Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్‌లో ‘పులిహోర’.. శ్రీరామ చంద్ర మొదలెట్టేశాడు.. ఆ మాటలకు హమీద ఫిదా!
‘బిగ్ బాస్’కు కంటెంట్ దొరికేసింది. ఆర్జే కాజల్ దయవల్ల సింగర్ శ్రీరామ చంద్ర పులిహోర కలపడం మొదలుపెట్టాడు. హమీద కూడా అతడికి సాయం చేస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 5 మొదలై మూడు రోజులు కావస్తోంది. వచ్చి రాగానే గొడవలు, ఏడుపులు, ఎమోషనల్ డ్రామాలతో హౌస్ మేట్స్.. ప్రేక్షకుల సహానాన్ని పరీక్షిస్తున్నారు. దీంతో ఏదో లోటు కనిపిస్తున్నట్లు భావిస్తున్నారు. గత సీజన్ల తరహాలో పులిహోర కలపడంలో పావీణ్యులు ఇందులో ఉన్నారో లేదా అనే సందేహాలు కూడా నెలకొన్నాయి. ఈ విషయం బిగ్ బాస్‌కు తెలిసిందో ఏమో.. తాజా ప్రోమోతో ఆ లోటు తీర్చేశాడు. దీని ప్రకారం.. ఈ సీజన్లో పులిహోరా రాజా క్రెడిట్‌ను సింగర్ శ్రీరామ చంద్ర కొట్టేసేలా ఉన్నాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు. హమీద కూడా తక్కువేమీ లేదు. అతడు కలిపే పులిహోరలో పోపులు యాడ్ చేస్తూ.. చప్పగా సాగుతున్న బిగ్ బాస్‌లో టేస్టు పెంచేందుకు సిద్ధమైందని తెలుపుతున్నారు.
అత్యుత్సాహం.. అంతులేని ఎనర్జీతో కష్టాలు తెచ్చుకుంటున్న ఆర్జే కాజల్.. హౌస్‌లోకి వెళ్లిన రోజు నుంచి ఇప్పటివరకు ఎవరో ఒకరిని ఇంటర్వ్యూ చేస్తూ.. వారి గురించి తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఫలితంగా లహరీ నుంచి ‘కంటెంట్’ కామెంట్లను ఎదుర్కోవలసి వచ్చింది. చివరికి కన్నీళ్లు పెట్టుకుంది. అయినా ఆమె ప్రయత్నాలు ఆపడం లేదు. తాజాగా ప్రోమోలో సింగర్ శ్రీరామ చంద్రను ‘‘నీకు ఎలాంటి అమ్మాయి అంటే ఇష్టం?’’ అని అడిగింది. ఇందుకు.. ‘‘జోవియల్‌గా.. బబ్లీగా ఉండే అమ్మాయిలంటే ఇష్టం’’ అని శ్రీరామ చంద్ర తెలిపాడు. ఆ వెంటనే.. హమీదతో కబుర్లు మొదలెట్టాడు శ్రీరామ్.
ఇక చూసుకోండి.. ఇద్దరు ఎక్కడా తగ్గకుండా బిగ్ బాస్‌కు కావాల్సినంత కంటెంట్ ఇచ్చారు. ఒక రకంగా లహరీ చెప్పినట్లే.. కాజల్ మంచి కంటెంట్‌ను అందించేందుకు బిగ్ బాస్‌కు సహరిస్తోంది అనిపించేలా.. శ్రీరామ్-హమీద ఎపిసోడ్ ఉండేలా ఉంది. హమీదా మాట్లాడుతూ.. ‘‘నీకు ఫీలింగ్స్ లేవా? నువ్వు ఏడ్వవా అని నా ఫ్రెండ్స్ అంటారు. ఎవరూ మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు’’ అని శ్రీరామ చంద్రతో చెప్పింది. శ్రీరామ్ స్పందిస్తూ.. ‘‘హ్యాపీనెస్ అయినా.. సాడ్‌నెస్ అయినా ఇంకొకరికి చెప్పుకోవడం నీకు అలవాటు. ఇక్కడ నీకు తెలియక కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. అది తెలుసుకుని నీ లోపల ఉన్న స్పేస్‌ను పెంచుకో. ఇది వరకు 10 జీబీ ఉంటే.. ఇప్పుడు 100 జీబీ ఉండాలి లోపల’’ అని తెలపడంతో హమీద సిగ్గుతో మొగ్గలేసింది. వారి మధ్య ఏమైనా ఉందో లేదో తెలీదు గానీ.. ‘బిగ్ బాస్’ మాత్రం ‘హొయ్యారే..’ అంటూ లవ్ ఫీల్ కలిగిస్తూ ఈ ప్రోమో వదిలాడు.
ఈ రోజు ఎపిసోడ్ ప్రోమో:
Also Read: బిగ్ బాస్ హౌస్‌లో పిల్లి కోసం లొల్లి.. హమీదా వింత వ్యాఖ్యలు.. అడ్డంగా బుక్కైన జెస్సీ!
Also Read: బిగ్ బాస్ 5 స్మోకింగ్ బ్యాచ్.. లోబోతో కలిసి దమ్ముకొట్టిన సరయు, హమీద.. ప్రియా గురించి చర్చ
Also Read: ముఖం పగిలిపోద్ది.. లోబోకి సిరి వార్నింగ్.. ఏడ్చేసిన ఆర్జే కాజల్..