Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా మేనల్లుడి సినిమాకు సీక్వెల్?
పవన్ కల్యాణ్ హీరోగా ఓ సీక్వెల్ చేయడానికి దర్శకుడు ఒకరు ప్లాన్ చేస్తున్నారు. ఓ ట్విస్ట్ ఉంది. అది ఏంటంటే... ఫస్ట్ పార్ట్ లో పవన్ హీరో కాదు. ఆయన మేనల్లుడు హీరో. అది ఏ సినిమా? ఏంటి? తెలుసుకోండి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా దర్శకుడు దేవ కట్టా ఓ సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ ఆయన ప్రయత్నాలు చేశారు. అయితే... అవి వర్కవుట్ కాలేదు. అంటే... పవర్ స్టార దగ్గరకు వెళ్లలేదు. మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి తేజ్ కథానాయకుడిగా దేవ కట్టా దర్శకత్వం వహించిన 'రిపబ్లిక్' సినిమా ఉంది కదా! దానిని పవన్ హీరోగా చేయాలని అనుకున్నారు. అయితే... పవన్ ఇమేజ్‌కు తగ్గట్టు కథ ఉందో? లేదో? అనే అనుమానంతో పవన్ దగ్గరకు వెళ్లలేదట. దాంతో మేనల్లుడు సాయి తేజ్‌తో ముందుకు వెళ్లారు.
'రిపబ్లిక్' హిట్ కావడం, కల్ట్ హిట్ అని కొందరు కాంప్లిమెంట్స్ ఇవ్వడంతో సీక్వెల్ చేయడానికి దేవ కట్టా ప్లాన్ చేస్తున్నారు. అదీ పవన్ కల్యాణ్‌తో 'రిపబ్లిక్ 2' చేయాలని అనుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. పవన్‌తో చేసే అవకాశాలు ఉన్నాయని, ఆయన దగ్గరకు వెళ్లాలని అనుకుంటున్నట్టు దేవ కట్టా అన్నారు. ప్రస్తుతానికి ఐడియా స్టేజిలో 'రిపబ్లిక్ 2' ఉంది. కంప్లీట్ స్క్రిప్ట్ డెవలప్ అయ్యేసరికి ఏం అవుతుందో చూడాలి. 'రిపబ్లిక్' విడుదల సమయంలో సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో ఉండటంతో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పవన్ కల్యాణ్ అటెండ్ అయ్యారు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు సంచలనం అయిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
Also Read: అర్ధరాత్రి ఆ హీరో ఇంటి దగ్గర కెమెరా కంటికి చిక్కిన హీరోయిన్
Also Read: వసుధారని ఇంట్లోంచి పంపించేయాలని జగతికి షాకిచ్చిన రిషి.. గుప్పెడంత మనసు డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్
Also Read: కార్తీక్ మళ్లీ డాక్టర్ బాబుగా మారనున్నాడా, నా కొడుకూ మీ మనవడే అంటూ మోనిత రచ్చ.. కార్తీకదీపం డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్..
Also Read: పెళ్లి ఒకడితో... ఫస్ట్ నైట్ ఇంకొకడితో టైప్ నా వల్ల అవ్వట్లేదు! - తమన్
Also Read: బాలకృష్ణ, రవితేజ మధ్య గొడవ ఏంటి? ఇదిగో తెలుసుకోండి!!
Also Read: పవన్ కల్యాణ్... మహేష్ బాబుతో పాటు వాళ్లకూ రాజమౌళి థాంక్స్! ఎందుకంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి