News
News
X

Movie Tickets : మూవీ టికెట్ల కోసం స్పెషల్ వెబ్ సైట్.. జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ఒకప్పుడు సినిమా టికెట్ల కోసం గంటల తరబడి క్యూలో నిలబడేవారు. ఇక స్టార్ హీరో సినిమాలంటే తెల్లవారుజాము నుంచే థియేటర్ వద్ద పడిగాపులు కాసేవారు.

FOLLOW US: 

ఒకప్పుడు సినిమా టికెట్ల కోసం గంటల తరబడి క్యూలో నిలబడేవారు. ఇక స్టార్ హీరో సినిమాలంటే తెల్లవారుజాము నుంచే థియేటర్ వద్ద పడిగాపులు కాసేవారు. టికెట్ల కోసం ఆన్ లైన్ బుకింగ్ వెబ్ సైట్/యాప్ లు వచ్చిన తరువాత ప్రేక్షకులకు టికెట్స్ బుక్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. అయితే ఇప్పుడు సినిమా టికెట్ల కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 

సినిమా టికెట్ ధరల విషయంలో ట్రాన్స్ పరన్సీ మెయింటైన్ చేయడానికి రైల్వే ఆన్ లైన్ టికెటింగ్ సిస్టం తరహాలో పోర్టల్ ను త్వరలోనే మొదలుపెట్టబోతున్నట్లు తెలిపింది ఏపీ గవర్నమెంట్. ఈ మేరకు జీవోను విడుదల చేసింది. సినిమా థియేటర్స్ లో టికెట్స్ విక్రయించే ప్రక్రియను ప్రభుత్వం నిశితంగా గమనించిన తరువాత.. రైల్వే ఆన్ లైన్ టికెటింగ్ సిస్టం తరహాలో పోర్టల్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయయించింది. 

Also Read : Bigg Boss 5 Telugu : వాళ్లంతా చాలా క్లోజ్.. కానీ నా సపోర్ట్ మాత్రం ఆమెకే.. నాగబాబు కామెంట్స్..

ఈ వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది. దీనికి సంబంధించిన విధి-విధానాలు , అభివృద్ధి, అమలు ప్రక్రియను ప్రభుత్వం నియమించిన కమిటీ చూసుకుంటుందని.. ఏపీ ప్రభుత్వం జీవోలో తెలిపింది. మరోపక్క తెలంగాణ కూడా ఇదే రూల్ ఫాలో అవుతుందో లేదో తెలియాల్సి వుంది. 

News Reels

కరోనా కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిబంధనల మేరకు చిత్రీకరణలు జరుగుతున్నా.. పెద్ద సినిమాలు థియేటర్లో విడుదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. తెలంగాణ థియేటర్స్ పూర్తిగా అందుబాటులోకి వచ్చినా.. ఏపీలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయి. దీంతో నిర్మాతలు, థియేటర్ల యజమానులు, పంపిణీదారులు ఏదొక రూపంలో నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. 

Also Read : Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్‌లో ‘పులిహోర’.. శ్రీరామ చంద్ర మొదలెట్టేశాడు.. ఆ మాటలకు హమీద ఫిదా!

Also Read : porn case: నటికి షాకిచ్చిన బాంబే హైకోర్టు... ముందస్తు బెయిలుకు నో

Also Read : Ranveer Singh RC15 movie launch: రెండు పిలకలతో రణ్‌వీర్ సింగ్.. రామ్ చరణ్ RC15 ప్రారంభోత్సవంలో సందడి

Also Read : Pawan Kalyan : పవన్ షాకింగ్ డెసిషన్.. మరి ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

Published at : 08 Sep 2021 05:58 PM (IST) Tags: AP government Movie Tickets Movie Ticketing Portal

సంబంధిత కథనాలు

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై బాలకృష్ణ క్లారిటీ, డైరెక్టర్ ఆయనేనా?

మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై బాలకృష్ణ క్లారిటీ, డైరెక్టర్ ఆయనేనా?

అల్లు అర్జున్ పక్కన ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల?

అల్లు అర్జున్ పక్కన ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల?

Anasuya Bharadwaj: అనసూయకు వేధింపులు - కటకటాల్లోకి నిందితుడు, రష్మి, విష్ణు ప్రియను కూడా టార్గెట్ చేశాడా?

Anasuya Bharadwaj: అనసూయకు వేధింపులు - కటకటాల్లోకి నిందితుడు, రష్మి, విష్ణు ప్రియను కూడా టార్గెట్ చేశాడా?

టాప్ స్టోరీస్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Talasani: 125 ఏళ్ల పార్టీ అంతరించిపోయింది, బీజేపీ నీటిమీద గాలి బుడగ లాంటిది: మంత్రి తలసాని

Talasani: 125 ఏళ్ల పార్టీ అంతరించిపోయింది, బీజేపీ నీటిమీద గాలి బుడగ లాంటిది: మంత్రి తలసాని