Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్... టాలీవుడ్‌కు దగ్గర బంధువు ఎలా అయ్యారు?
#PuneethRajkumar : పునీత్ రాజ్‌కుమార్ కన్నడ హీరో. కానీ, తెలుగు చిత్ర పరిశ్రమతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలుగు పరిశ్రమకు ఆయన దగ్గర బంధువు.
పవర్‌స్టార్ ఎవరు?
'పవన్ కల్యాణ్'
మన తెలుగువాళ్లకు!
మరి, కన్నడిగులకు?
పునీత్ రాజ్‌కుమార్.
పునీత్ రాజ్‌కుమార్...
కన్నడలో పవర్‌స్టార్!
టాలీవుడ్‌కు చాలా దగ్గర బంధువు!
చాలా అంటే చాలా దగ్గర బంధువు.
తెలుగువాళ్లతో సినిమాలు చేశారు.
తెలుగు సినిమాలు రీమేక్‌లు చేశారు.
తెలుగు ప్రముఖులతో సన్నిహితంగా ఉన్నారు.
కథానాయకుడిగా పునీత్ రాజ్‌కుమార్ కెరీర్‌లో...
తెలుగు చిత్ర పరిశ్రమ పాత్రను విస్మరించలేం!
ఎందుకంటే... అక్కడ ఆ కథల్లో నటిచింది ఆయనే.
కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ చిన్న కుమారుడిగా పునీత్ రాజ్‌కుమార్ చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. అభిమానులు మాత్రమే కాదు... చిత్రసీమ ప్రముఖులు సైతం ఆయన్ను 'అప్పు' అని ముద్దుగా పిలుస్తారు. పునీత్ హీరోగా పరిచయమైన తొలి సినిమా పేరు 'అప్పు'. దానికి దర్శకుడు పూరి జగన్నాథ్. అప్పటికి తెలుగులో ఆయన 'బద్రి', 'బాచి', 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం' సినిమాలు చేశారు. 'తమ్ముడు'ను రీమేక్ చేసే అవకాశం రావడంతో... కన్నడలో శివ రాజ్‌కుమార్‌తో చేశారు. అప్పుడు పూరి జగన్నాథ్‌ను తన తమ్ముడి కోసం కథ ఏమైనా ఉందా? అని శివ రాజ్‌కుమార్ అడగటంతో 'అప్పు' చేశారు. అదే కథతో తెలుగులో 'ఇడియట్' చేశారు పూరి. ఒక్క 'ఇడియట్' మాత్రమే కాదు... 'రెడీ', 'ఒక్కడు', 'దూకుడు' సినిమాలను కన్నడలో రీమేక్ చేశారు పునీత్ రాజ్‌కుమార్.
'రెడీ' అంటే రామ్...
'ఇడియట్' అంటే రవితేజ...
'ఆంధ్రావాలా' అంటే ఎన్టీఆర్...
'దూకుడు' అంటే మహేశ్‌బాబు...
తెలుగు ప్రేక్షకుల మదిలో మెదులుతారు.
కన్నడ ప్రేక్షకులకు మాత్రం పునీత్ రాజ్‌కుమార్ గుర్తొస్తారు.
ఎందుకంటే... అక్కడ ఆయా కథల్లో నటించింది ఆయనే.
తెలుగు సినిమాలు రీమేక్ చేయడం మాత్రమే కాదు... తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన సాంకేతిక నిపుణులు, నిర్మాతలతో పునీత్ రాజ్‌కుమార్ పని చేశారు. 'అప్పు'తో పరిచయమైన పూరి జగన్నాథ్‌తో పునీత్ ప్రయాణం కొన్నాళ్లు కొనసాగింది. తెలుగులో 'ఆంధ్రావాలా' పరాజయం పాలైంది. కానీ, అదే కథతో కన్నడలో 'వీర కన్నడిగ' చేశారు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఆ చిత్రంతో సంగీత దర్శకుడు చక్రి కన్నడ పరిశ్రమకు పరిచయమయ్యారు. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌తోనూ పునీత్ రాజ్‌కుమార్ పని చేశారు. 'ఆకాశ్', 'వంశీ'... పునీత్‌తో రెండు చిత్రాలు చేశారు ఆర్పీ.
మహేశ్‌బాబు హీరోగా నటించిన 'ఒక్కడు', 'దూకుడు' చిత్రాలను కన్నడలో రీమేక్ చేశారు. 'ఒక్కడు' రీమేక్ 'అజయ్'కు మణిశర్మను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. 'దూకుడు' రీమేక్ 'పవర్'కు తమన్‌ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఆ తర్వాత అతడితో రెండు చిత్రాలు చేశారు. ఆ సినిమాను తెలుగులో నిర్మించిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థే కన్నడలోనూ నిర్మించింది. కేవలం తెలుగు సినిమాలను కన్నడలో రీమేక్ చేయడం మాత్రమే కాదు... తెలుగు సినిమా ప్రముఖులతోనూ పునీత్ రాజ్‌కుమార్‌కు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. జయంత్ సి. పరాన్జీని 'నిన్నందలే' సినిమాతో కన్నడ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం చేశారు. తెలుగు రచయిత, దర్శకుడు జనార్ధన్ మహర్షి అందించిన కథలతో రెండు చిత్రాలు 'ఆకాశ్', 'అరసు' చేశారు.
Also Read: గుండెపోటుతో కన్నడ పవర్‌స్టార్ మృతి
Also Read: కర్ణాటకలో హైఅలర్ట్.. థియేటర్లు మూసేసిన ప్రభుత్వం
పునీత్ తండ్రి, కన్నడ ప్రజలు దైవంగా కొలిచే కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌తో నందమూరి, కొణిదెల, మంచు కుటుంబాలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారితో పునీత్ స్నేహపూర్వకంగా ఉంటారు. బాలకృష్ణ కోసం 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో పునీత్ అన్నయ్య శివ రాజ్‌కుమార్ అతిథి పాత్ర చేశారు. ఓ స్టార్ వారసుడు అయినప్పటికీ... ఒదిగి ఉండటం పునీత్‌కు అలవాటు. అందుకు ఉదాహరణగా ఓ సంఘటన చెప్పుకోవాలి. ఆయన చివరి సినిమా 'యువరత్న' తెలుగులోనూ విడుదలైంది. అప్పుడు హైదరాబాద్ వచ్చారు. 'పవర్‌స్టార్' అని పిలిస్తే... 'పవర్‌స్టార్ అంటే ఎప్పుడూ పవన్‌కల్యాణే. నన్ను పునీత్ రాజ్‌కుమార్ అంటే చాలు' అని వినమ్రంగా చెప్పారు. 'యువరత్న' చూస్తే... అక్కినేని నాగచైతన్య 'జోష్' స్ఫూర్తితో తీశారేమో అనిపిస్తుంది.
Also Read: మాస్టర్ లోహిత్ నుంచి మిస్టర్ పునీత్ వరకు....
ఎన్టీఆర్ 'ఆంధ్రావాలా'ను కన్నడలో చేయడమే కాదు... ఎన్టీఆర్ అంటే పునీత్‌కు ఎంతో అభిమానం. సోదర సమానుడిగా చూస్తారు. పునీత్ రాజ్‌కుమార్ సినిమా 'చక్రవ్యూహ'లో ఎన్టీఆర్ 'గెలియా... గెలియా' పాట పాడారు. ఎన్టీఆర్ గురించి పునీత్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ ''ఎన్టీఆర్ తల్లి కన్నడిగ. ఆ విధంగా ఎన్టీఆర్ హాఫ్ కన్నడిగ. తను నా బ్రదర్" అని ఒకానొక సందర్భంలో చెప్పారు. యువ హీరోలు రామ్‌చరణ్, నందమూరి కల్యాణ్‌రామ్, మంచు విష్ణు తదితరులకు పునీత్ రాజ్‌కుమార్ క్లోజ్.
Also Read: ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావ్! - పునీత్ మరణంపై అనుష్క స్పందన
Also Read: నోట మాట రాలేదు... పునీత్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి
Also Read: పునీత్ మరణం నమ్మశక్యంగా లేదు.. పవన్ భావోద్వేగం...
Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. మోదీ ట్వీట్
హీరోగా పునీత్ రాజ్‌కుమార్ చేసిన సినిమాల సంఖ్య 29. అందులో తెలుగు దర్శక - రచయితలు, సంగీత దర్శకులతో చేసిన సినిమాలు, తెలుగు రీమేక్‌లు సుమారు పదివరకూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా తెలుగు చిత్ర పరిశ్రమకు పునీత్ దగ్గర బంధువే. అందుకనే, ఆయన మరణించగానే... తెలుగు పరిశ్రమలో అగ్ర కథానాయకులు, ఇంతమంది ప్రముఖులు స్పందించారు.
Also Read: 'రొమాంటిక్' సమీక్ష: రొమాన్స్ తక్కువ... రొటీన్ సీన్లు ఎక్కువ!
Also Read: 'ఫ్యామిలీ డ్రామా' సమీక్ష: థ్రిల్లింత కొంత... సుహాస్ నటన కొండంత!
Also Read: వరుడు కావలెను సమీక్ష: ఈ వరుడు చాలా రొటీన్ గురూ...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి