Nindu Noorella Saavasam Serial Today February 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్ ముందే బుజ్జమ్మను తిట్టిన భాగీ – మనోహరి మీద కోప్పడిన అమర్
Nindu Noorella Saavasam serial Today Episode February 27th: అమర్ ఇంటికి వచ్చిన బుజ్జమ్మను తెలియనట్టు భాగీ తిట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ అమర్ ఇంట్లో సెట్ అయిన తర్వాతి రోజు రాజు కూడా బుజ్జమ్మను తీసుకుని అమర్ ఇంటికి వస్తాడు. రాజు, బుజ్జమ్మ గేటు దాటి ఇంట్లోకి రావడం మనోహరి, చంభా చూస్తారు.
మనోహరి: ఇదేంటి చంభా ఆ ముసలోడు ఆ పిల్లను తీసుకుని ఇక్కడికి వస్తున్నాడు.
చంభా: తల్లి ఎక్కడుంటే పిల్ల అక్కడే కదా ఉంటుంది
మనోహరి: నువ్వు ఆపుతావా..? వాళ్లు తల్లీపిల్లలు అని అమర్‌కు తెలియకూడదు.
చంభా: నాకో విషయం అర్థం కావడం లేదు మనోహరి. ఆ పిల్లే తన కూతురు అని భాగీ, అమర్ కు ఎందుకు చెప్పడం లేదంటావు..
మనోహరి: భాగీ ఇక్కడకు వచ్చింది నన్ను అమర్‌ను కలపడానికి.. తండ్రీ కూతుళ్లను కలపడానికి కాదు ( మనసులో నన్ను అమర్‌ను కలపగానే.. భాగీ ఆ పిల్లను తీసుకుని దూరంగా వెళ్లిపోతుంది)
చంభా: (మనసులో) వాళ్ల వలలో బాగా చిక్కుకుపోయావు
బుజ్జమ్మ: హాయ్ అంటీ ఎలా ఉన్నారు..?
మనోహరి: హాయ్ పాప.. ఏంటి రాజు గారు పాపను తీసుకుని ఇక్కడికి వచ్చారు
రాజు: మీకు తెలిసిందే కదా మేడం భాగీ గారు పాపను వదిలి ఎక్కువ రోజులు ఉండలేరు కదా..?
మనోహరి: ఈ పాప తన కూతురు అని అమర్‌కు తెలియకూడదని భాగీ చెప్పింది కదా..?
బుజ్జమ్మ: నేను మా అమ్మ ఎవరో తెలియనట్టు నటిస్తాను ఆంటీ
చంభా: (మనసులో) తల్లి మూడు ఆకులు చదివితే పిల్ల ఆరు ఆకులు చదివినట్టు ఉంది. ఈ వయసుకే ఇన్ని తెలివితేటలేంటే నీకు
మనోహరి: సరే జాగ్రత్తగా మ్యానేజ్ చేయాలి. సరే పదండి లోపలికి వెళ్ధాం
అందరూ లోపలికి వెళ్తారు. బుజ్జమ్మను చూసి అమ్ము, అంజు, ఆకాష్, ఆనంద్ హ్యాపీగా నవ్వుతూ వెళ్లి రిసీవ్ చేసుకుంటారు. అమర్ వస్తాడు.
రాజు: సార్ బుజ్జమ్మ కొన్ని రోజులు మీ దగ్గరే ఉంటానంది అందుకే తీసుకొచ్చాను
అమర్: బలే వారే రాజు గారు కొన్నాళ్లేంటి ఎన్నాళ్లైనా బుజ్జమ్మ మా దగ్గరే ఉండొచ్చు
రాజు: థాంక్యూ సార్
బుజ్జమ్మ: థాంక్యూ సార్
భాగీ: ఈ పాప ఎవరు…?
బుజ్జమ్మ: మీరు ఎవరు..? మేడం..
చంభా షాక్
రాథోడ్: ఈ పాప సారుకు చాలా ఇష్టమైన పాప మిస్సమ్మ.. ఈవిడ ఒకప్పుడు ఈ పిల్లలకు కేర్ టేకర్ బుజ్జమ్మ
బుజ్జమ్మ: ఓహో అలాగా
చంభా: నేను ఇక్కడ ఉండలేను మనోహరి నేను వెళ్లిపోతాను
మనోహరి: ఏయ్ ఎక్కడికి వెళ్తావు నోరు మూసుకుని ఇక్కడే ఉండు
రాజు: నమస్కారం మేడం బాగున్నారా..?
భాగీ: బాగున్నాను రాజు గారు మీరు ఎలా ఉన్నారు.. ఆశ్రమం పిల్లలు ఎలా ఉన్నారు
రాజు: మీ దయ వల్ల బాగున్నాము మేడం.. మీరు ఊరెళ్లారు అని చెప్పారు.. ఎప్పుడొచ్చారు మేడం
రాథోడ్: మిస్సమ్మ ఈ రోజే వచ్చింది రాజు గారు.. ఈ ఇంటికి కల వచ్చింది. మా అందరి కళ్లల్లో వెలుగు వచ్చింది.
అమర్: రాథోడ్ ఆపుతావా..?
మనోహరి: అనవసరంగా అమర్ కు కోపం తెప్పించకు రాథోడ్..
అమర్ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పిల్లలు కూడా భాగీని తిట్టినట్టు నటిస్తారు. మనోహరి వెళ్లిపోతుంది. అందరూ నవ్వుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!























