అన్వేషించండి

Adipurush: ప్రభాస్ అభిమానులకు నిరాశ తప్పదా?

ఎప్పటినుంచో అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్.. టీజర్ వస్తుందనే సంతోషంలో 'ఆదిపురుష్' ట్యాగ్ ను ట్రెండ్ చేసే పనిలో పడ్డారు. 

ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'(Adipurush). ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 

జనవరి 12న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ని విడుదల చేయబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. ప్రభాస్ పుట్టినరోజు నాడు లేదంటే దసరాకి టీజర్ వస్తుందని అందరూ అనుకున్నారు. ఎప్పటినుంచో ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్.. టీజర్ వస్తుందనే సంతోషంలో 'ఆదిపురుష్' ట్యాగ్ ను ట్రెండ్ చేసే పనిలో పడ్డారు. 

Doubts on Prabhas Adipurush Movie Updates: అయితే ఇప్పుడు మళ్లీ వ్యవహారం మొదటికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు మేకర్స్ సైడ్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అలానే టీజర్ కి సంబంధించిన ప్రభాస్ తో ఓ స్పెషల్ షూట్ చేయాలని ప్లాన్ చేశారు దర్శకుడు ఓం రౌత్. కానీ ఇప్పుడు ప్రభాస్ ఉన్న పరిస్థితుల్లో ఒక నెల వరకు షూటింగ్స్ లో పాల్గొనేలా లేరు. కారణాలు ఏవైనా గానీ.. 'ఆదిపురుష్' అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి మాత్రం నిరాశ తప్పేలా లేదు. 

ఇక ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. ఫారెన్ లో ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం దాదాపు రూ.250 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంటే.. పెట్టిన బడ్జెట్ లో సగమన్నమాట. డిజిటల్ రైట్స్ తోనే ఇంత మొత్తం వచ్చిందంటే.. ఇక థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందో చూడాలి!

హాలీవుడ్ లో 'ఆదిపురుష్': 
ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా కాకుండా.. పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే నిర్మాతలు వెల్లడించారు. దీనికోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నారట. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా 'ఆదిపురుష్' రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా సీత పాత్రలో కృతి సనన్, లంకేశ్వరుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. వెండితెరపై రామాయణాన్ని కొత్త కోణంలో దర్శకుడు ఓం రౌత్ ఆవిష్కరించనున్నారట.  

Also read: కొట్టుకున్నవారికి దక్కని కెప్టెన్సీ - జాలితో అతడిని ‘కెప్టెన్’ చేసేశారు, హౌస్ లో హీరో సుధీర్, కృతి శెట్టి

Also read: నేను ఎప్పటికీ తల్లి కాలేను, పెంచుకున్న పాప చనిపోయింది: ‘కార్తీక దీపం’ కీర్తి భట్ కన్నీటి గాథ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget