Puneeth Rajkumar: నోట మాట రాలేదు... పునీత్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హాఠాన్మరణం కన్నడ పరిశ్రమ ప్రముఖులను మాత్రమే కాదు... అన్ని పరిశ్రమల ప్రముఖులను షాక్ కి గురి చేసింది. పలువురు అతడి మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హాఠాన్మరణం కన్నడ చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులను మాత్రమే కాదు... అన్ని పరిశ్రమల ప్రముఖులను షాక్ కి గురి చేసింది. పునీత్ వయసు 46 ఏళ్లు. చిన్న వయసులో తిరిగిరాని లోకాలకు వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌తో తెలుగు, తమిళం, మలయాళ, హిందీ చిత్రసీమ ప్రముఖులతో సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. పునీత్ మరణం పట్ల అన్ని భాషల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
నా నోట మాట రాలేదు! - మెగాస్టార్ చిరంజీవి
Also Read: 'రొమాంటిక్' సమీక్ష: రొమాన్స్ తక్కువ... రొటీన్ సీన్లు ఎక్కువ!
Also Read: 'ఫ్యామిలీ డ్రామా' సమీక్ష: థ్రిల్లింత కొంత... సుహాస్ నటన కొండంత!
Also Read: వరుడు కావలెను సమీక్ష: ఈ వరుడు చాలా రొటీన్ గురూ...
భారత సినీ పరిశ్రమకు లోటు! - మోహన్ బాబు
"మా కుటుంబానికి, రాజ్ కుమార్ గారి కుటుంబానికి చాలా సాన్నిహిత్యం ఉంది. రాజ్ కుమార్ గారి కుమారుడు పునీత్ అకాల మరణం చెందిన వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఇది కన్నడ సినీ పరిశ్రమకే కాదు... యావద్ భారతదేశ సినీ పరిశ్రమకి తీరని లోటు" అని డా. మంచు మోహన్ బాబు పేర్కొన్నారు.
Shocked and deeply saddened by the tragic news of Puneeth Rajkumar's demise. One of the most humble people I've met and interacted with. Heartfelt condolences to his family and loved ones 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) October 29, 2021
"నటనతో మాత్రమే కాదు... మానవత్వంలోనూ తండ్రి లెగసీని విజయవంతంగా పునీత్ రాజ్ కుమార్ కొనసాగించారు. ఆయన నాకు అత్యంత ఆప్తులు. రాజ్ కుమార్ కుటుంబానికి, పునీత్ వీరాభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను" - రామ్ చరణ్
My dearest brother #PuneetRajkumar Garu is one of the most warmest people ever. He not only successfully took the legacy forward of his late father Rajkumar Garu with his acting but also with his kindness.
— Ram Charan (@AlwaysRamCharan) October 29, 2021
My deepest condolences to his family & diehard fans
You will be missed🙏🙏