News
News
X

Bigg Boss 6 Telugu: ఇనయాపై రెచ్చిపోయిన ఆదిరెడ్డి, మొదటిసారి గట్టిగా వాదించిన వాసంతి - నాగార్జున క్లాస్ ఎఫెక్ట్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ నామినేషన్లలో అప్పుడే అరుచుకోవడం మొదలైపోయింది.

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: శనివారం ఎపిసోడ్ లో ఆడడం లేదంటూ తొమ్మిది మందికి గట్టిగా క్లాసు తీసుకున్నారు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున. ‘తినడానికి పడుకోవడానికి ఇక్కడికి రావక్కర్లేదని, బయటికెళ్లి కూడా ఆ పని చేయవచ్చంటూ’ గట్టిగానే హెచ్చరించారు. ఆ ఎఫెక్ట్ బాగానే కనిపించింది. ఇప్పటి వరకు నోరు విప్పని వారు కూడా గట్టిగా తమ వాదనను వినిపించారు. అందులో మొదటి వ్యక్తి వాసంతి. నేహాను నామినేట్ చేసిన వాసంతి మొదటిసారి గట్టిగా మాట్లాడింది.నేహాపై ఓ రేంజ్ లో అరిచింది. నేహాను వాసంతి నామినేట్ చేయగా వారిద్దరి మధ్య వాదన సాగింది. నేహా తన స్థానం విడిచి వాసంతికి దగ్గరగా రాగానే ‘దిస్ ఈజ్ మై ప్లేస్’ అంటూ అరిచింది. ఇంతవరకు కామ్ గా ఉన్న ఈ పిల్లకి ఇంత వాయిస్ ఉందా అనిపించింది ప్రేక్షకులకు. 

ఆదిరెడ్డి వాసంతిని నామినేట్ చేసినట్టు ప్రోమోలో చూపించారు. ఆదిరెడ్డి ‘నామినేట్ చేయడమంటే ఇంట్లో నుంచి వెళ్లిపోవడం కాదండి’ అన్నాడు. దానికి వాసంతి ‘నామినేషన్ అంటేనే ఇంట్లోంచి వెళ్లడమండి’ అంది. ఇక ఆదిరెడ్డి మొదట్నించి ఇనయాపై గొడవకు రెడీగా ఉన్నట్టే కనిపిస్తాడు. ఈసారి కూడా ఆమెనే నామినేట్ చేసి చాలా సేపు వాదించుకున్నారు. ఆ గొడవ హద్దులు దాటింది. ప్లేటు ఎత్తేస్తాను బిగ్ బాస్ అన్నాడు ఆదిరెడ్డి. తరువాత ఇనయాతో ‘నువ్వు ఇంత అరిస్తే, నేను అంత అరుస్తా’ అంటూ గొంతు చించుకున్నాడు. నేహా - గీతూ మధ్య మళ్లీ వాదన జరిగింది. 

ఇక అర్జున్ తన స్నేహితుడు శ్రీహాన్‌ను నామినేట్ చేశాడు. ఇక మెరీనా- రోహిత్ కలిసి ఫైాను నామినేట్ చేశారు. తిరిగి ఫైమా కూడా వారినే నామినేట్ చేసింది. ‘తప్పు నామనేట్ చేశారు’ అంటూ రోహిత్ ను అంది. ఇక సూర్య,  రేవంత్ కు నామినేషన్లలో కూడా క్లాసు తీసుకున్నాడు. ఎందుకు అనేది మాత్రం ఎపిసోడ్ లోనే చూడాలి. 

కాగా ఈ వారం నామినేషన్లో పదిమంది ఉన్నట్టు సమాచారం. 
1. చంటి
2. ఆరోహి
3. గీతూ
4. రేవంత్
5. ఇనయా
6. వాసంతి
7. ఆదిత్య
8. సుదీప
9. నేహ
10. శ్రీహాన్

మొదటివారం ఎలిమినేషన్ లేకుండా చేసిన బిగ్ బాస్, రెండో వారంలో మాత్రం డబుల్ ఎలిమినేషన్ చేశాడు. శనివారం షానీని, ఆదివారం అభినయశ్రీని ఎలిమినేట్ చేశారు. ఈసారి ఎలిమినేషన్లలో ఉన్న వారిలో వాసంతి వీక్ కంటెస్టెంట్ గా కనిపిస్తోంది. ఆమె మూడు వారాల్లో ఒక్కసారి కూడా ఆడినట్టు కనిపించలేదు. ఈ నామినేషన్లలోనే తొలిసారి కాస్త గట్టిగా మాట్లాడింది. బుట్టబొమ్మలో తయారవడం తప్ప ఆమె హౌస్ లో ఆడింది లేదు. అదే విషయాన్ని నాగార్జున కూడా ఆమెకు చెప్పారు. 

Also read: ‘పళ్లెం ఎత్తేస్తా బిగ్‌బాస్’ ఆదిరెడ్డి బెదిరింపులు, ‘దొబ్బెయ్ ఇక్కడ్నించి’ కసిరిపడేసిన గీతూ - నామినేషన్లో ఆ పదిమంది?

Also read: మూడేళ్ల నుంచి పుట్టనిది ఇప్పుడు పుడుతుందా - సూర్య గురించి ఆరోహి, ప్రేమ ఉందన్న అభినయ

Published at : 19 Sep 2022 07:13 PM (IST) Tags: Bigg Boss 6 Telugu Bigg Boss 6 Telugu Adireddy Bigg Boss 6 Telugu Revanth Bigg boss 6 Telugu Inaya Sulthana Bigg boss 6 Telugu Geethu Fight in Bigg boss

సంబంధిత కథనాలు

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!