News
News
వీడియోలు ఆటలు
X

Bigg Boss 5 Telugu : వాళ్లంతా చాలా క్లోజ్.. కానీ నా సపోర్ట్ మాత్రం ఆమెకే.. నాగబాబు కామెంట్స్.. 

బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. తాజాగా ఐదో సీజన్ మొదలైన సంగతి తెలిసిందే.

FOLLOW US: 
Share:

బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. తాజాగా ఐదో సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. సరికొత్త టాస్క్ లతో ఈసారి మొదటి ఎపిసోడ్ నుండే దూసుకుపోతుంది ఈ షో. ఎన్నడూ లేని విధంగా ఈసారి మొత్తం 19 మంది కంటెస్టెంట్ లను హౌస్ లోకి పంపించారు. సాధారణంగా అయితే బిగ్ బాస్ షోలో ఓ వారం గడిచిన తరువాత గొడవలు మొదలవుతాయి. కానీ ఈసారి మాత్రం తొలిరోజు నుండే మాటల యుద్ధాలు మొదలైపోయాయి. 

వంట విషయంలో కాజల్ పై లహరి ఓ రేంజ్ లో ఫైర్ అవ్వడం.. చైర్ ఇవ్వలేదని జెస్సీపై యానీ మాస్టర్ మండిపడడం చూస్తుంటే మున్ముందు హౌస్ లో ఇంకెన్ని గొడవలు జరుగుతాయో అనిపిస్తుంది. హౌస్ లో వాళ్లంతా గొడవ పడుతుంటే సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు తమ అభిమాన కంటెస్టెంట్స్ తో గొడవకు దిగిన వారిపై విమర్శలు చేస్తున్నారు. 

Also Read : Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్‌లో ‘పులిహోర’.. శ్రీరామ చంద్ర మొదలెట్టేశాడు.. ఆ మాటలకు హమీద ఫిదా!

తాజాగా మెగాబ్రదర్ నాగబాబు కూడా బిగ్ బాస్ పై స్పందించారు. బిగ్ బాస్ 5లో యాంకర్రవి , యానీ మాస్టర్, సింగర్ శ్రీరామ్, ప్రియా, నటరాజ్ మాస్టర్ తో పాటు చాలా మంది పాల్గొన్నారని.. వారంతా తనకు ఒకెత్తు అయితే.. ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ మరో ఎత్తు అని అన్నారు. తన పూర్తి మద్దతు ప్రియాంకకే ఉంటుందని చెప్పారు. ప్రియాంక అబ్బాయిగా ఉన్నప్పుడే తనకు బాగా క్లోజ్ అని.. ఎంతోకష్టపడి ఈ స్థాయికి వచ్చారని చెప్పుకొచ్చారు. 

ప్రియాంక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిందని తెలియగానే చాలా సంతోషంగా అనిపించిందని తెలిపారు. ట్రాన్స్ జెండర్ గా మారిన తరువాత ప్రియాంక చాలా ఇబ్బంది పడిందని.. అవకాశాలు రాణి సమయంలో తాను ఓ షోలోకి తీసుకొని సాయం చేశానని గుర్తు చేసుకున్నారు. ప్రియాంక విన్నర్ అవుతుందా లేదా అనే విషయం తనకు తెలియదని.. కానీ తన పూర్తి మద్దతు ప్రియాంకకే ఉంటుందని తేల్చి చెప్పారు. 
ఇక ప్రియాంక విషయానికొస్తే.. ఆమె ఓ కామెడీ షోలో లేడీ గెటప్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రియాంక అసలు పేరు సాయి తేజ. ట్రాన్స్ జెండర్ గా మారిన తరువాత ప్రియాంక సింగ్ గా పేరు మార్చుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక చాకచక్యంగా వ్యవహరిస్తోంది. ఎవరినీ నొప్పించకుండా.. గొడవల్లోకి వెళ్లకుండా.. తనొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నట్లుగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. 

Also Read: బిగ్ బాస్ హౌస్‌లో పిల్లి కోసం లొల్లి.. హమీదా వింత వ్యాఖ్యలు.. అడ్డంగా బుక్కైన జెస్సీ!

Also Read: బిగ్ బాస్‌ 5 స్మోకింగ్ బ్యాచ్.. లోబోతో కలిసి దమ్ముకొట్టిన సరయు, హమీద.. ప్రియా గురించి చర్చ 

Also Read: ముఖం పగిలిపోద్ది.. లోబోకి సిరి వార్నింగ్.. ఏడ్చేసిన ఆర్జే కాజల్.. 

Published at : 08 Sep 2021 05:17 PM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 nagababu Priyanka singh Nataraj master

సంబంధిత కథనాలు

Karate Kalyani: కరాటే కళ్యాణి 'మా' మెంబర్షిప్ క్యాన్సిల్ - కావాలనే చేశారంటూ నటి ఆగ్రహం

Karate Kalyani: కరాటే కళ్యాణి 'మా' మెంబర్షిప్ క్యాన్సిల్ - కావాలనే చేశారంటూ నటి ఆగ్రహం

Shanmukh Jaswanth New Web Series : 'శివ'గా షణ్ముఖ్ జస్వంత్ - కొత్త సిరీస్ 'స్టూడెంట్' షురూ, లుక్ చూశారా?

Shanmukh Jaswanth New Web Series : 'శివ'గా షణ్ముఖ్ జస్వంత్ - కొత్త సిరీస్ 'స్టూడెంట్' షురూ, లుక్ చూశారా?

ఛీ, యాక్ - నమిలేసిన చూయింగ్ గమ్స్‌తో డ్రెస్, ఫ్యాషన్ ఉసురు తీస్తున్న ఉర్ఫీ!

ఛీ, యాక్ - నమిలేసిన చూయింగ్ గమ్స్‌తో డ్రెస్, ఫ్యాషన్ ఉసురు తీస్తున్న ఉర్ఫీ!

Uorfi Javed: రెస్టారెంట్ లోకి అనుమతించని సిబ్బంది, నేనెవరో తెలుసా అంటూ ఉర్ఫీ జావేద్ రచ్చ

Uorfi Javed: రెస్టారెంట్ లోకి అనుమతించని సిబ్బంది,  నేనెవరో తెలుసా అంటూ ఉర్ఫీ జావేద్ రచ్చ

రణ్‌బీర్ ‘గో టు హెల్’ - ‘బ్యాడ్ టేస్ట్’ కామెంట్స్‌పై ఉర్ఫీ ఫైర్

రణ్‌బీర్ ‘గో టు హెల్’ - ‘బ్యాడ్ టేస్ట్’ కామెంట్స్‌పై ఉర్ఫీ ఫైర్

టాప్ స్టోరీస్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !