అన్వేషించండి

Bigg Boss 6 Telugu: తన టీమ్‌కు వెన్నుపోటు పొడిచి గీతూతో కలిసిన రేవంత్, ఇంటి సభ్యులకు ఇది మామూలు షాక్ కాదు

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఏమైనా జరగచ్చు అని ఊరికే అనరు, నిన్నటి వరకు కొట్టుకున్న గీతూ - రేవంత్ కలిసి ఆడుతున్నారు.

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో పాము - ముంగిస ఎవరంటే... గీతూ - రేవంత్ పేరే చెబుతారు ఎవరైనా. ఇంట్లో రెండో రోజు నుంచి వారిద్దరూ ఒకరిమీద ఒకరు అరుచుకుంటూనే ఉన్నారు. ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆ ఇద్దరూ కలిసి ఆడితే ఎలా ఉంటుంది? అందులోనూ రేవంత్ తన టీమ్‌ను దొంగదెబ్బ తీసి గీతూతో కలిస్తే... ఆ ట్విస్ట్ మామూలుది కాదు. మిగతా ఇంటి సభ్యులు ఇది చూసి షాక్ తిన్నారు. 

రేవంత్ మామూలోడు కాదు...
బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండెర్ టాస్కు ఇచ్చారు. ఇందులో గెలిచిన వారే కెప్టెన్సీ పోటీలో ఉంటారు. అడవిలో ఆట ఈ గేమ్‌కు పేరు పెట్టారు బిగ్‌బాస్.ఇందులో సగం మంది పోలీసులుగా, సగం మంది దొంగలుగా ఆడతారు. ఇక గీతూ ‘అత్యాశ గల వ్యాపారి’గా ఆడుతోంది. ఆమె దొంగల కొట్టేసిన సరుకును కొంటుంది. అయితే ఇందులో రేవంత్ దొంగల టీమ్‌లో ఉన్నాడు. గీతూ ఒక ఒప్పందానికి వచ్చారో ఏమో ప్రోమోలో చూపించలేదు కానీ రేవంత్ ఒక్కసారిగా గీతూ వైపు ఆడడం మొదలుపెట్టాడు. తాను దొంగిలించిన బొమ్మలన్నీ తీసుకెళ్లి గీతూకే ఇవ్వడం మొదలుపెట్టాడు. దొంగల టీమ్ లో ఉన్న చంటి, ఆరోహి, సూర్య, శ్రీహాన్ వీరంతా షాకయ్యారు. 

ఇక గేమ్ మాత్రం చాలా హీట్ మీద సాగింది. పోలీసులు, దొంగల టీమ్ తామే గెలవాలని చాలా పథకాలు రచించారు. బాలాదిత్య అనుకోకుండా నేహాను దబ్బున కింద పడేశాడు. ఇక శ్రీహాన్ కెప్టెన్ రాజ్‌ను ఒక రేంజ్ లో కసిరిపడేశాడు.దీంతో పోలీసులు బొమ్మలన్నీ (సరుకు) మొత్తం కలిసి జైల్లో వేసి తాము కూడా జైల్లోనే కూర్చున్నారు. ఇక మిగతా సరుకును రేవంత్ తీసుకెళ్లి గీతూకి ఇచ్చేశాడు. 

దీంతో చంటి, ఆదిరెడ్డి  ఏంటి మీరిద్దరూ కలిసి ఆడుతున్నారా? అని అడిగారు. దానికి గీతూ ‘ఏం మేం కలిసి ఆడకూడదా?’ అంటూ స్టైల్లో స్పందించింది. ‘ఏమైనా కానీ తగ్గేదేలే’ అనుకుంటూ వెళ్లిపోయింది.  ఈ టాస్కులో చివరికి ఏంజరిగిందో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాలి. ఇలా తన టీమ్ ని తానే వెన్నుపోటు పొడిచినందుకు వచ్చే వారం నామినేషన్ల వేడి రేవంత్ కి తగిలే అవకాశం ఉంది. 

ఈ వారం నామినేషన్లలో మొత్తం తొమ్మిది మంది నిలిచారు. 
1. వాసంతి
2. ఆదిత్య
3. చంటి
4. ఆరోహి
5. నేహ
6. ఇనయా
7. శ్రీహాన్
8. రేవంత్
9. గీతూ

ఈ తొమ్మిది మందిలో బాగా వీక్ కంటెస్టెంట్ వాసంతి. ఆమె వెళ్లే ఛాన్సులు అధికంగా ఉన్నాయి. ఆమె కాకపతే ఇనయాకు ఎసరు తప్పేలా లేదు.

Also read: ‘నోరు అదుపులో పెట్టుకో.. వాడు వీడు ఏంటి? లాగి కొడతా’ ఇనయాపై ఫైర్ అయిన రేవంత్, శ్రీహాన్

Also read: ‘పళ్లెం ఎత్తేస్తా బిగ్‌బాస్’ ఆదిరెడ్డి బెదిరింపులు, ‘దొబ్బెయ్ ఇక్కడ్నించి’ కసిరిపడేసిన గీతూ - నామినేషన్లో ఆ పదిమంది?

టాప్ హెడ్ లైన్స్

Swathi Wedding: దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 8th:కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కత్తి పట్టి శకుంతలని చంపడానికి వెళ్లిన లక్ష్మీ! విహారి ఆఫీస్ కాంట్రాక్ట్ బరిలో లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కత్తి పట్టి శకుంతలని చంపడానికి వెళ్లిన లక్ష్మీ! విహారి ఆఫీస్ కాంట్రాక్ట్ బరిలో లక్ష్మీ!
Anasuya: చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
Ravi Mohan: అభిమానులకు సారీ చెప్పిన తమిళ హీరో... ఎందుకో తెలుసా?
అభిమానులకు సారీ చెప్పిన తమిళ హీరో... ఎందుకో తెలుసా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget