అన్వేషించండి

Balakrishna: 'దెబ్బ‌కు థింకింగ్ మారిపోవాలా' - మరోసారి హడావిడి చేయనున్న బాలయ్య!

'అన్ స్టాపబుల్' ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంలో రెండో సీజన్‌కు బాలకృష్ణ, ఆహా ఓటీటీ నిర్వాహకులు రెడీ అయ్యారు. 

తెలుగులో మొదలైన ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మొదటి నుంచి సరికొత్త షోలతో ఆడియన్స్ ను అలరిస్తోంది. అన్నిటికంటే 'అన్ స్టాపబుల్' షో పెద్ద హిట్ అయింది. తొలిసారి బాలయ్య హోస్ట్ చేసిన షో కావడంతో దీనిపై విపరీతమైన బజ్ వచ్చింది. బాలయ్య లాంటి అగ్ర హీరో మిగిలిన స్టార్స్ ను ఇంటర్వ్యూ చేయడంతో ఈ షోకి భారీ పాపులారిటీ వచ్చింది. ఈ ఒక్క షో చూడడానికే సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఒక్కో సెలబ్రిటీని బాలయ్య హ్యాండిల్ చేసిన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆయన పంచ్ లు, జోక్స్ బాగా వర్కవుట్ అయ్యాయి.

ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంలో రెండో సీజన్‌కు బాలకృష్ణ, ఆహా ఓటీటీ నిర్వాహకులు రెడీ అయ్యారు. ఇప్పుడు సీజన్ 2కి ముహూర్తం ఫిక్స్ చేశారు. అతి త్వరలోనే కొత్త సీజన్ ప్రారంభం కానుంది. 'దెబ్బ‌కు థింకింగ్ మారిపోవాలా'.. అనే క్యాప్షన్ తో మరోసారి బాలయ్య హడావిడి చేయబోతున్నారు. 

మొదటి సీజన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజా రవితేజ, కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి, రష్మికా మందన్నా తదితరులు సందడి చేశారు. ప్రతి ఎపిసోడ్ ఎంతో ఫన్ గా నడిచింది. ఇప్పుడు సీజన్ 2 కోసం కోసం స్టార్స్ ను గెస్ట్ లుగా తీసుకురాబోతున్నారు. 

చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లను తీసుకురాబోతున్నారు. బాలయ్య, చిరు, నాగ్, వెంకీ.. వీరంతా ఒకప్పుడు స్టార్ హీరోలుగా ఇండస్ట్రీని ఏలారు. వీరందరినీ బాలయ్య షోలో చూడడం నిజంగానే ఫ్యాన్స్ కు కొత్త ఎక్స్ పీరియన్స్. సీజన్ 2ని కొత్త తరహాలో డిజైన్ చేసిందట 'ఆహా'. కొత్త కొత్త సెగ్మెంట్స్ ను పరిచయం చేయబోతుందట. తొలి ఎపిసోడ్ కి ఎవరిని గెస్ట్ గా తీసుకురావాలో కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఆ స్టార్ ఎవరనేది నాలుగైదు రోజుల్లో తెలియనుంది.

ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్ ను, టీజర్ ను విడుదల చేశారు. ఇందులో బాలయ్య మాస్ అవతార్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో బాలయ్య మరో హిట్ అందుకోవడం ఖాయమని నమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. 'అఖండ' లాంటి హిట్టు సినిమా తరువాత బాలయ్య నటిస్తోన్న సినిమా కావడంతో మార్కెట్ లో కూడా సినిమాకి బాగా డిమాండ్ పెరిగింది. దానికి తగ్గట్లే డీల్స్ కూడావస్తున్నాయట . ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను రూ.58 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. బాలయ్య కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ డీల్ అని చెప్పాలి. థియేట్రికల్ బిజినెస్ కూడా ఇదే రేంజ్ లో జరుగుతుందని భావిస్తున్నారు. 

Also read: కొట్టుకున్నవారికి దక్కని కెప్టెన్సీ - జాలితో అతడిని ‘కెప్టెన్’ చేసేశారు, హౌస్ లో హీరో సుధీర్, కృతి శెట్టి

Also read: నేను ఎప్పటికీ తల్లి కాలేను, పెంచుకున్న పాప చనిపోయింది: ‘కార్తీక దీపం’ కీర్తి భట్ కన్నీటి గాథ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
India vs South Africa 4th T20: లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
Embed widget