By: ABP Desam | Updated at : 29 Oct 2021 11:29 PM (IST)
వరస్ట్ పెర్ఫార్మర్ గా సన్నీ.. జెస్సీపై మండిపడుతూ..
నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ గురించి సన్నీ హౌస్ మేట్స్ తో డిస్కషన్ పెట్టాడు. సంచాలక్ గా జెస్సీ సరిగ్గా పని చేయలేదని.. రూల్స్ కి వ్యతిరేకంగా, తన సొంత రూల్స్ పెట్టుకొని గేమ్ ఆడాడని.. ఒకేసారి ఇద్దరు కంటెస్టెంట్స్ ని ఎలా గేమ్ నుంచి అవుట్ చేస్తారని ప్రశ్నించాడు సన్నీ. మరోపక్క శ్రీరామ్.. సన్నీ ఇండివిడ్యుయల్ గేమ్ ఆడడం లేదని.. మానస్ కోసం గేమ్ ఆడాడని, గేమ్ లోపల ఉన్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే మండుతాది నాకు అంటూ శ్రీరామ్.. యానీ మాస్టర్ తో చెప్పాడు. సన్నీ హౌస్ మేట్స్ అందరితో అలా చర్చలు పెట్టడం కరెక్ట్ కాదని.. ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే నేరుగా జెస్సీతో మాట్లాడమని చెప్పాడు షణ్ముఖ్. లేదంటే వీకెండ్ వరకు ఎదురుచూడమని సలహా ఇచ్చాడు.
శ్రీరామచంద్ర మాస్క్ వేసుకొని ఉంటున్నాడని.. తన ట్రూ సెల్ఫ్ ఇంకా బయటకు రాలేదని కాజల్.. సన్నీ, మానస్ లతో చెప్పింది. దానికి మానస్ కూడా అవునని.. అతనొక డిఫరెంట్ పెర్సన్ అని అన్నాడు.
Also Read: 'రొమాంటిక్' సమీక్ష: రొమాన్స్ తక్కువ... రొటీన్ సీన్లు ఎక్కువ!
ఉదయాన్నే సన్నీ-కాజల్ కూర్చొని మాట్లాడుకున్నారు. వీకెండ్ వచ్చిందంటే నాగ్ సర్ ముందు అందరూ అపరిచితుడులో రామానుజంలాగా నటిస్తుంటారని కామెంట్ చేశాడు సన్నీ. దానికి కాజల్.. మనసులో ఏం పెట్టుకోవద్దని చెప్పింది. ఆ తరువాత మానస్ వచ్చి యానీ మాస్టర్ ప్రతీదానికి తనకు ఎవరూ సపోర్ట్ చేయలేదని అంటుందని.. కానీ చాలా టాస్క్ లలో ఆమెకి హెల్ప్ చేశామని.. కానీ అవేవీ ఆమెకి గుర్తురావని కామెంట్ చేశాడు.
వరస్ట్ పెర్ఫార్మర్..
ఈ వారం హౌస్ లో వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో చెప్పమని బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని ఆదేశించారు. ముందుగా..
సన్నీకి, కాజల్ కి సమానంగా ఓట్లు రావడంతో ఎవరిని జైలుకి పంపించాలో హౌస్ మేట్స్ అందరూ కలిసి నిర్ణయించాలనుకున్నారు. ఈ క్రమంలో షణ్ముఖ్.. సన్నీ పేరు చెప్తూ.. టాస్క్ లో ఫిజికల్ అవ్వడం నచ్చలేదని అన్నాడు. దానికి సన్నీ ఎక్కడ అయ్యానని అడగ్గా.. 'నువ్ బస్తాను తన్నావ్ మచ్చా.. నాకు నచ్చలేదు అది. నాకే కాదు.. చాలామంది హౌస్ మేట్స్ కి నచ్చలేదు అది' అంటూ సన్నీపై ఫైర్ అయ్యాడు షణ్ముఖ్. 'ఎవరు చెప్పారో చెప్పు ధైర్యంగా..' అని సన్నీ అడగ్గా.. సిరి హ్యాండ్ రైజ్ చేసింది. 'ఆవిడ హౌస్ మేట్ లో మీ ఫ్రెండే కదా..' అని సన్నీ కామెంట్ చేయగా.. సిరి ఫైర్ అయిపోయింది. 'ఏంటి 24 గంటలు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అంటారు.. మీరు ముగ్గురు ఫ్రెండ్స్(సన్నీ, కాజల్, మానస్) లేరా..? మేమెప్పుడైనా అన్నామా..?' అంటూ మండిపడింది. 'యువర్ క్లియర్లీ డిఫెండింగ్ యువర్ ఫ్రెండ్' అంటూ మానస్.. షణ్ముఖ్ పై కామెంట్ చేయగా.. అందుకే కదా తనకి వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చానంటూ అరుస్తూ చెప్పాడు షణ్ముఖ్. ఆ తరువాత సన్నీ-జెస్సీ మధ్య మాటా మాటా పెరిగి ఒకరిపై మరొకరు అరుచుకున్నారు. జెస్సీ సంచాలక్ గా ఫెయిల్ అయ్యాడని సన్నీ.. గేమ్ ఆడడం రాక ఓడిపోయావని జెస్సీ.. ఇలా ఒకరినొకరు మాటలు అనుకున్నారు. ఫైనల్ గా వరస్ట్ పెర్ఫార్మర్ గా సన్నీ పేరు ఫైనల్ ను చేశారు. అతడిని జైల్లో వేసి తాళం వేయమని చెప్పారు బిగ్ బాస్.
Also Read: పునీత్ మరణం నమ్మశక్యంగా లేదు.. పవన్ భావోద్వేగం..
Also Read: తన కళ్లను దానం చేసిన పునీత్.. ఎమోషనల్ అవుతోన్న ఫ్యాన్స్..
Also Read: పునీత్‌కు హార్ట్ఎటాక్?.. అతిగా జిమ్ చేస్తే గుండె ఆగుతుందా? అసలేం జరిగింది?
Also Read: నోట మాట రాలేదు... పునీత్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Bigg Boss Telugu 6: బిగ్ బాస్ సీజన్ 6 - లాంచింగ్ డేట్ ఎప్పుడంటే?
Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
Unstoppable Movie: బాలకృష్ణ టాక్ షో టైటిల్‌తో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా
Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా
Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం
Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?
Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ