అన్వేషించండి

12th Fail OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన ‘12th ఫెయిల్‌’, IAS ఆఫీసర్ రియల్ స్టోరీ ఎక్కడ చూడాలంటే?

12th Fail OTT Streaming: బాలీవుడ్ లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం ‘12th ఫెయిల్‌’. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.

12th Fail Movie OTT Streaming: సినిమాలో స్టఫ్ ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే దానికి బెస్ట్ ఎగ్జాంఫుల్ ‘12th ఫెయిల్‌’ మూవీ. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర రికార్డులు మోత మోగించింది. రూ. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మనోజ్ కుమార్ అనే IAS అధికారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో యువ హీరో విక్రాంత్ మన్సే ప్రధాన పాత్ర పోషించారు. విధు వినోద్ చోప్రా ఈ చిత్రాన్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించారు.

ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్న ‘12th ఫెయిల్’

అక్టోబర్ 27న ‘12th ఫెయిల్‌’ సినిమా థియేటర్లలోకి అడుగు పెట్టింది. తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. విద్యా వ్యవస్థలోని లోటుపాట్లను ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు వినోద్. అంతేకాదు, సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యూ విద్యార్థుల వెతలను కూడా ఇందులో ప్రస్తావించారు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల హృదయాలను కదిలించేలా ఉంది ఈ చిత్రం.

ఓటీలోకి వచ్చేసిన  ‘12th ఫెయిల్’

థియేటర్లలో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్న ఈ ఇన్‌స్పైరింగ్‌ మూవీ తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టింది.  ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ బయోపిక్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. డిసెంబర్ 29 నుంచి ‘12th ఫెయిల్‌’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది.     

అనురాగ్ పాఠ‌క్ న‌వ‌ల ఆధారంగా తెరకెక్కిన  ‘12th ఫెయిల్’

అనురాగ్ పాఠ‌క్ రాసిన న‌వ‌ల ఆధారంగా ‘12th ఫెయిల్’ సినిమా తీశారు దర్శకుడు విధు వినోద్ చోప్రా. ఈ  సినిమాలో మ‌నోజ్ కుమార్ అనే ఐపీఎస్‌ ఆఫీసర్‌ పాత్రలో విక్రాంత్ మస్సే అద్భుతంగా నటించాడు. 12వ త‌ర‌గ‌తిలో ఫెయిల్ అయిన ఆయన  జీవితాన్ని గడపడం కోసం ఆటో డ్రైవర్‌గా మారుతాడు. అయితే, IAS అధికారి కావాలనే తన కలను మాత్రం మర్చిపోడు. చివరకు ఆ ఆటో డ్రైవర్‌ IASగా ఎలా మారాడు అనేది చాలా ఇన్‌స్పైరింగ్‌గా చూపించారు. ‘12th ఫెయిల్’ సినిమా ఆస్కార్స్‌ కు ఇండిపెండెంట్ నామినేష‌న్ కింద వెళ్లినా షార్ట్ లిస్ట్ కాలేదు. ఈ చిత్రంలో మేధా శంకర్‌, అనంత్ జోషి, అన్షుమాన్‌ పుష్కర్‌, ప్రియాంషు చటర్జీ, గీతా అగర్వాల్‌, హరీష్‌ ఖన్నా, సరితా జోషి కీలక పాత్రలు పోషించారు. వినోద్‌ చోప్రా ఫిల్మ్స్‌ బ్యార్ లో విధు వినోద్‌ చోప్రా, యోగేష్‌ ఈశ్వర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.  

Read Also: సంక్రాంతికి 'నా సామిరంగ' - రిలీజ్ డేట్ చెప్పిన నాగ్, సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?

టాప్ హెడ్ లైన్స్

MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
Horror Thriller OTT : రెండు ఓటీటీల్లో మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - జబర్దస్త్ అదిరే అభి మూవీ ఎందులో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లో మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - జబర్దస్త్ అదిరే అభి మూవీ ఎందులో చూడొచ్చంటే?
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
Love Romantic Movie OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి అన్నపూర్ణ స్టూడియోస్ కొత్త మూవీ - లవ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి అన్నపూర్ణ స్టూడియోస్ కొత్త మూవీ - లవ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Adilabad Adivasis: అడవుల్లో దొరికే అరుదైన బుడుం పండు.. ఆదివాసీలకు జీవనోపాధి, తినేవారికి ఆరోగ్యం
అడవుల్లో దొరికే అరుదైన బుడుం పండు.. ఆదివాసీలకు జీవనోపాధి, తినేవారికి ఆరోగ్యం
IND VS BAN, Asian Games Semifinal: బంగ్లాదేశ్‌తో అమీతుమీకి భారత్ సై.. ఆసియా క్రీడల సెమీస్‌లో గోల్డ్ మెడల్ వేట, తిరుగులేని రికార్డుతో హర్మన్‌ప్రీత్ సేన జోరు
బంగ్లాదేశ్‌తో అమీతుమీకి భారత్ సై.. ఆసియా క్రీడల సెమీస్‌లో గోల్డ్ మెడల్ వేట, తిరుగులేని రికార్డుతో హర్మన్‌ప్రీత్ సేన జోరు
TTD Ghee Adulteration Case: తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
Saikrishna Custodial Death Case: పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
Jana Sena Joinings: జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
Trump Tariffs On India: ఇక భారత్‌పై 100 శాతం టారిఫ్ మోత ! రష్యా ఆంక్షల చట్టానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం
ఇక భారత్‌పై 100 శాతం టారిఫ్ మోత ! రష్యా ఆంక్షల చట్టానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం
IIT Bombay Incident: ఎగ్జామ్ హాల్‌లో చాట్‌ జీపీటీ వాడుతూ దొరికి.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆ*త్మహత్య!
ఎగ్జామ్ హాల్‌లో చాట్‌ జీపీటీ వాడుతూ దొరికి.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య!
Embed widget