Meghasandesam Serial Today February 27th: ‘మేఘసందేశం’ సీరియల్: చనిపోయిన మీరా – గగన్ కు గతం గుర్తు చేసిన భూమి
Meghasandesam serial today episode February 27th: చెర్రి చనిపోయాడనుకుని మీరా సూసైడ్ చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: చెర్రి చనిపోయాడని తెలుసుకున్న మీరా గుండె పగిలి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటుంది. శరత్ చంద్రకు ఒక సూసైడ్ నోట్ రాస్తుంది. ఆ నోట్ చదివిన శరత్ చంద్ర ఏడుస్తుంటాడు. మీరా శవం దగ్గర అందరూ కూర్చుని ఉండగా పోలీసులు వస్తారు.
ఎస్సై: అపూర్వ గారు చెర్రిని చంపినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము.. మీకు సపోర్ట్ చేసినందుకు సుజాత, నక్షత్రలను కూడా అరెస్ట్ చేస్తున్నాము..
అపూర్వ: బావ..
ఎస్సై: ఏదైనా ఉంటే మీరు అనుకున్న వాళ్లను స్టేషన్‌కు పిలిచి మాట్లాడండి. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి.
కానిస్టేబుల్: మేడం రండి..
సుజాత: అయ్యయ్యో..
ఎస్సై: తీసుకురండి..
కానిస్టేబుల్: ఓకే సార్..
అంటూ అపూర్వను తీసుకుని పోలీసులు వెళ్లిపోతుంటే.. అప్పుడే చెర్రి, కేపీ వస్తారు. వాళ్లను చూసి అందరూ షాక్ అవుతారు. లోపలికి వెళ్లిన చెర్రి, కేపీ, మీరా శవాన్ని చూసి బాధపడతారు. చెర్రి ఏడుస్తూ పక్కన కూర్చుంటాడు.
చెర్రి: అమ్మా నాకు ఆకలిగా ఉందమ్మా.. నాకు ఆకలిగా ఉంటే నువ్వు ఉండలేవు కదమ్మా..? అమ్మా నీ చేతితో దోశ చేసి నాన్నకు ఇచ్చావు కదా..? అది నేనే తిన్నాననమ్మా.. అమ్మా నాకు ఆకలిగా ఉందమ్మా ఒక్కసారి లేవమ్మా..?
కేపీ: చెర్రి మీ అమ్మ లేవదురా..? తను బతికి ఉన్నప్పుడే చెప్పి ఉండాల్సిందిరా..?
చెర్రి: అమ్మా..
అంటూ చెర్రి, కేపీ బాధపడుతుంటే.. శరత్ చంద్ర మాత్రం అనుమానంగా చూస్తుంటాడు. చనిపోయిన చెర్రి ఎలా తిరిగొచ్చాడని ఆలోచిస్తుంటాడు. మీరా రాసిన సూసైడ్ లెటర్ గుర్తు చేసుకుంటాడు. అపూర్వ చెర్రిని చంపిన వీడియో గుర్తు చేసుకుంటాడు. అపూర్వను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం గుర్తు చేసుకుంటాడు. మరోవైపు వాలెంటైన్స్ డే వేడుకల్లో ఉన్న భూమి స్టేజీ మీదకు ఎక్కి మాట్లాడాలని అందరూ కోరతారు. దీంతో భూమి స్టేజీ మీదకు వెళ్తుంది. గగన్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు.
భూమి: అందరికీ నమస్కారం. నా పేరు భూమి. ఇక్కడ అందరూ ప్రేమికులు ఉన్నారు.. అందరు ఎవరినో ఒకరిని ప్రేమిస్తుంటారు. పుట్టినప్పుడు అమ్మా, నాన్నలను .. పెద్దయ్యాక ఇష్టమైన వ్యక్తులను ప్రేమిస్తుంటారు. అయితే చిన్నప్పుడు ప్రేమించడానికి నాకు అమ్మ లేదు.. నాన్నకు దూరమయ్యాను. నేను పుట్టగానే.. మా అమ్మ ఒక ఫైర్ యాక్సిడెంట్‌లో చనిపోయింది. నన్ను ఒక బొమ్మలో పెట్టి మా అమ్మ నన్ను దూరంగా విసిరేసింది. అప్పుడు ఒక చిన్న బాబు వచ్చి అప్పుడే పుట్టిన నన్ను కాపాడాడు.. ఆ బాబు ఎవరో కాదు.. నేను ప్రేమించిన మనిషి.
అంటూ భూమి చెప్పగానే.. వెంటనే కింద కూర్చుని అంతా వింటున్న గగన్ ఎమోషనల్ అవుతాడు. తాను చిన్నప్పుడు భూమిని కాపాడిన విషయం గుర్తు చేసుకుంటాడు. బొమ్మలో భూమిని తీసుకుని వెళ్లడం.. ట్రెయిన్‌లో వదిలేయడం అంతా గుర్తు చేసుకుని స్టేజీ మీదకు పరుగెత్తుకుంటూ వెళ్తాడు గగన్. భూమిని చూసి ఎమోషనల్ అవుతాడు. భూమి చేతులు తన చేతుల్లోకి తీసుకుని కిస్ చేస్తాడు. భూమి కూడా గగన్ ను చూసి ఏడుస్తుంది. ఆ చిన్న పాపను తానే అన్నట్టు తలూపుతుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!























