Puneeth Rajkumar: కర్ణాటకలో హైఅలర్ట్.. థియేటర్లు మూసేసిన ప్రభుత్వం
పునీత్ రాజ్ కుమార్ మరణించడంతో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. హాస్పిటల్ తో పాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. ఈరోజు ఆయన జిమ్ చేస్తుండగా.. ఉదయం 9:45 గంటలకు ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే బెంగుళూరులోకి విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు. వెంటనే ఆయన్ను ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన మరణవార్త సినీ ఇండస్ట్రీని, అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. అభిమానులు భారీ సంఖ్యలో హాస్పిటల్ కు చేరుకుంటున్నారు.
Also Read: బ్రేకింగ్... గుండెపోటుతో కన్నడ పవర్‌స్టార్ మృతి
దీంతో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. హాస్పిటల్ తో పాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇప్పటికే శాండల్‌వుడ్ సినీ ప్రముఖులు విక్రమ్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. రెండు రోజులపాటు సినిమా థియేటర్లు మూసే ఉంటాయని తెలుస్తోంది.
BREAKING :
— T2BLive.COM (@T2BLive) October 29, 2021
High alert declared in #Karnataka . Police battalions deployed. Govt ordered to close theatres immediately. #PuneethRajKumar #Bangalore
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్ కుమార్ అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన డబ్బింగ్ సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. చివరిగా ఆయన నటించిన 'యువరత్న' సినిమా తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. బాల నటుడిగా ఆయన దాదాపు 14 సినిమాల్లో నటించారు. తెలుగులో సక్సెస్ అయిన 'ఇడియట్' సినిమాను 'అప్పు' పేరుతో కన్నడలో నటించి.. ఆ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత వరుస సినిమాల్లో నటిస్తూ హిట్టు మీద హిట్టు అందుకున్నారు. మాస్ ప్రేక్షకుల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. నిర్మాతగా కూడా ఆయన సినిమాలను రూపొందించారు. కొన్ని టీవీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరించారు.
Also Read: పునీత్ మొదటి సినిమా తెలుగు డైరెక్టర్‌తోనే.. ఏకంగా నాలుగు భాషల్లో రీమేక్.. తెలుగులో ఏ హీరో చేశాడంటే?
Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత
Also Read: పునీత్‌కు హార్ట్ఎటాక్?.. అతిగా జిమ్ చేస్తే గుండె ఆగుతుందా? అసలేం జరిగింది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి





















