అన్వేషించండి

Naa Saami Ranga Release Date: సంక్రాంతికి 'నా సామిరంగ' - రిలీజ్ డేట్ చెప్పిన నాగ్, సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?

Naa Saami Ranga Release Date: అక్కినేని నాగార్జున, విజయ్‌ బిన్నీ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు.

Naa Saamiranga locks its release date: 'ది ఘోస్ట్' మూవీ డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అక్కినేని నాగార్జున, ‘నా సామిరంగ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు కొరియోగ్రాఫర్ గా పని చేసిన బిన్నీ, ఈ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. నాగార్జున సరసన హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎండింగ్ కు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు.

సంక్రాంతి కానుకగా 'నా సామిరంగ' విడుదల

ఈ సినిమా విడుదలకు సంబంధించి నిర్మాణ సంస్థ రిలీజ్ డేట్ లాక్ చేసింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ మూవీని జనవరి 14, 2024న విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేసింది. అటు ఇవాళ సాయంత్రం 04.05 గంటలకు టైటిల్ సాంగ్ లిరికల్ ను రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్ లో నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Srinivasaa Silver Screen (@srinivasaasilverscreenoffl)

నాగార్జున సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?

నాగార్జున సినిమాలు గత కొంతకాలంగా సంక్రాంతి బరిలో నిలస్తూ, చక్కటి విజయాలను అందుకుంటున్నాయి. ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘బంగార్రాజు’లాంటి సినిమాలు కూడా సంక్రాంతికి విడుదలై సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు 'నా సామిరంగ'ను కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమాతో విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నారట నాగార్జున. ‘ది ఘోస్ట్’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న ఆయన, ఈ చిత్రంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.           

మలయాళ మూవీ ఆధారంగా తెరకెక్కుతున్న‘నా సామిరంగ’

మలయాళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న 'పోరింజు మారియం జోసే' అనే సినిమా ఆధారంగా ‘నా సామిరంగ’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మూలకథ మారకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా కథలో మార్పులు చేశారు. ఈ చిత్రంలో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.  స్టంట్‌ మాస్టర్ వెంకట్‌ ఈ యాక్షన్‌ సీన్లను డిజైన్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున గతంలో ఎప్పుడూ లేని విధంగా ఊరమాస్ పాత్రలోకనిపించబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్,టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నాగార్జున బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున ఊర మాస్ లుక్ లో కనిపించారు. టీజర్ నాగార్జున చేసిన మాస్ ఫైట్ అలరించింది. సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి.  ఈ చిత్రానికి  కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమాలో యువ హీరోలు 'అల్లరి' నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'పలాస' దర్శకుడు కరుణ కుమార్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read Also: అసలే నెగెటివిటీ, ఇప్పుడో బూతు పాట - ఇప్పుడు చీప్‌గా అనిపించడం లేదా త్రివిక్రమ్? అప్పటి కామెంట్స్ మరిచారా?

టాప్ హెడ్ లైన్స్

Anasuya Bharadwaj : అచ్చియమ్మ రోల్‌... రొమాంటిక్ సీన్స్ కాంట్రవర్సీ - రంగమ్మత్త రియాక్షన్
అచ్చియమ్మ రోల్‌... రొమాంటిక్ సీన్స్ కాంట్రవర్సీ - రంగమ్మత్త రియాక్షన్
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Balan The Boy: తెలుగు డబ్బింగ్ ఇంత ఘోరమా? మినిమమ్ కేర్ తీసుకోరా బాలన్?
తెలుగు డబ్బింగ్ ఇంత ఘోరమా? మినిమమ్ కేర్ తీసుకోరా బాలన్?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని లక్ష్మీ చూసిందా! సిరి తండ్రికి తెలీకుండా ఆ పని చేయగలదా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని లక్ష్మీ చూసిందా! సిరి తండ్రికి తెలీకుండా ఆ పని చేయగలదా!

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Sai Durgha Tej : సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
Embed widget