
Pragathi: నాకు అమ్మ, నాన్న ఎవరూ లేరు - ప్రగతి ఎమోషనల్ స్పీచ్
'ఎఫ్3' సినిమా సక్సెస్ మీట్ లో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు ప్రగతి.

నటి ప్రగతి దాదాపు ఇరవై ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నారు. తెలుగులో ఆమె వందకి పైగా సినిమాల్లో నటించారు. ఎక్కువగా తల్లి, అత్త పాత్రల్లోనే కనిపించారు. రీసెంట్ గా ఈమె 'ఎఫ్3' సినిమాలో తన క్యారెక్టర్ తో ప్రేక్షకులను అలరించారు. 'ఎఫ్2' సినిమాలో ఈమె రోల్ బాగా పండింది. దానికి కొనసాగింపుగా వచ్చిన 'ఎఫ్3' కూడా ఆమె కెరీర్ కి ప్లస్ అయింది.
ఈ సినిమా సక్సెస్ మీట్ లో ప్రగతి 'ఎఫ్3' సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. సరైన పాత్రలు రాక విసుగు చెందిన సమయంలో అనిల్ రావిపూడి 'ఎఫ్2' సినిమాలో ఛాన్స్ ఇచ్చారని.. అది తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అని, 'ఎఫ్3' సినిమా కూడా తనకు బాగా కలిసొచ్చిందని అన్నారు. ఇదే సమయంలో తనతో కలిసి పని చేసిన ఆర్టిస్ట్ ల గురించి మాట్లాడారు.
వెంకటేష్ సెట్స్ లో చాలా బాగా ఉంటారని.. అంత పెద్ద స్టార్ అయినా.. చాలా సింపుల్ గా ఉంటారని.. క్రమశిక్షణతో వ్యవహరిస్తారని చెప్పారు. రాజేంద్రప్రసాద్ చిన్నపిల్లాడిలా అల్లరి చేస్తుంటారని అన్నారు. అలానే ఈ సినిమాలో నటించిన సీనియర్ ఆర్టిస్టులు వై.విజయ్, అన్నపూర్ణల గురించి మాట్లాడుతూ.. ''నాకు అమ్మ లేదు, నాన్న లేరు.. చుట్టాలు ఎవరూ లేరు. కానీ ఈ సినిమాతో ఇద్దరు అమ్మలు దొరికారు. వారిద్దరూ నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. వాళ్లకు నేనంటే చాలా ఇష్టం'' అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.
Also Read: పాకిస్తానీ సినిమాకు Cannes 2022లో అవార్డులు - 'జాయ్ ల్యాండ్' ప్రత్యేకత ఏంటి?
Also Read: 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
