గాయని సునీత కొడుకు ఆకాష్ హీరోగా పరిచయమైన 'సర్కారు నౌకరి' ఎలా ఉంది? ఈ సినిమాలో ప్లస్, మైనస్‌లు చూస్తే... కథ: కొల్లాపూర్‌లో ఎయిడ్స్ రాకుండా, కుటుంబ నియంత్రణ & నిరోధ్‌పై అవగాహన కల్పించే ఉద్యోగి గోపాల్ (ఆకాష్). గోపాల్ నిరోధ్‌లు పంచుతున్నాడని తెలిసి అంటరాని వాళ్ళుగా చూడటం మొదలు పెడతారు ఊరి ప్రజలు. దాంతో గోపాల్‌ను ఆ ఉద్యోగం మానేయమని సత్య (భావన) కోరుతుంది. మనకపోవడంతో భర్తను వదిలేసి పుట్టింటికి వెళుతుంది. భార్య, స్నేహితుడు దూరమైనా... ఊరంతా అవమానించినా ఉద్యోగం ఎందుకు వదల్లేదు? గోపాల్ కథేమిటి? అనేది సినిమా. ఎలా ఉంది?: పథకాలకు ప్రచారం కల్పించడం కోసం ప్రభుత్వం తీసే యాడ్స్ తరహాలో ఉందీ సినిమా. కొన్ని కామెడీ సీన్లు, హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సాంగ్ బావున్నాయి. తర్వాత నీరసం మొదలైంది. ఎయిడ్స్/హెచ్ఐవి కథతో ప్రేక్షకులు కనెక్టయ్యే అంశాలు తక్కువ అంటే... 80లలో సినిమా తీసినట్టు తీశారు దర్శకుడు. కెమెరా వర్క్, మ్యూజిక్, ప్రొడక్షన్ వేల్యూస్... ఒక్కటేమిటి, అన్నీ 80లలో సినిమాను తలపించారు. ఆకాష్, భావన తమ పాత్రల పరిధి మేరకు నటించారు. తనికెళ్ళ భరణి వంటి గొప్ప నటులకు సరైన క్యారెక్టర్లు పడలేదు. ఆకాష్‌కు 'సర్కారు నౌకరి' డిజాస్టర్ డెబ్యూ. నటుడిగా టాలెంట్ చూపించలేదు. ఆ ఛాన్స్ కథ ఇవ్వలేదు.