By: ABP Desam | Updated at : 20 Dec 2021 05:38 PM (IST)
Edited By: harithac
(Image credit: Instagram)
పుష్పలో అల్లు అర్జున్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటిలాగే చించేశాడు. అదే విషయాన్ని సమంత ప్రత్యేకంగా పోస్టు పెట్టి మరీ పొగిడింది. ‘ఇది అల్లు అర్జున్ ను మెచ్చుకుంటున్న పోస్టు... ఈ సినిమాలో ప్రతి సెకను కళ్లను కట్టిపడేసేలా నటించాడు. ఒక నటుడు అసాధారణమైన నటను ప్రదర్శిస్తే దాన్ని చూసి నేను స్పూర్తి పొందుతాను. పుష్ప సినిమాలో మాట్లాడే యాసతో పాటూ, ఒక వైపు భుజం పైకెత్తినట్టు నటించిన అల్లు అర్జున్ ప్రతిభను మెచ్చుకోవాల్సిందే... నిజంగా ఇది స్పూర్తి దాయకమైనది’ అంటూ పుష్ప పోస్టర్ తో పాటూ పోస్టు పెట్టింది. దానికి అల్లు అర్జున్ స్పందించి ‘ధన్యవాదాలు డియర్’ అని రిప్లయ్ ఇచ్చాడు. ఈ సినిమా సమంత ఒక ప్రత్యేక గీతంలో నటించింది. ‘ఊ అంటావా మావా’ అంటూ సాగే ఈ పాటకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట చాలా కాంట్రవర్సీ అయ్యింది. దీనిపై మేల్ వెర్షన్లు కూడా విడుదలైన రచ్చరచ్చ చేశాయి.
ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ముందు సమంత ఒప్పుకోలేదట. పెద్ద హీరోయిన్‌గా కొనసాగుతూ ప్రత్యేక గీతంలో చేస్తే బావుందేమో అని అభిప్రాయపడిందట. అందులో విడాకుల వివాదంలో ఇరుక్కుని ఉండడంతో వద్దనుకుందట. కానీ సుకుమార్ ప్రత్యేకంగా మాట్లాడి ఆమెను ఒప్పించినట్టు సమాచారం.
పుష్ప - ది రైజ్ పేరుతో మొదటి పార్ట్ ఇటీవల విడుదలై అభిమానుల్లో సందడి తెచ్చింది. అందులో అల్లు అర్జున్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్ల దిశగా పరిగెడుతోంది. రష్మిక డీ గ్లామర్ పాత్రలో నటించినప్పటికీ తన డ్యాన్సులతో, నటనతో అందరినీ ఆకట్టుకుంది. స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో బన్నీ కూడా చాలా డీ గ్లామర్ గా కనిపిస్తాడు. గంధపు చెట్లను అక్రమంగా కొట్టడం కోసం కూలీగా వెళ్లిన పుష్పరాజ్ తరువాత పెద్ద స్మగ్లర్ గా ఎలా ఎదిగాడు అన్నదే కథ.
[insta]
Also Read: 'మగాడివైతే రా ఆడు అన్నారు..' ఇప్పుడు గెలిచి చూపించాడు.. సన్నీ గెలుపుకి కారణాలివే..
Also Read:బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న 'మిర్చి' బ్యూటీ.. గుండెబరువెక్కిస్తున్న ఎమోషనల్ ట్వీట్
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ 7లో మొదటి కెప్టెన్సీ టాస్క్ - శోభాశెట్టి చీటింగ్ గేమ్, శివాజీ ఫ్రస్ట్రేషన్
Bigg Boss: ‘బిగ్ బాస్’ విన్నర్పై ఆరోపణలు, ట్రోఫీ తిరిగి ఇచ్చేస్తానంటూ వీడియో
Samantha: అప్పుడలా, ఇప్పుడిలా - గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సమంత, ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్
Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'
Ram Charan: కొత్త ఫ్రెండ్తో రామ్ చరణ్ ఫోటో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
RK Roja: మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
Hyderabad Crime: ప్రేమ కథ విషాదాంతం - ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య
/body>