ఆర్జే సూర్య ఆమెకు దూరంగా ఉంటే బెటర్, బీబీ కేఫ్‌లో ఆర్జే చైతూ - మీ అభిప్రాయమూ అదేనా?
BB Cafe: బీబీ కెఫెలో ఆర్జే చైతూ చాలా ఓపెన్ గా మాట్లాడాడు. సీజన్ 6లోని కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
BB Cafe: ఆర్జే చైతూ బిగ్ బాస్ నాన్ స్టాప్ (ఓటీటీ)లో కంటెస్టెంట్ గా వచ్చాడు. కానీ చాలా తక్కువ రోజులకే ఎలిమినేట్ అయిపోయాడు. ఆర్జేగా ఎంతో మందికి తెలిసిన గొంతు ఆయనది. బీబీ కెఫేకు అతిధిగా వచ్చి తన అభిప్రాయాలను పంచుకున్నాడు. మనసులో ఉన్నది ఉన్నట్టు బయటపెట్టాడు. బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ల గురించి తన భావాలను ముక్కుసూటిగా చెప్పేశాడు.
సేఫ్ గేమ్ ఆడుతున్నది వీళ్లే...
ఆర్జే చైతూని బీబీ కెఫే హోస్ట్ అరియానా ‘ఇంట్లో సేఫ్ గేమ్ ఆడుతున్నది ఎవరు? ఓపెన్ గా ఆడుతున్నది ఎవరు?’ అని ప్రశ్నించింది. దానికి చైతూ మాట్లాడుతూ ‘కొంతమంది చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఖుల్లం ఖుల్లా లేరు. సుదీప, వాసంతి, అర్జున్ నాకు సేఫ్ ఆడుతున్నట్టు అనిపిస్తోంది. ఇక గీతూ, రేవంత్, బాలాదిత్య బాగా ఆడుతున్నట్టు అనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చాడు.
గీతూ సూపర్
ఇంట్లో గీతూ స్ట్రాటజీ సూపర్ అంటూ మెచ్చుకున్నాడు ఆర్జే చైతూ. ముఖ్యంగా సిసింద్రీ టాస్కులో ఆమె పెర్ఫామెన్స్ అదిరిపోయిందన్నాడు. స్టోర్ రూమ్ లో దుస్తులు తీసేసి బొమ్మను దాయాలన్న ఆలోచన రావడం చాలా గ్రేట్ అన్నాడు. బాలాదిత్య బొమ్మకు తన దుస్తులు తొడిగి, ఆటలో కొనసాగుదాం అనుకున్నా కానీ అది వర్కవుట్ కాలేదని, అయినా ఆమె తెలివి మాత్రం సూపర్ అంటూ మెచ్చుకున్నాడు. మొదట్లో నాలాగే మధ్యలో దూరిపోతోంది అన్ని విషయాల్లో అనుకున్నా కానీ, సిసింద్రీ టాస్కులో మాత్రం ఆమె స్ట్రాటజీ అదిరింది.
బాలాదిత్య నామినేషన్ గురించి...
ఈ వారం నామినేషన్లలో అందరికీ ఒకరినే నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. కానీ కెప్టెన్ అయిన బాలాదిత్యకు మాత్రం ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. అతను రాజశేఖర్, షానీలను ఎంపిక చేసుకున్నాడు. దానిపై మాట్లాడుతూ చైతూ ‘స్క్రీన్ స్పేస్ తక్కువున్న వారినే బాలాదిత్య ఎంచుకున్నాడు. ఆయన లిటరల్లీ గేమ్ ఆడాడు అనిపించింది. వారిద్దరూ యాక్టివ్ లేరు, ఆ ఇద్దరూ పెద్దగా గేమ్ ఆడలేదు, ఏం గొడవలు లేవు, కాబట్టి వారిద్దరిలో ఎవరో ఒకరు వెళ్లిపోతారనే నామినేట్ చేసినట్టు అనిపిస్తోంది’ అన్నాడు.
రేవంత్ బయట కూడా అలాగే ఉంటాడని, లోపల అలాగే ఉండడం వల్ల సమస్యలు వస్తున్నట్టు చెప్పాడు చైతూ. ఆదిరెడ్డి ఆట గురించి మాట్లాడుతూ ‘ఆయన చాలా చప్పగా ఆడుతున్నాడు. బిగ్ బాస్ నిర్ణయానికి వ్యతిరేకంగా నామినేట్ చేయడమేంటి’ అనిపించింది. ఇక శ్రీహాన్ బయట ఎలా ఉన్నాడో లోపల అలాగే ఉన్నాడు. ఆయన చాలా కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉన్నాడు.
ఆర్జే సూర్య గురించి...
అందరి గురించి చెప్పాడు చైతూ... మరి తన ఫ్రెండ్ ఆర్జే సూర్య గురించి ఏం చెప్పాడో తెలుసా? ఆర్జే సూర్య ఆరోహికి దూరంగా ఉంటే చాలా బెటర్ అని చెప్పాడు. అంతేకాదు ఆర్జే సూర్య రాత్రి మాత్రమే కనిపిస్తున్నాడంటూ కామెడీ చేశాడు.
ఇక పబ్లిక్ ఒపీనియన్ చూపించారు బీబీకెఫె నిర్వాహకులు. అందులో కొందరు రేవంత్ ని సపోర్ట్ చేస్తే మరికొందరు ఆయన ఎలిమినేట్ అవుతారేమోనని అన్నారు. ఇక గీతూ వెళ్లిపోతారని ఒకరిద్దరూ అభిప్రాయపడ్డారు. ఆదిరెడ్డి ఆట నచ్చలేదంటూ మరొకరు చెప్పారు. మొత్తంమ్మీద బీబీకెఫె వినోదాన్ని పంచింది.
Also read: నేను ఎప్పటికీ తల్లి కాలేను, పెంచుకున్న పాప చనిపోయింది: ‘కార్తీక దీపం’ కీర్తి భట్ కన్నీటి గాథ