BB Cafe: వాసంతి అనే కంటెస్టెంట్ హౌస్‌లో ఉందా? - బీబీ కెఫేలో అఖిల్ సార్ధక్ డౌట్, టాప్ 5లో ఉండేది వారేనట
BB Cafe: అఖిల్ సార్థక్ బిగ్ బాస్ 6 గురించి తన అభిప్రాయాలను, భావాలను బీబీ కెఫేలో అరియానాతో కలిపి పంచుకున్నారు.
BB Cafe: రెండు సార్లు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడమే కాదు, ఆ రెండు సార్లు రన్నరప్‌గా నిలిచాడు అఖిల్ సార్ధక్. రెండు సార్లు తన స్థానాన్ని తాను కాపాడుకున్నాడు. మొదటిసారి అభిజీత్ చేతిలో, రెండోసారి బిందుమాధవితో పోటీపడి ఓడినా, ప్రేక్షకుల మనసు మాత్రం గెలుచుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్ కి వెళ్లొచ్చాక అఖిల్ అంటే ఇలా ఉంటాడా అని ప్రజలందరికీ తెలిసిందని ఆయన అన్నాడు. అంతేకాదు కెరీర్ పరంగా కూడా అంతా మంచిగా సాగుతోందని చెప్పాడు. అఖిల్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6లోని ఇంటి సభ్యుల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
అరియానా ఇంటి సభ్యుల గురించి చెప్పమని అడిగినప్పుడు అఖిల్ ‘ఇంట్లో చాలా మంది కన్ఫ్యూజన్ గా ఉన్నారు, కొంతమంది అసలు కనిపించడం లేదు, కొంతమంది ఓపెన్ అప్ అవ్వడం లేదు’ అని అన్నారు. కొంతమంది కేవలం నామినేషన్ సమయంలోనే కనిపిస్తున్నారని, వారు కంటెంట్ ఇవ్వకపోవడం వల్లే ఇలా అవుతుందేమో అని అభిప్రాయపడ్డారు.
వాసంతి ఎవరు?
అరియానా ‘నామినేషన్లో వాసంతి ఇచ్చిన కారణాలు ఏం అనిపించింది?’ అని అడిగింది.దానికి అఖిల్ ‘వాసంతి అనే కంటెస్టెంట్ కూడా ఉందా?’ అని ప్రశ్నించాడు. ఆమె గురించి చెబుతూ ‘నిన్న నామినేషన్ ఎపిసోడ్ చూస్తుంటే చివరికి ఒకమ్మాయి వచ్చింది, నేను ఇంట్లో అడుగుతున్నా ఎవరు ఈ అమ్మాయి అని? ఇన్నాళ్లు కనిపించలేదు, ఇప్పుడు నామినేషన్లో కనిపించింది’ అని అన్నాడు. దానికి అరియానా ‘నువ్వు నవ్వట్లేదని నిన్ను నామినేట్ చేస్తా’ అని కామెడీ చేసింది. దానిక్కారణం వాసంతి ఫైమాను అదే కారణంతో నామినేట్ చేసింది.
నీతులు చెప్పడానికేనా?
ఆర్జే సూర్య గురించి అఖిల్ మాట్లాడుతూ ఆయన ఫెమినిస్టులా, అమ్మాయిలకు సపోర్ట్ గా ఉన్నట్టు మాట్లాడుతారని కానీ అది ఆయన పాటిస్తున్నట్టు అనిపించడం లేదని అన్నాడు. ఆరోహిని ‘అది’ అని సంబోధించారని, మరి ఆయన చెప్పిన విలువలు ఏమయ్యాయని ప్రశ్నించాడు.
ఇక గీతూ గురించి మాట్లాడుతూ ‘నేనిలానే ఉంటా, నేను మారను అని పదిసార్లు అంటుంది. కానీ ఒక టీవీషోకి వచ్చినప్పుడు నేను నాలాగే ఉంటా అనడం సెన్స్‌లెస్ అనిపిస్తోంది. ఒకరు చెప్పినప్పుడు మారడంలో తప్పేంటి’ అని అన్నారు. శ్రీహాన్ కూడా ఆటలో పెద్దగా కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు.
ఆదిరెడ్డి అలా అనడం...
ఆదిరెడ్డి మొదట్లో రేవంత్ తో మాట్లాడుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లను నామినేట్ చేయకూడదని, వీక్ కంటెస్టెంట్లను బయటికి పంపాలని అన్నాడని, కానీ మెరీనా -రోహిత్ ను మాత్రం వారు స్ట్రాంగ్ అని చెప్పి నామినేట్ చేయడం నచ్చలేదని అన్నాడు అఖిల్.
టాప్ 5లో ఉండేది వీళ్లే...
అఖిల్ అభిప్రాయం ప్రకారం టాప్ 5లో ఉండేది వీళ్లేనట...
1. రేవంత్
2. శ్రీహాన్
3. సుదీప
4. ఫైమా
5. రోహిత్ - మెరీనా
Also read: 'నువ్వేమైనా తోపువా? చిల్ అవ్వడానికి వచ్చావా?' - హౌస్ మేట్స్ పై నాగ్ ఫైర్, ఎలిమినేట్ అయిన షాని!
Also read: ఆర్జే సూర్య ఆమెకు దూరంగా ఉంటే బెటర్, బీబీ కేఫ్‌లో ఆర్జే చైతూ - మీ అభిప్రాయమూ అదేనా?