అన్వేషించండి

Puneeth Rajkumar: గుండెపోటుతో క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్‌ మృతి

#PuneethRajkumar: గుండెపోటు ఓ కన్నడ హీరోను బలి తీసుకుంది. చిన్న వయసులో 46 ఏళ్లకు పునీత్ రాజ్‌కుమార్‌ తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్‌ (46) ఇకలేరు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. జిమ్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించిందని... పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారట. పునీత్ మరణవార్తతో కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నడ ప్రేక్షకులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే... రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు ఇంకా పునీత్ మరణవార్తను అధికారికంగా ప్రకటించలేదు. కర్ణాటక ముఖ్యమంత్రి అధికారికంగా వెల్లడించనున్నారని సమాచారం.

Also Read: 'రొమాంటిక్' సమీక్ష: రొమాన్స్ తక్కువ... రొటీన్ సీన్లు ఎక్కువ!

Also Read: మాస్టర్ లోహిత్ నుంచి మిస్టర్ పునీత్ వరకు....

Also Read: ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావ్! - పునీత్ మరణంపై అనుష్క స్పందన

Also Read: నోట మాట రాలేదు... పునీత్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి

పునీత్ రాజ్‌కుమార్‌ మరణం విషయంలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తొలుత ఆయనకు మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని ప్రచారం జరిగింది. అయితే... ఆ తర్వాత సీరియస్ అని అర్థమైంది. పునీత్ మరణవార్తను లక్ష్మీ మంచు తొలుత ట్వీట్ చేశారు. ప్రస్తుతం పునీత్ సోదరుడు శివ రాజ్ కుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ తదితర ప్రముఖులు బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రిలో ఉన్నారు.

Also Read: 'ఫ్యామిలీ డ్రామా' సమీక్ష: థ్రిల్లింత కొంత... సుహాస్ నటన కొండంత!

"ఓ మై గాడ్. నో... ఇది నిజం కాకూడదు. ఇలా ఎలా జరుగుతుంది. రాజ్ కుమార్ ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. పునీత్ చాలా త్వరగా వెళ్లిపోయారు" అని లక్ష్మీ మంచు ట్వీట్ చేశారు.

"హృదయం ముక్కలైంది. బ్రదర్... నిన్నెప్పుడూ మిస్ అవుతా" అని నటుడు సోనూ సూద్ ట్వీట్ చేశారు.

"హార్ట్ బ్రోకెన్ పునీత్ రాజ్ కుమార్ అన్నా... నాట్ ఫెయిర్" అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు.  

కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, పార్వతమ్మ దంపతుల కుమారుడే పునీత్. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించారు. 'బెట్టాడ హువా' చిత్రానికి గాను ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నారు. హీరోగా 29 చిత్రాలు చేశారు. అభిమానులు ఆయన్ను ముద్దుగా 'అప్పు' అని పిలుస్తారు. పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్ సైతం కన్నడలో ప్రముఖ హీరో. ఆయన హీరోగా నటించిన 'జై భజరంగీ' (కన్నడలో భజరంగీ 2' నేడు విడుదలైంది. ఇటీవల జరిగిన ఆ సినిమా వేడుకలో 'కె.జి.యఫ్' ఫేమ్ యష్, అన్నయ్యతో కలిసి పునీత్ డాన్స్ చేశారు.   

Also Read: వరుడు కావలెను సమీక్ష: ఈ వరుడు చాలా రొటీన్ గురూ...

Also Read: కర్ణాటకలో హైఅలర్ట్‌.. థియేటర్లు మూసేసిన ప్రభుత్వం

Also Read: పునీత్ మొదటి సినిమా తెలుగు డైరెక్టర్‌తోనే.. ఏకంగా నాలుగు భాషల్లో రీమేక్.. తెలుగులో ఏ హీరో చేశాడంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Ram Charan : రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' స్టోరీ అది కాదు - అసలు స్టోరీ ఏంటో చెప్పిన కార్తీక్ సుబ్బరాజు
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' స్టోరీ అది కాదు - అసలు స్టోరీ ఏంటో చెప్పిన కార్తీక్ సుబ్బరాజు
Meghasandesam Serial Today October 30th: ‘మేఘసందేశం’ సీరియల్‌: ఆకాష్‌ను కిస్‌ చేసుకున్న భూమి – నిజం తెలిసి ఇరిటేట్‌ అయిన అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: ఆకాష్‌ను కిస్‌ చేసుకున్న భూమి – నిజం తెలిసి ఇరిటేట్‌ అయిన అపూర్వ
Nindu Noorella Saavasam Serial Today October 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌తో గేమ్ ఆడిన భాగీ – మధ్యలో నలిగిపోయిన రాథోడ్‌   
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌తో గేమ్ ఆడిన భాగీ – మధ్యలో నలిగిపోయిన రాథోడ్‌   
Karthika Deepam 2 Serial Today October 30th: కార్తీకదీపం 2 సీరియల్: గిన్నెలు కడిగిన జ్యోత్స్న.. వీడియో వైరల్..! సూరజ్‌ని నిందించిన చిన్న తాత! సుమిత్ర మాటలు విని ఏడ్చేసిన జ్యో!
కార్తీకదీపం 2 సీరియల్: గిన్నెలు కడిగిన జ్యోత్స్న.. వీడియో వైరల్..! సూరజ్‌ని నిందించిన చిన్న తాత! సుమిత్ర మాటలు విని ఏడ్చేసిన జ్యో!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
Bigg Boss Season 10 Today October 29th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
Gill Temple Gadget: నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Embed widget