Bigg Boss 6 Telugu: ఇంట్లోకి తమన్నా, అర్జున్ - శ్రీ సత్యా మధ్య ఏం జరుగుతోందంటూ పంచులేసిన నాగార్జున
Bigg Boss 6 Telugu: లవ్ ట్రాక్ లేకుంటే బిగ్ బాస్ సీజన్ పూర్తవ్వదు కదా, ఒక జంట రెడీ అయినట్టే కనిపిస్తోంది.
Bigg Boss 6 Telugu: బబ్లీ బౌన్సర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తమన్నా. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది. ‘తమన్నా కానుక’ పేరుతో ఓ గిఫ్ట్ హ్యాంపర్ పట్టుకుని ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా. ఇక ప్రోమోలో ఏముందో తెలుసుకోండి.
పింక్ డ్రెస్సులో తమన్నా..
తమన్నా పింక్ సూట్ లో వేదికపై మెరిసింది. ఆమె మాట్లాడుతూ ‘అమాయకత్వం ఫేస్ లో చూపించడం చాలా కష్టమైన పని’ అంది. దానికి హోస్ట్ నాగార్జున ‘అవును నీకు అసలు లేదు కదా’ అని పంచ్ వేశారు. ఇక తమన్నా గిఫ్ట్ హ్యాంపర్ పట్టుకుని లోపలికి వెళ్లింది. నాగార్జున ‘ఇక్కడ ఉన్న ప్రతి అబ్బాయి.. హౌస్‌లో ఉన్న ఒకమ్మాయిని తమ బౌన్సర్ గా ఎంచుకోవచ్చు’ అని చెప్పారు. దానికి వెంటనే తమన్నా ‘వై షుడ్ బాయ్స్ హేవ్ ఆల్ ద ఫన్’ అని ప్రశ్నించింది.
చంటికి ఫైమా బౌన్సర్
చంటి ఓ బౌన్సర్ బ్యాండేజ్ తీసి ఫైమా చేతికి తొడిగాడు. ‘ఫైమాకు ఎందుకు పెట్టానంటే నాకు రాజ్ అంటే భయం, రాత్రి పూట ఒక రకంగా పడుకుంటున్నాడు సర్, మధ్యమధ్యలో నా దిండు, దుప్పటి మాయమైపోతుంది సర్’ అని నాగార్జునకు చెప్పాడు. ‘ఫైమా ఏ విధంగా కాపాడుతుంది నిన్ను’ అని నాగ్ ప్రశ్నిస్తే... ‘వాడు భయపడేది ఫైమాకే సర్’ అని చెప్పాడు చంటి.
అర్జున్ - శ్రీ సత్య... ఏమవుతోంది
అర్జున్ కళ్యాణ్ తన బౌన్సర్ గా శ్రీ సత్యను ఎంచుకున్నాడు. శ్రీ సత్య పేరు చెప్పగానే బయట ఉన్న ఆడియెన్స్ అరిచారు. దానికి నాగార్జున ‘ఏమిటా స్పందన ఇక్కడ’ అన్నారు. దానికి ఒక ప్రేక్షకురాలు ‘ఏదో ఉంది’ అంటూ కామెంట్ చేసింది. దానికి నాగార్జున ‘అర్జున్ కళ్యాణ్ విషయంలోనా’ అని అడిగారు. దానికి అర్జున్ అదో రకంగా ముఖం పెట్టాడు. దానికి వెనుక ఉన్న మిగతా కంటెస్టెంట్లు ‘కమల్ హాసన్’ అని కామెంట్ చేశారు.
మంచి ఫ్రెండ్ సర్...
అర్జున్ మాట్లాడుతూ ‘ఆమె నాకు మంచి ఫ్రెండ్ సర్ అంతే’ అన్నాడు. దానికి నాగార్జున సెటైర్లు వేశారు. తమన్నా మాట్లాడుతూ ‘సర్ మేం ఎన్ని సినిమాల్లో నటించాం... అందులో అన్నీ స్నేహంతోనే మొదలవుతాయి’ అంది. 100పర్సంట్ లవ్ లో కూడా హీరోహీరోయిన్లు బాగా కొట్టకున్నారు కదా, అందులో మహాలక్ష్మి క్యారెక్టర్‌కి చికెన్ అంటే చాలా ఇష్టం కదా అన్నారు నాగార్జున. దానికి శ్రీ సత్య సిగ్గుపడుతున్నట్టు ముఖం పెట్టింది.
Also read: వాసంతి అనే కంటెస్టెంట్ హౌస్‌లో ఉందా? - బీబీ కెఫేలో అఖిల్ సార్ధక్ డౌట్, టాప్ 5లో ఉండేది వారేనట
Also read: 'నువ్వేమైనా తోపువా? చిల్ అవ్వడానికి వచ్చావా?' - హౌస్ మేట్స్ పై నాగ్ ఫైర్, ఎలిమినేట్ అయిన షాని!