Bigg Boss 5 Telugu: సన్నీ-యానీకి గట్టిగానే పడింది … ఫొటోలను చించిపడేసిన నాగార్జున, ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...!
బిగ్ బాస్ సీజన్ 5లో ఏడోవారం వీకెండ్ వచ్చేసింది. ఈ వారం కూడా టాస్కుల్లో రెచ్చిపోయిన ఇంటి సభ్యులకు హోస్ట్ నాగార్జున గట్టిగానే క్లాస్ పీకినట్టున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్లు, కెప్టెన్సీ పోటీదారుల టాస్క్, కెప్టెన్సీ టాస్క్, లగ్జరీ బడ్జెట్ టాస్క్. ఇంతకు మించి ఆటా-పాటా-సరదా-సందడి లేనేలేదన్నది బిగ్ బాస్ ప్రేక్షకుల అభిప్రాయం. ఆ మూడు టాస్కుల్లోనూ ఆగర్భశత్రువుల్లా కొట్టుకుంటున్నారు. ఎవరికి వారే తగ్గేదే లే అన్నట్టు రెచ్చిపోతున్నారు. ''వీళ్లకి పువ్వుల్ని, అమ్మాయిల్ని చూపించండ్రా'' అనే డైలాగ్ గుర్తుచేసుకుంటున్నారంతా. మొదట్నుంచీ పరిస్థితి ఇలాగే ఉన్నప్పటికీ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో రచ్చ గురించి చెప్పడానికి మాటలు సరిపోవ్. సన్నీ వీక్ నెస్ తెలిసి శ్రీరామ్ కావాలనే రెచ్చగొట్టడం...సన్నీ మీదమీదకి వెళ్లడం, యానీ తనకు తానుగా పోటీ నుంచి తప్పుకోవడం ఈ మొత్తం వ్యవహారంపై వీకెండ్ షోలో హోస్ట్ నాగార్జున గట్టిగానే క్లాస్ పీకినట్టు అర్థమవుతోంది.
Weekend is here and @iamnagarjuna warns housemates for their mistakes #BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFire and #FiveMuchFun pic.twitter.com/eBGcp77qYa
— starmaa (@StarMaa) October 30, 2021
లోబో, రవి ఫొటోస్ చించేయడంతో మొదలైన ప్రోమోలో... హౌస్ మొత్తం డోంట్ గివప్ అంటున్నా యానీ మాస్టర్ గేమ్ లోంచి తప్పుకోవడం కరెక్ట్ కాదన్నారు నాగార్జున. గెలుపు కూడా పద్ధతిగా ఉండాలని తొండి ఆట సరికాదని కాజల్ కి చెప్పారు. హౌస్ లో అన్యాయం జరుగుతోందనే ఫీలింగ్ ఉందా అని మానస్ ని అడగ్గా... సంచాలక్ డెసిషన్ నచ్చలేదన్నాడు మానస్. స్పందించిన నాగార్జున బిగ్ బాస్ హౌజ్ లో సంచాలక్ డెసిషన్ ఫైనల్ తేల్చిచెప్పారు. ఇక సన్నీకి ఓ రేంజ్ లో క్లాస్ పడినట్టు అర్థమవుతోంది. తనని ప్రోవోక్ చేశారని సన్నీ చెప్పినప్పటికీ అయితే మీద మీదకు వెళ్లిపోతావా, ఎంతమంది పట్టుకుని ఆపారో తెలుసా అంటూ మండిపడిన నాగ్ సన్నీ ఫొటో చించిపడేశారు. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు దబిడ దిబిడే అన్నట్టు అర్థమవుతోంది.
Also Read: 'లవ్ యూ సో మచ్ అప్పు సర్'... అనుపమా ఆవేదన
ఇక ఈ వారం ఎలిమినేషన్ లో లోబో,రవి, సిరి, షణ్ముఖ్ జస్వంత్, మానస్, శ్రీరామ చంద్ర ఉన్నారు. ఈ వారం లోబో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. సీక్రెట్ రూంలోకి పంపినా బిగ్ బాస్ అంచనాల ప్రకారం పెర్ ఫార్మ్ చేయలేదు. పైగా హౌజ్ లోకి రీఎంట్రీ ఇచ్చాక కూడా లోబో యాక్టివ్ గా లేడని ఆ ప్రభావం ఓటింగ్ పై పడిందని తెలుస్తోంది.
Also Read: అందులో కాజల్ అగర్వాల్ సినిమా ఒక్కటీ లేదేంటి?
Also Read: బెయిల్‌పై విడుదలైన ఆర్యన్ ఖాన్ !
Also Read: తల్లితండ్రుల అంతిమ సంస్కారాలు జరిగిన ప్రదేశంలోనే...
Also Read: వరస్ట్ పెర్ఫార్మర్ గా సన్నీ.. జెస్సీపై మండిపడుతూ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి