Pawan Kalyan: పునీత్ మరణం నమ్మశక్యంగా లేదు.. పవన్ భావోద్వేగం..

పునీత్ రాజ్ కుమార్ మరణంపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్ వంటి వారి ఎమోషనల్ అవుతూ కొన్ని కామెంట్స్ చేయగా.. తాజాగా పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

FOLLOW US: 

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈరోజు కన్నుమూశారు. ఆయన మరణవార్తతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా పునీత్ మరణంపై స్పందిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్ వంటి వారి ఎమోషనల్ అవుతూ కొన్ని కామెంట్స్ చేయగా.. తాజాగా పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

Also Read: బ్రేకింగ్... గుండెపోటుతో క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్‌ మృతి

''ప్రముఖ కన్నడ కథానాయకుడు శ్రీ పునీత్ రాజ్ కుమార్ గారు తుది శ్వాస విడిచారనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. నమ్మశక్యం కాలేదు. శ్రీ పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రముఖ నటులు, కన్నడ కంఠీరవ దివంగత శ్రీ రాజ్ కుమార్ గారి కుమారుడిగా ఆయన అడుగుజాడల్లో నట ప్రయాణం సాగిస్తున్న శ్రీ పునీత్ గుండెపోటుతో స్వర్గస్తులు కావడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. బాల నటుడిగానే కన్నడ ప్రేక్షకులకు చేరువైన ఆయన ఆ దశలోనే ఎన్నో పురస్కారాలు అందుకొన్నారు. కథానాయకుడిగా ఎన్నో విజయాలు దక్కించుకొన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న శ్రీ పునీత్ అనూహ్యంగా మృతి చెందటం సినీ ప్రేక్షలకు బాధాకరం. శ్రీ పునీత్ రాజ్ కుమార్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను'' అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. 

పునీత్ ని అందరూ పవర్ స్టార్ ని పిలుచుకుంటారు. అయితే పునీత్ రాజ్‌కుమార్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. 'పవర్ స్టార్' అంటే పవన్ కల్యాణ్ గారు మాత్రమేనని అని, ఇక మీదట తనను పవర్ స్టార్ అని పిలవొద్దంటూ.. పవన్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు.

Published at : 29 Oct 2021 04:20 PM (IST) Tags: chiranjeevi pawan kalyan Puneeth Rajkumar Puneeth Rajkumar Death kamal haassan

సంబంధిత కథనాలు

Vishal accident: 'లాఠీ' షూటింగ్, మళ్లీ గాయపడ్డ విశాల్

Vishal accident: 'లాఠీ' షూటింగ్, మళ్లీ గాయపడ్డ విశాల్

Alluri Movie Teaser: శ్రీవిష్ణును ఇంత పవర్‌ఫుల్‌గా ఏ సినిమాలో చూసుండరు, అల్లూరి టీజర్ అదిరిపోయిందిగా

Alluri Movie Teaser: శ్రీవిష్ణును ఇంత పవర్‌ఫుల్‌గా ఏ సినిమాలో చూసుండరు, అల్లూరి టీజర్ అదిరిపోయిందిగా

Janaki Kalaganaledu July 4 Episode: ‘జానకి కలగనలేదు’ - చెత్త కాగితాల్లోకి జానకి ఎస్సైనమెంట్ పేపర్స్, జ్ఞానంబ ప్రశ్నకు జానకి మౌనంగా

Janaki Kalaganaledu July 4 Episode: ‘జానకి కలగనలేదు’ - చెత్త కాగితాల్లోకి జానకి ఎస్సైనమెంట్ పేపర్స్, జ్ఞానంబ ప్రశ్నకు జానకి మౌనంగా

Gruhalakshmi July 4 Episode: ‘గృహలక్ష్మి’ జులై 4 ఎపిసోడ్ - లాస్యకి చెక్ పెట్టిన తులసి, నందు ఆగ్రహం

Gruhalakshmi July 4 Episode: ‘గృహలక్ష్మి’ జులై 4 ఎపిసోడ్ - లాస్యకి చెక్ పెట్టిన తులసి, నందు ఆగ్రహం

Devatha july 4 episode: పచ్చబొట్టు వేయించుకోబోయిన దేవి, ఫోన్ విషయంలో జానకి దంపతులకి దొరికిపోయిన రాధ

Devatha july 4 episode: పచ్చబొట్టు వేయించుకోబోయిన దేవి, ఫోన్ విషయంలో జానకి దంపతులకి దొరికిపోయిన రాధ

టాప్ స్టోరీస్

Modi Helicopter Black Balloons: మోదీ హెలికాప్టర్ పక్కనే నల్ల బెలూన్లు, ఏపీ పర్యటనలో భద్రతలోపం! ఎవరు వదిలారంటే

Modi Helicopter Black Balloons: మోదీ హెలికాప్టర్ పక్కనే నల్ల బెలూన్లు, ఏపీ పర్యటనలో భద్రతలోపం! ఎవరు వదిలారంటే

Talasani Srinivas: మోదీ సభ చప్పగా ఉంది, కేసీఆర్ అడిగిన ప్రశ్నల సంగతేంటి?

Talasani Srinivas: మోదీ సభ చప్పగా ఉంది, కేసీఆర్ అడిగిన ప్రశ్నల సంగతేంటి?

Pakistan: లోయలో పడిన బస్సు- 19 మంది మృతి!

Pakistan: లోయలో పడిన బస్సు- 19 మంది మృతి!

Alluri Sitarama Raju: తెల్లవాళ్లు అల్లూరి తలకి వెల కడితే... ఆయన వాళ్ళ శవాలకు కట్టాడు

Alluri Sitarama Raju: తెల్లవాళ్లు అల్లూరి తలకి వెల కడితే... ఆయన వాళ్ళ శవాలకు కట్టాడు