Puneeth Rajkumar: తన కళ్లను దానం చేసిన పునీత్.. ఎమోషనల్ అవుతోన్న ఫ్యాన్స్..
పునీత్ రాజ్ కుమార్ తన కళ్లను దానం చేశారు. దీంతో ఆయన మరణానంతరం అతడి కోరిక ప్రకారం.. ఐ బ్యాంక్ కు కళ్లను డొనేట్ చేశారు.
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తన కళ్లను దానం చేశారు. దీంతో ఆయన మరణానంతరం అతడి కోరిక ప్రకారం.. ఐ బ్యాంక్ కు కళ్లను డొనేట్ చేసినట్లు పునీత్ పెర్సనల్ ఫిజీషియన్ డాక్టర్ రమణారావు వెల్లడించారు. నారాయణ నేత్రాలయాకు చెందిన డాక్టర్ భుజంగ శెట్టి.. పునీత్ మరణించిన తరువాత సర్జరీ చేసి ఆయన కళ్లను సేకరించినట్లు రమణారావు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. తమ అభిమాన హీరో చేసిన గొప్ప పనిని కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. చనిపోయినా కూడా తన కళ్లతో వేరొకరికి సాయం చేస్తున్నారంటూ భావోద్వేగానికి గురవుతున్నారు.
కర్ణాటకలో హైఅలర్ట్.. థియేటర్లు మూసేసిన ప్రభుత్వం
పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియల మైసూర్ లో ఉన్న ఆయన ఫామ్ హౌస్ సమీపంలో నిర్వహించనున్నట్లు సమాచారం. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి, మాజీ ప్రైమ్ మినిష్టర్ హెచ్ డీ దేవ్ గౌడ, మరికొంతమంది స్టేట్ మినిస్టర్స్, సినీ సెలబ్రిటీలు రాజ్ కుమార్ ఇంటికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు.
ఈరోజు పునీత్ జిమ్ చేస్తుండగా.. ఉదయం 9:45 గంటలకు ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే బెంగుళూరులోకి విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు. వెంటనే ఆయన్ను ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన మరణవార్త సినీ ఇండస్ట్రీని, అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది.
కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి లాంటి సినీ పెద్దలు పునీత్ ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. పునీత్ మృతికి కేవలం శాండిల్ వుడ్ నుంచే కాక తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సెలబ్రిటీలు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: బ్రేకింగ్... గుండెపోటుతో కన్నడ పవర్‌స్టార్ మృతి
Also Read: పునీత్ మొదటి సినిమా తెలుగు డైరెక్టర్‌తోనే.. ఏకంగా నాలుగు భాషల్లో రీమేక్.. తెలుగులో ఏ హీరో చేశాడంటే?
Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత
Also Read: పునీత్‌కు హార్ట్ఎటాక్?.. అతిగా జిమ్ చేస్తే గుండె ఆగుతుందా? అసలేం జరిగింది?
Also Read: నోట మాట రాలేదు... పునీత్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి
Also Read: 'రొమాంటిక్' సమీక్ష: రొమాన్స్ తక్కువ... రొటీన్ సీన్లు ఎక్కువ!
Also Read: వరుడు కావలెను సమీక్ష: ఈ వరుడు చాలా రొటీన్ గురూ...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి