Puneeth Rajkumar Death: మాస్టర్ లోహిత్ నుంచి. మిస్టర్ పునీత్ వరకు....
బాలనటుడిగా వెండితెరపై అడుగుపెట్టి స్టార్ హీరో స్టేటస్ దక్కించుకున్న పునీత్ రాజ్ కుమార్ వెండితెర జర్నీ ఇప్పుడు చూద్దాం....
లెజెండరీ యాక్టర్ కంఠీరవ రాజ్‌కుమార్, పార్వతమ్మలకు చెన్నైలో 1975 మార్చి 17న జన్మించారు పునీత్ . రాజ్ కుమార్ కు పుట్టిన ఐదుగురు పిల్లల్లో పునీత్ చిన్నవాడు. ఆయన సోదరుడు శివ రాజ్‌కుమార్ ప్రముఖ నటుడు. పునీత్‌కు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు అతని కుటుంబం మైసూర్‌కు వెళ్లి, అక్కడే స్థిరపడింది. పునీత్ చిక్ మగలూర్ కు చెందిన అశ్విని రేవంత్‌ని 1999 డిసెంబర్ 1 న వివాహం చేసుకున్నారు. పునీత్, అశ్విని దంపతులకు ఇద్దరు కుమార్తెలు ధృతి, వందిత.
పునీత్ రాజ్ కుమార్ కెరీర్ విషయానికొస్తే ఇప్పటి వరకు 29 సినిమాల్లో నటించిన పునీత్ ఏడాది వయసు లోపలే V. సోమశేఖర్ 'ప్రేమద కనికే '(1976)లో అతిధి పాత్రలో కనిపించాడు . అప్పటి నుంచీ వరుస మూవీస్ లో నటిస్తూనే ఉన్నాడు. తండ్రి రాజ్ కుమార్ తో కలసి ఎక్కువ సినిమాల్లో నటించిన పునీత్.. బాలనటుడిగా సుమారు 14 సినిమాల్లో నటించారు.
2002లో ‘అప్పు’ (తెలుగులో ‘ఇడియట్’)తో హీరోగా టర్న్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా ‘వీర కన్నడిత’, ‘అరసు’, ‘మిలనా’, ‘వంశీ’, ‘రాజ్’, ‘జాకీ’, ‘హుడుగరు’, ‘అన్నా బాండ్’, ‘యారే కూగడాలి’, ‘పవర్’, ‘దొడ్డమానే హుడుగ’, ‘రాజకుమార’, ‘యువరత్న’ సినిమాలతో మాస్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు పునీత్. సూపర్ స్టార్ తనయుడు అయినప్పటికీ తనని తాను ప్రూవ్ చేసుకుని పవర్ స్టార్ అనే బిరుదు పొందాడు. మంచి డ్యాన్సర్ కూడా కావడంతో పునీత్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఎన్నో తెలుగు సూపర్ హిట్ సినిమాలను పునీత్ కన్నడలో రీమేక్ చేశారు. తెలుగు హీరోలతో కూడా తనకు సత్సంబంధాలు ఉన్నాయి. చక్రవ్యూహ సినిమాలో గెలయా గెలయా పాటను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పాడాడు. బాలకృష్ణ, చిరంజీవి, రామ్ చరణ్ వంటి హీరోలతో పునీత్ ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. ఇప్పుడు తన మృతితో తెలుగు ఇండస్ట్రీ కూడా షాక్‌లోకి వెళ్లింది.
Also Read: బ్రేకింగ్... గుండెపోటుతో కన్నడ పవర్‌స్టార్ మృతి
పునీత్ మొదటి సారిగా 'అరసు' సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. 'మిలనా' మూవీకి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ చివరిగా ’యువరత్న’ అనే సినిమాలో నటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి విశేషాదరణ పొందింది. పునీత్ వి ''జేమ్స్', 'ద్విత్వ' సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. నటన మాత్రమే కాదు నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు పునీత్. బుల్లితెరపై కొన్ని డ్యాన్స్ షోలకు హోస్ట్ గా వ్యవహరించారు పునీత్.
Also Read: పునీత్ మొదటి సినిమా తెలుగు డైరెక్టర్‌తోనే.. ఏకంగా నాలుగు భాషల్లో రీమేక్.. తెలుగులో ఏ హీరో చేశాడంటే?
Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి