News
News
X

Bigg Boss 6 Telugu: బేబీ ఎమోషన్ నీకు తెలియదు అంటూ గీతూకి సుదీప క్లాస్, మరో నటరాజ్ మాస్టర్‌లా కనిపించిన ఆదిరెడ్డి, నామినేషన్లో అరుపులు

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ మూడో వారంలో నామినేషన్లు వేడిగా సాగాయి

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: సోమవారం నామినేషన్ రోజు అన్న సంగతి తెలిసిందే. ఈసారి నామినేషన్లో అరుపులు, గొడవలు ఎక్కువయ్యాయి. ఆదిరెడ్డి ఎక్స్‌ప్రెషన్స్, మాట్లాడే తీరు నటరాజ్ మాస్టర్‌ను గుర్తుకు తెస్తోంది. నామినేషన్లలో భాగంగా ఆయన ఇనయాను నామినేట్ చేస్తూ ఆమెకు రంగు పూశాడు.ఎందుకో మొదట్నించి కూడా ఇనయాను టార్గెట్ చేస్తూ వచ్చాడు. ఇనయాను నామినేట్ చేసిన ఆయన ఆమెతో గొడవకు దిగాడు. ఇనయా కూడా వెనక్కి తగ్గకుండా మీరు గేమ్ బాగా తెలుసుకుని వచ్చి ఆడుతున్నారు అనగానే ఆదిరెడ్డి ఫైర్ అయిపోయాడు. నువ్వు ఇంత అరిస్తే నేను అంత అరుస్తా అంటూ నటరాజ్ మాస్టర్ గుర్తొచ్చేలా అరిచాడు. ఎపిసోడ్ లో చూపించలేదు కానీ, ప్రోమోలో చూపించారు. ఏకంగా రంగు  ఉన్న పళ్లాన్ని చూస్తూ ‘బిగ్‌బాస్ పళ్లెం ఎత్తేస్తా’ అంటూ అరిచాడు. ఇనయా కూడా ఏమాత్రం తగ్గకుండా ఆయనతో వాగ్యుద్ధం చేస్తూనే ఉంది. 

నీకు ఎమోషన్ తెలియదు....
గీతూ సుదీపకు రంగు పూసి నామినేట్ చేసింది. ‘ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అని ఇంతకు ముందు చెప్పారు, కానీ మీరు పాటించలేదు. మొన్న ఎమోషనల్ అవుతూ మీరు కన్నీళ్లు తుడుచుకున్నరు. ఆ టిష్యూలను అక్కడే పడేశారు’ అని చెప్పింది. దీంతో సుదీప గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.‘ఆ రోజు అందరూ ఎమోషనల్ అయి కన్నీళ్లును తుడుచుకుని టిష్యూలు ఒక మూల పడేశారు. ఒక సిల్లీ రీజన్ తో నన్ను నామినేట్ చేశావ్’ అంది సుదీప. ఆ తరువాత గీతూ చంటిని నామినేట్ చేసింది. బయట ఒకలా, ఇంట్లో ఒకలా ఉంటున్నారని, రియల్ బిహేవియర్ కాదని అంది. 

సంస్కారం ఉండాలి...
చంటి గీతూనే నామినేట్ చేశాడు. పది మందిలో కలిసి ఉంటున్నప్పుడు సంస్కారంతో ఉండాలని అన్నాడు. దానికి గీతూ ముందు మీకు సంస్కారం ఉందో లేదో చూసుకోండి అంటూ గొడవ పెట్టుకుంది. చంటి కూడా ఏమాత్రం తగ్గకుండా గట్టిగానే బదులిచ్చాడు. అందరితో గొడవ పెట్టుకోవడం గేమ్ ఆడడం కాదని అన్నాడు. దానికి గీతూ ‘నాకు తీట లేదు అందరితో గొడవ పెట్టుకోవడానికి’ అంది. చంటి రేవంత్ ను కూడా నామినేట్ చేశాడు. అతను గీతూ మాటలకు ఇన్ ఫ్లూయెన్స్ అయి రాజశేఖర్ ను కెప్టెన్ చేశాడని అన్నాడు. 

దొబ్బెయ్ నువ్వు దొబ్బెయ్
గీతూ వర్సెస్ ఇనయా ఎపిసోడ్ కాసేపు నడిచింది. గీతూ ఫెయిర్ గా ఆడడం లేదంటూ నామినేట్ చేసింది. ఇక ఇనయా ఎవరు ఏం చెబుతున్నా వినకుండా విషయాన్ని సాగదీస్తూనే ఉంది. ఫెయిర్ గేమ్ ఆడడం లేదని, తాను దుస్తులు పెట్టుకునే ర్యాక్ తీసుకుందని చెప్పింది. గీతూ ఎప్పటిలాగే ఇనయాపై విరుచుకుపడింది. ‘ఏయ్ ఇక్కడ్నించి దొబ్బెయ్...దొబ్బెయ్’ అంటూ వెటకారంగా మాట్లాడింది. ఇక ఇనయా రేవంత్ ను  నామినేట్ చేసింది. 

ఇక శ్రీసత్య ఇనయాను ఆరోహిని నామినేట్ చేసింది. ఆర్జే సూర్య రేవంత్, బాలాదిత్యను నామినేట్ చేశారు. కీర్తి ఆరోహిని నామినేట్ చేస్తూ ‘కెప్టెన్ మాట వినాలి కానీ, వినడం లేదు’ అంటూ చెప్పింది. తరువాత చంటిని నామినేట్ చేసింది. నేహా వాసంతికి, గీతూకు రంగు పూసింది. ఇక అర్జున్ కళ్యాణ్ శ్రీహాన్, ఆరోహిని నామినేట్ చేసింది. 

ఫైమా జంట మెరీనా -రోహిత్ ను,బాలాదిత్యను నామినేట్ చేసింది. శ్రీహాన్ ఇనయాను, అర్జున్ కళ్యాణ్ ను చేశాడు. 

ఈ వారం నామినేషన్లలో మొత్తం తొమ్మిది మంది నిలిచారు. 
1. వాసంతి
2. ఆదిత్య
3. చంటి
4. ఆరోహి
5. నేహ
6. ఇనయా
7. శ్రీహాన్
8. రేవంత్
9. గీతూ

Also read: ఇనయాపై రెచ్చిపోయిన ఆదిరెడ్డి, మొదటిసారి గట్టిగా వాదించిన వాసంతి - నాగార్జున క్లాస్ ఎఫెక్ట్

Also read: ‘పళ్లెం ఎత్తేస్తా బిగ్‌బాస్’ ఆదిరెడ్డి బెదిరింపులు, ‘దొబ్బెయ్ ఇక్కడ్నించి’ కసిరిపడేసిన గీతూ - నామినేషన్లో ఆ పదిమంది?

Published at : 20 Sep 2022 07:39 AM (IST) Tags: nagarjuna Revanth Bigg Boss Telugu 6 Geethu chanti Arohi Nominations in bigg boss house

సంబంధిత కథనాలు

Nani's Dasara: నాని 'దసరా' సినిమా బిజినెస్ - అప్పుడే రూ.100 కోట్లు టచ్ చేసింది!

Nani's Dasara: నాని 'దసరా' సినిమా బిజినెస్ - అప్పుడే రూ.100 కోట్లు టచ్ చేసింది!

Bigg Boss Season 6: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎలక్షన్స్, సూర్యకు హ్యాండిచ్చిన ఇనయా - యాంగ్రీ మ్యాన్ కి కెప్టెన్సీ?

Bigg Boss Season 6: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎలక్షన్స్, సూర్యకు హ్యాండిచ్చిన ఇనయా - యాంగ్రీ మ్యాన్ కి కెప్టెన్సీ?

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Bheeshma Parvam in Telugu: మమ్ముట్టి ‘భీష్మ పర్వం’ మూవీని రామ్ చరణ్ రీమేక్ చేయనున్నారా?

Bheeshma Parvam in Telugu: మమ్ముట్టి ‘భీష్మ పర్వం’ మూవీని రామ్ చరణ్  రీమేక్ చేయనున్నారా?

అహంకారానికి మమకారమే సమాధానం - గరికపాటి వివాదంపై బ్రహ్మాజీ, శ్రీనివాస కుమార్ సీరియస్ కామెంట్స్!

అహంకారానికి మమకారమే సమాధానం - గరికపాటి వివాదంపై బ్రహ్మాజీ, శ్రీనివాస కుమార్ సీరియస్ కామెంట్స్!

టాప్ స్టోరీస్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Nobel Prize Facts: నోబెల్‌ శాంతి బహుమతికి గాంధీ ఎన్నిసార్లు నామినేట్‌ అయ్యారు? ఎక్కువసార్లు అందుకున్నదెవరు?

Nobel Prize Facts: నోబెల్‌ శాంతి బహుమతికి గాంధీ ఎన్నిసార్లు నామినేట్‌ అయ్యారు? ఎక్కువసార్లు అందుకున్నదెవరు?