Bigg Boss 6 Telugu: మూడేళ్ల నుంచి పుట్టనిది ఇప్పుడు పుడుతుందా - సూర్య గురించి ఆరోహి, ప్రేమ ఉందన్న అభినయ
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ కొత్త ప్రోమో అలరించేలా ఉంది. సూర్య - ఆరోహి మధ్య ఏదో ఉందన్నట్టు బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వేశాడు బిగ్ బాస్.
Bigg Boss 6 Telugu: సన్ డే...ఫన్ డే రానే వచ్చింది. శనివారమే షానీని ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్, ఈరోజు మరొకరిని ఎలిమినేట్ చేయబోతున్నాడు. నేటి ఎపిసోడ్ లో ముఖ్య అతిధిగా తమన్నా వచ్చింది. ఆమె తన సినిమా బబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్లో భాగంగా బిగ్ బాస్లో కనిపించింది. కాగా ప్రోమోలో సూర్య - ఆరోహి హైలైట్ అయ్యారు.
నాగార్జున ‘అక్కినేని అక్కినేని’ పాటతో ఎంట్రీ ఇచ్చాడు. సూర్య అల్లు అర్జున్‌లా మిమిక్రీ చేసి అలరించాడు. బాలాదిత్య బౌన్సర్ బ్యాండ్ గీతూకి కట్టాడు. తాను బిగ్ బాస్‌కే భయపడతానని, ఆయన్నుంచి కూడా కాపాడ్డానికి గీతక్క అవసరం అనిపిస్తోందంటూ డైలాగ్ వేశాడు. దానికి నాగ్ ‘ముదిరిపోయారు’ అన్నారు. శ్రీహాన్ మాట్లాడుతూ రాత్రి పడుకుని ఉదయం లేచేసరికి తన మెడ మీద చిన్న మార్కు కనిపిస్తోంది,పక్క బెడ్ లోకి అర్జున్ వచ్చాకే ఈ మార్కు కనిపిస్తోందని అన్నాడు. దానికి ఆరోహి ‘ఒకే దుప్పట్లో ఇద్దరు ముగ్గురు కనిపిస్తారు, మార్కుు రాక ఏం వస్తాయి’ అంటూ పంచ్ వేసింది.
మూడేళ్ల నుంచి ఏం లేదు...
ఆర్జే సూర్య బౌన్సర్ బ్యాండ్ ఆరోహికి కట్టడానికి వెళ్లేసరికి ఆడియన్సంతా అరిచారు.నాగార్జున ‘మళ్లీ ఈ స్పందనేంటి’ అన్నారు. దానికి ఆరోహి ‘మూడు సంవత్సరాల నుంచి ఏం పుట్టలేదు, ఇప్పుడేం పుడుతుంది సర్’ అంది. దానికి నాగార్జున ‘నిన్నేమైనా అడిగామా మేము’అన్నారు. దాంతో ఆరోహి కంగుతుంది. అభినయ మాత్రం ‘ప్రేమ ఉంది సర్ చాలా, మేము చూస్తున్నాం సార్’ అంది.
One more elimination today... Who will say goodbye to #BiggBossTelugu6? 👀
— starmaa (@StarMaa) September 18, 2022
Watch the drama unfold, tonight at 9 PM on @StarMaa & @DisneyPlusHSTel.#BiggBossTelugu #BBLiveOnHotstar#StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/wf1Pl8QKpP
నామినేషన్లలో ఏడుగురు ఉన్నారని, వారిని వరుసగా నిల్చోబెట్టారు నాగ్. వారిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారు? ఎవరు సేవ్ అయ్యారన్నది చూడాలంటే ఈనాటి ఎపిసోడ్ చూడాల్సిందే.
అభినయ అవుట్?
నిన్నటి ఎపిసోడ్ లో షానీ ఎలిమినేట్ అయ్యాడు. కాగా ఈ రోజు అభినయశ్రీ ఎలిమినేట్ అవ్వబోతున్నట్టు పక్కా సమాచారం. మొదటి వారం ఎవరినీ ఎలిమినేట్ చేయకపోవడంతో రెండో వారంలో ఇద్దరినీ ఎలిమినేట్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఇంకా 13 వారాలు ఉంది. ఇందులో మధ్యలో ఎప్పుడైనా డబుల్ ఎలిమినేషన్, లేదా మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. బిగ్ బాస్ లో ఎప్పుడు ఎలాంటి ట్విస్టు వస్తుందో చెప్పడం కష్టమే.
Also read: ఇంట్లోకి తమన్నా, అర్జున్ - శ్రీ సత్యా మధ్య ఏం జరుగుతోందంటూ పంచులేసిన నాగార్జున
Also read: వాసంతి అనే కంటెస్టెంట్ హౌస్‌లో ఉందా? - బీబీ కెఫేలో అఖిల్ సార్ధక్ డౌట్, టాప్ 5లో ఉండేది వారేనట