉంది’ అని చెప్పింది. వెంటనే ఇనయా ‘ఉంది... ఆమెను లాగింది వాడు’ అని శ్రీహాన్ ను చూపించింది. అంతే శ్రీహాన్ కోపంగా ‘నోరు అదుపులో పెట్టుకో, వాడు వీడు ఏంటి’ అని గట్టిగా అరిచాడు. ఆ తరువాత రేవంత్ కూడా కలుగజేసుకున్నాడు. ‘మొన్న అన్నావ్ వాడు అని, లాగి కొడితే..’ అన్నాడు. దానికి ఇనయా ‘కొడతానని ఎలా అంటావ్, నన్ను కొడతానని ఎలా అంటావ్’ అంటూ ఇంట్లో హడావిడి చేసింది. దానికి రేవంత్ ‘వాడేంటి వాడు... ఎలా మాట్లాడాలో తెలియదా, మీ ఇంట్లో మ్యానర్స్ నేర్పలేదా’ అని అరిచాడు. మెరీనా, ఇనయాను ఇంట్లోంచి గార్డెన్ ఏరియాలోని తీసుకెళ్లిపోయింది. దీన్నిబట్టి ఈ రోజు ఎపిసోడ్‌లో గట్టిగానే గొడవ అయ్యేట్టు కనిపిస్తోంది. 

వచ్చే వారం తప్పదు...
రేవంత్, శ్రీహాన్ ఈ ఘటనతో వచ్చే వారం ఇనయాను నామినేట్ చేసే అవకాశం అధికంగా ఉంది. అలాగే కొడతా అన్నందుకు రేవంత్ కూడా నామినేషన్లోకి వెళతాడు. నాగార్జున వీకెండ్ లో ఈ విషయం లేవనెత్తచ్చు కూడా.  కాగా నిన్న వాడివేడిగా జరిగిన నామినేషన్లలో మొత్తం తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. 

ఈ వారం నామినేషన్లలో మొత్తం తొమ్మిది మంది నిలిచారు. 
1. వాసంతి
2. ఆదిత్య
3. చంటి
4. ఆరోహి
5. నేహ
6. ఇనయా
7. శ్రీహాన్
8. రేవంత్
9. గీతూ

వీరిలో బయటకు వెళ్లే అవకాశం వాసంతికే అధికంగా ఉంది. ఆమె ఈ వారం నోరు విప్పింది తప్ప గేమ్ అయితే ఇంతవరకు ఆడలేదు. అయితే బిగ్ బాస్ హౌస్ గ్లామర్ డాల్ అని మాత్రం పేరు తెచ్చుకుంది. ఇనాయ - వాసంతిలలో ఎవరో ఒకరు కచ్చితంగా బయటకు వెళ్లొచ్చు. వీరిద్దరే వీక్ కంటెస్టెంట్లు. మిగతా వారంతా స్ట్రాంగ్ గా ఉన్నారు. 
 Also read: బేబీ ఎమోషన్ నీకు తెలియదు అంటూ గీతూకి సుదీప క్లాస్, మరో నటరాజ్ మాస్టర్‌లా కనిపించిన ఆదిరెడ్డి, నామినేషన్లో అరుపులు

Also read: ‘పళ్లెం ఎత్తేస్తా బిగ్‌బాస్’ ఆదిరెడ్డి బెదిరింపులు, ‘దొబ్బెయ్ ఇక్కడ్నించి’ కసిరిపడేసిన గీతూ - నామినేషన్లో ఆ పదిమంది?

 

టాప్ హెడ్ లైన్స్

Arya: హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
Lenin Box Office Collection Day 2: 'లెనిన్' కలెక్షన్స్ పెరిగాయ్... రెండో రోజు బాక్సాఫీస్ దుమ్ము దులిపిన అఖిల్
'లెనిన్' కలెక్షన్స్ పెరిగాయ్... రెండో రోజు బాక్సాఫీస్ దుమ్ము దులిపిన అఖిల్
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
S Janaki Death - Health Bulletin: జానకి మృతిపై అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ - ఎన్ని గంటలకు మరణించారు? రీజన్ ఏంటి?
జానకి మృతిపై అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ - ఎన్ని గంటలకు మరణించారు? రీజన్ ఏంటి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Embed widget