అన్వేషించండి

Bigg Boss 6 Telugu: నువ్వరిస్తే అరుపులే నేనరిస్తే మెరుపులే - ఓవర్ అవుతున్న గీతూ, ఫిజికల్ అయిపోయిన టాస్క్

Bigg Boss 6 Telugu:బిగ్ బాస్ ఇంట్లో ఆట ఫిజికల్ అయిపోయింది. ఒకరినొకరు లాక్కోవడం, తిట్టుకోవడంతోనే గేమ్ నడిచింది

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ పెట్టిన టాస్క్ చివరికి ఒకరినొకరు తిట్టుకుంటూ, లాగి పడేసుకునేంత వరకు వచ్చింది. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం ‘అటవిలో ఆట’ అనే గేమ్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో భాగంగా కొంతమంది పోలీసులు, కొంతమంది దొంగలుగా వ్యవహరిస్తున్నారు. ఇక గీతూ ‘అత్యాశ గల వ్యాపారి’గా ఉండమని చెప్పారు బిగ్ బాస్. కానీ గీతూ తనకు తానే రూల్స్ క్రియేట్ చేసుకుని వ్యాపారిలా కాకుండా దొంగలా మారింది. ఆమె ఆట కన్నా మాటలే ఎక్కువయ్యాయి. బాలయ్య డైలాగులు కొడుతోంది. 

ప్రోమోలో ఆరోహి సూర్య గురించి మాట్లాడింది. గీతూతో ఎక్కువ సేపు ఉంటున్న సూర్యను చూసి ‘వీడు ఘోరమైన ఆట ఆడుతున్నాడు, చివరికి కెప్టెన్సీ కంటెండర్ అవుతాడు చూడు’ అంది కీర్తితో. ఇక గీతూ ‘అవకాశాలు లాక్కోవాలి సూర్య’ అంటూ హితబోద చేసింది. వెంటనే సూర్య లేచి వెళ్లాడు. ఇక గీతూ ఒక బ్రీఫ్ కేస్ నిండా డబ్బులు, దొంగలు కొట్టేసిన బొమ్మలు దాచుకుని దాన్ని పట్టుకునే తిరుగుతోంది. దొంగల్ని వెటకారంగా పాటలు పాడుతుంటే ఎవరో తెలియదు కానీ ‘ఓవర్ చేసేది కుక్కలే’ అన్నారు. దానికి గీతూ ‘నువ్వురిస్తే అరుపులే, నేనరిస్తే మెరుపులే, నన్నెవడ్రా ఆపేది’అంటూ యాటిట్యూడ్ చూపించింది. 

ఇక తరువాత ఆట జోరుగా సాగినట్టు చూపించారు బిగ్ బాస్. ఆ ఆటలో పోలీసులు, దొంగల మధ్య వాగ్వదాలు జరిగాయి. మధ్యలో ఫిజికల్ అయినట్టు కనిపించింది. ఇనయాను ఈడ్చి పడేశారు దొంగల టీమ్. ఇనయా - కీర్తి తిట్టుకుంటూ కనిపించారు. ఇక దొంగల టీమీ మెరీనా, ఇనయాను బెడ్ రూమ్ లో పెట్టి లాక్ వేయడానికి ప్రయత్నించారు. శ్రీ సత్య కోపంగా ‘ఫెయిర్ గేమ్ అన్నారు, భలే ఆడుతున్నారు, జనాలు చూస్తున్నారుగా వదిలెయ్’అంటూ చంటితో అంది. ఈ టాస్క్ లో ఎలా కెప్టెన్సీ కంటెండర్లను ఎంపిక చేస్తారో చూడాలి. 

ఇక ఈ వారం నామినేషన్లలో ఉన్న వారు ఈ గేమ్ లో ఆడి నిరూపించుకుంటేనే ఓట్లు పడేది. ఎప్పటిలాగే... ఎప్పుడూ ఆడే వారే ఆడుతున్నారు. వాసంతి ఎక్కడ కనిపించలేదు. కీర్తి కూడా పెద్దగా ఆడడం లేదు. ఈసారి వాసంతి బయటికి వెళ్లే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇనయా వీక్ కంటెస్టెంటే అయినా ఆటలో వెనుకడుగు వేయడం లేదు. కాబట్టి ఆమెకు ఓట్లు పడే అవకాశం ఉంది. ఇక గొడవల్లో కూడా బాగానే ఇరుక్కుంటోంది. ఆమెకు స్క్రీన్ స్పేస్ బాగానే లభిస్తోంది. ఇక స్క్రీన్ స్పేస్ అతి తక్కువగా ఉన్న వారు వాసంతి, కీర్తి. ఈసారి నామినేషన్లలో కీర్తి లేదు, కాబట్టి వాసంతి వెళ్లిపోయే ఛాన్సు అధికం. 

Also read: దొంగల టీమ్‌లో ఉండి పోలీసుల టీమ్‌ను గెలిపిస్తానన్నా రేవంత్, కారణం ఏంటో తెలుసా?

Also read: అడవిలో ఆట గేమ్‌లో నచ్చినట్టు ఆడిన గీతూ, బిగ్‌బాస్ రూల్స్ కూడా బేఖాతర్, చిరాకు పడ్డ ఇంటి సభ్యులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget