Bigg Boss Telugu 6: 'నువ్వేమైనా తోపువా? చిల్ అవ్వడానికి వచ్చావా?' - హౌస్ మేట్స్ పై నాగ్ ఫైర్, ఎలిమినేట్ అయిన షాని!
బిగ్ బాస్ రెండో వారంలో నాగార్జున గట్టిగా క్లాసు తీసుకున్నారు కొంతమంది ఇంటి సభ్యులకు.
వీకెండ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున స్టైలిష్ గా రెడీ అయి బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చేశారు. ఆ తరువాత హౌస్ మేట్స్ తో మాట్లాడారు. చాలా సీరియస్ గా నాగార్జున కనిపించడంతో హౌస్ మేట్స్ టెన్షన్ పడ్డారు. నాగార్జున వెనుక తొమ్మిది కుండలు పెట్టి ఉన్నాయి. వాటిపై తొమ్మిది మంది సభ్యుల ఫోటోలు ఉన్నాయి. కెప్టెన్ బాలాదిత్య, సుదీప, వాసంతి, శ్రీ సత్య, మెరీనా- రోహిత్, కీర్తి భట్, శ్రీహాన్, అభినయ, షానీ ఫొటోలు అంటించి ఉన్నాయి. ఆ తొమ్మిది మందిని సోఫా వెనక్కి వెళ్లి నుంచోమని చెప్పారు నాగార్జున.
బిగ్ బాస్ హౌస్ కి చిల్ అవ్వడానికి వచ్చావా..?:
ఆ తరువాత ఫైమాతో మాట్లాడుతూ.. ఆమె స్ట్రాటజీలు బాలేవని చెప్పారు నాగార్జున. నెక్స్ట్ వీక్ నుంచి గేమ్ తీరు మార్చుకోవాలని చెప్పారు. కెప్టెన్సీ టాస్క్ ని చాలా ఈజీగా తీసుకున్నందుకు చంటికి క్లాస్ పీకారు నాగార్జున. బిగ్ బాస్ హౌస్ కి చిల్ అవ్వడానికి వచ్చావా..? అంటూ ఆర్జే సూర్యని ప్రశ్నించారు నాగార్జున. కెప్టెన్సీ టాస్క్ లో అతడి ఆట తీరు బాలేదని, గేమ్ ని బాగా లైట్ తీసుకుంటున్నావని మండిపడ్డారు నాగార్జున. వెంటనే సూర్య.. 'నా కోసం ఇక గేమ్ ఆడతా' అని మాటిచ్చారు.
నువ్వేమైనా తోపువా..?:
ఇంట్లో ఉన్నవాళ్లందరినీ కరెక్ట్ చేయడానికి నువ్వేమైనా తోపువా..? అని రేవంత్ ని ప్రశ్నించారు నాగార్జున. ఇంట్లో అమ్మాయిలు ఎలా రెడీ అవ్వాలో నువ్ చెప్పక్కర్లేదని అన్నారు నాగ్. ఆట మాత్రం ఇరగదీశావ్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. నేహాకి ఇంజురీ కావడంతో గేమ్ సరిగ్గా ఆడలేకపోయాయని నెక్స్ట్ వీక్ నుంచి బాగా ఆడతానని చెప్పింది. అర్జున్ కళ్యాణ్, ఆరోహిలను గేమ్ తీరుని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పారు నాగార్జున. గీతూ ఆట తీరుని పొగుడుతూ.. చప్పట్లు కొట్టారు నాగార్జున. ఇనయా గేమ్ ఇంప్రూవ్ చేసిందని పొగిడారు నాగ్. అందరినీ ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి కెప్టెన్ అయ్యావ్ అని రాజుపై మండిపడ్డారు నాగార్జున.
మై డియర్ నైన్... మీరు బిగ్ బాస్ హౌస్‌కి ఆడ్డానికి రాలేదు:
నుంచోమని చెప్పిన తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ని బ్యాగ్స్ సర్ది స్టోర్ రూమ్ లో పెట్టమని చెప్పారు నాగార్జున. వారిని ఉద్దేశించి నాగార్జున మాట్లాడుతూ.. 'మై డియర్ నైన్... మీరు బిగ్ బాస్ హౌస్‌కి ఆడ్డానికి రాలేదు, ఛిల్ అవ్వడానికి వచ్చారు' అన్నారు. అన్ని కుండలను పగుల గొట్టారు. కీర్తి అసలు గేమ్ ఆడలేదని మండిపడ్డారు నాగ్. శ్రీసత్యను ఉద్దేశించి 'నీ బొమ్మ పోయినప్పుడు నువ్వు ఫీలయ్యావా? అదే నీ ప్లేటు లాగేసుకుని ఉంటే కచ్చితంగా ఫీలయ్యేదానివి' అన్నారు నాగార్జున. ఇక మెరీనా - రోహిత్‌ను ఉద్దేశించి 'మీరు ఇద్దరూ ఈ ఇంట్లోకి పవర్ ఆప్ టూ కింద వచ్చారు, కానీ ఆటలో మాత్రం మైనస్ లో ఉన్నారు' అన్నారు.
సేఫ్ గేమ్ శ్రీహాన్:
'అద్దం ముందు నిన్ను నువ్ చూసుకునే శ్రద్ధ ఆటలో ఎప్పుడొస్తుంది శ్రీహాన్' అని ప్రశ్నించారు నాగ్. 'సేఫ్ గేమ్ శ్రీహాన్ లా తయారయ్యావ్.. నీకు వచ్చిన మంచి ఆపర్చునిటీ నువ్ సరిగా ఉపయోగించుకోలేకపోతున్నావ్' అని నాగార్జున అన్నారు. ఆ తరువాత అభినయశ్రీ గేమ్ వేస్ట్ అని అన్నారు నాగార్జున. దానికి ఆమె కాసేపు వాదించి.. ప్రూవ్ చేసుకుంటానని చెప్పింది. సుదీప కిచెన్ లో తప్ప గేమ్ లో కనిపించడం లేదని అన్నారు నాగ్. 'తింటానికి, పడుకోవడానికి లోపలికి వచ్చాను అనుకుంటే, బ్యాగులు సర్దుకుని బయటికి వెళ్లిపో' అని షానిని అన్నారు నాగార్జున. 'నువ్ ఆడకపోవడమే కాదు, అందరి ఆటలు చెడగొడుతున్నావంటూ' బాలాదిత్యను ఉద్ధేశించి అన్నారు. దానికి బాలాదిత్య 'నేను తప్పు చేశాను, బుర్రతో ఆలోచించలేదు, మనసుతో ఆలోచించాను' అన్నారు. దానికి నాగ్ 'మనసూ బుర్రా కాదు బిగ్ బాస్ హౌస్ మేట్ గా ఆలోచించు' అన్నారు.
వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు..?
గేమ్ ఆడని తొమ్మిది మంది కంటెస్టెంట్స్ లో ఎవరు వరస్ట్ కంటెస్టెంటో ఎన్నుకోవాలని మిగిలిన 11 మంది కంటెస్టెంట్స్ కి చెప్పారు నాగార్జున. ఎవరికి ఎక్కువ వేస్ట్ స్టాంప్స్ వస్తాయో వారు ఎలిమినేట్ అవుతారని చెప్పారు నాగార్జున. ఆదిరెడ్డి.. శ్రీసత్యపై వేస్ట్ స్టాంప్ వేశారు. రాజ్.. వాసంతికి స్టాంప్ వేశారు. ఇనయా.. శ్రీసత్యకి స్టాంప్ వేశారు. గీతూ.. షానికి స్టాంప్ వేశారు. ఆరోహి.. శ్రీసత్యకి స్టాంప్ వేశారు. అర్జున్ కళ్యాణ్.. షానికి స్టాంప్ వేశారు. నేహా.. వాసంతికి స్టాంప్ వేశారు. రేవంత్.. అభినయశ్రీకి స్టాంప్ వేశారు. ఆర్జే సూర్య.. సుదీపకి స్టాంప్ వేశారు. చంటి.. షానికి వేస్ట్ స్టాంప్ వేశారు. ఫైమా.. వాసంతికి స్టాంప్ వేశారు.
షాని ఎలిమినేషన్:
శ్రీసత్య, షాని, వాసంతిలకు ఎక్కువ స్టాంప్స్ వచ్చాయి. హౌస్ ఒక డెసిషన్ తీసుకున్నట్లే.. ఆడియన్స్ కూడా ఒక డెసిషన్ తీసుకున్నారని చెప్పారు నాగార్జున. ఇద్దరి డెసిషన్ మ్యాచ్ అయిన వ్యక్తి ఎలిమినేట్ అవుతారని చెప్పారు నాగార్జున. ఆ తరువాత షాని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు నాగార్జున.
కాసేపటికి స్టేజ్ పైకి అమల, శర్వానంద్ వచ్చారు. 'ఒకే ఒక జీవితం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వీరు బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు. ఆ తరువాత హౌస్ మేట్స్ తో మాట్లాడారు.
Also Read: 'దెబ్బకు థింకింగ్ మారిపోవాలా' - మరోసారి హడావిడి చేయనున్న బాలయ్య!
Also Read: ప్రభాస్ అభిమానులకు నిరాశ తప్పదా?