అన్వేషించండి
Advertisement
Kajal Aggarwal: అందులో కాజల్ అగర్వాల్ సినిమా ఒక్కటీ లేదేంటి?
#KajGautKitched : కాజల్ అగర్వాల్, గౌతమ్ వివాహమై ఏడాది గడిచింది. ఈ సందర్భంగా ఏడాదిలో తామిద్దరం చూసిన సినిమాలు, సిరీస్‌లు ఏవో గౌతమ్ చెప్పారు. అందులో కాజల్ సినిమా ఒక్కటి కూడా లేదు. మరేం ఉన్నాయి? చూడండి.
కథానాయికగా కాజల్ అగర్వాల్ హాఫ్ సెంచరీ కొట్టారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సుమారు 50కు పైగా సినిమాలు చేశారు. అయితే... అందులో ఒక్క సినిమా కూడా భర్తతో కలిసి మళ్లీ మళ్లీ చూసిన సినిమాల జాబితాలో లేదు. గడచిన ఏడాది కాలంలో కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ దంపతులకు నచ్చిన సినిమాల జాబితాలో ఆమె సినిమా ఒక్కటి కూడా లేకపోవడం విచిత్రమే. తొలి వివావా వార్షికోత్సవం సందర్భంగా తామిద్దరికీ నచ్చిన సినిమా - వెబ్ సిరీస్‌లను కాజల్ భర్త గౌతమ్ వెల్లడించారు. అవేంటో మీరూ చూడండి.
కాజల్ & కిచ్లూకు నచ్చిన సిరీస్‌లు:
1. స్ట్రేంజర్ థింగ్స్ (Stranger Things)
2. గేమ్ ఆఫ్ థ్రోన్స్ (Game of Thrones)
3. షిట్స్ క్రీక్ (Schitt's Creek)
2. గేమ్ ఆఫ్ థ్రోన్స్ (Game of Thrones)
3. షిట్స్ క్రీక్ (Schitt's Creek)
4. బిలియన్స్ (Billions)
5. సక్సెషన్ (Succession)
5. సక్సెషన్ (Succession)
మళ్లీ మళ్లీ చూసిన చిత్రాలు
1. అందాజ్ అప్నా అప్నా (Andaz Apna Apna): తామిద్దరం ఎప్పుడు ఈ సినిమా చూసినా... తొలిసారి చూసినట్టు నవ్వుకుంటామని గౌతమ్ పేర్కొన్నారు.
2. నాటింగ్ హిల్ (Notting Hill): ఇద్దరి మనసుకు ఎంతో నచ్చిన చిత్రమిది.
3. ఇన్సెప్షన్ (Inception): దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ప్రతిభను ప్రశంసించడం కోసం మళ్లీ మళ్లీ ఈ సినిమా చూస్తున్నారట.
4. థ్రిల్లర్స్ & హారర్ మూవీస్ (Thrillers & Horror Movies): కాజల్ అండ్ కిచ్లూ దంపతులకు నచ్చిన మరో జానర్ థ్రిల్లర్స్ అండ్ హారర్ మూవీస్. అయితే... కాజల్ ఈ సినిమాలు చూసిన తర్వాత కాజల్ తాను భయపడటంతో పాటు అర్ధరాత్రి బాత్‌రూమ్‌కు వెళ్లినప్పుడు బయట భర్త నిలబడేలా చేస్తారట.
5. కొరియన్ మూవీస్ (KDrama): భార్యాభర్తలు ఇద్దరిలో కాజల్ అగర్వాల్‌కు కొరియన్ డ్రామా మూవీస్, సిరీస్‌లు అంటే ఎక్కువ ఇష్టం. ఆ జాబితాలో లవ్ అలారమ్ (Love Alaram), క్రాష్ లాండింగ్ ఆన్ యు (Crash Landing On You), ఇథవన్ క్లాస్ (Itaewon Class) ఉన్నాయి.

డాక్యుమెంటరీలు
1. ద గేమ్ ఆఫ్ ఛేంజర్స్ (The Game Of Changers): ప్లాంట్ బేస్డ్ డైట్ (పూర్తిగా మాంసాహారం మానేయడంతో పాటు పాలు కూడా తీసుకోరు. కేవలం ఆకుకూరలు, కూరగాయలు తింటారు అన్నమాట) గురించి తీసిన డాక్యుమెంటరీ ఇది.
2. టర్నింగ్ పాయింట్: 9/11 అండ్ ద వార్ ఆన్ టెర్రర్ (Turning Point 9/11 And The War On Terror): అమెరికన్ ట్విన్ టవర్స్ మీద 9/11 తీవ్రవాద దాడి నేపథ్యంలో తీసిన డాక్యుమెంటరీ ఇది. ఇటు అమెరికన్, అటు ఆఫ్ఘన్ ప్రభుత్వ అధికారులు, మాజీ సీఐఏ సభ్యులు, సైనికుల ఇంటర్వ్యూలతో దీనిని రూపొందించారు.
3. సీస్ పైరసీ (Seaspiracy): చేపల వేట సముద్ర జలాలు, పర్యావరణం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తోందనే అంశం మీద ఈ డాక్యుమెంటరీ తీశారు.

Also Read: పునీత్ రాజ్‌కుమార్... టాలీవుడ్‌కు దగ్గర బంధువు ఎలా అయ్యారు?
Also Read: మాస్టర్ లోహిత్ నుంచి. మిస్టర్ పునీత్ వరకు....
Also Read: 'రొమాంటిక్' సమీక్ష: రొమాన్స్ తక్కువ... రొటీన్ సీన్లు ఎక్కువ!
Also Read: 'ఫ్యామిలీ డ్రామా' సమీక్ష: థ్రిల్లింత కొంత... సుహాస్ నటన కొండంత!
Also Read: వరుడు కావలెను సమీక్ష: ఈ వరుడు చాలా రొటీన్ గురూ...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
పాలిటిక్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion