అన్వేషించండి

CBSE CTET 2024: సీటెట్‌-2024 'ఎగ్జామ్ సెంటర్' వివరాలు అందుబాటులో, పరీక్ష ఎప్పుడంటే?

CTET: సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ జనవరి-2024 సెషన్‌కు సంబంధించి అభ్యర్థుల పరీక్ష కేంద్రం (City Intimation Slip) వివరాలను సీబీఎస్‌ఈ జనవరి 12న విడుదల చేసింది.

CTET 2024 Exam City Intimation Slip: సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) జనవరి-2024 సెషన్‌కు సంబంధించి అభ్యర్థుల పరీక్ష కేంద్రం (City Intimation Slip) వివరాలను సీబీఎస్‌ఈ జనవరి 12న విడుదల చేసింది. సీటెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి పరీక్ష కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 21న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌ నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 20 భాషల్లో సీటెట్ పరీక్షను నిర్వహిస్తారు. 

పరీక్ష విధానం..

✦ పేపర్-1: ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ): ఒకటి నుంచి 5వ తరగతులకు బోధించాలనుకునే వారి కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2.30 గంటలు.

✦ పేపర్-2: ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ): ఆరు నుంచి 9వ తరగతులకు బోధించాలనుకునే వారి కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 150 మార్కులకు పేపర్-2 రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోజీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2.30 గంటలు.

సీటెట్ పరీక్ష కేంద్రం వివరాల కోసం క్లిక్ చేయండి..

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్)- జనవరి 2024 నోటిఫికేషన్‌‌ను సెం'ట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ)' నవంబరు 3న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నవారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ప్రతి ఏడాది రెండుసార్లు (జనవరి, జులై) జాతీయ స్థాయిలో ఈ పరీక్షను సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. సీటెట్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 3న ప్రారంభంకాగా.. అర్హులైన అభ్యర్థులు నవంబరు  27 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 

తెలంగాణలో తగ్గిన పరీక్షా కేంద్రాలు ..
తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌లలో మాత్రమే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో సీబీఎస్‌ఈ పేర్కొంది. గతంలో 8 పరీక్షా కేంద్రాలు ఉంటే దాన్ని ఆరుకు కుదించారు. మళ్లిప్పుడు ఆరు నుంచి రెండుకు కుదించారు. దీంతో రాష్ట్రంలోని అభ్యర్థులకు కొంత ఇబ్బంది కల్గనుంది. ఇది వరకు దరఖాస్తులు భారీగా రావడం, సెంటర్లు సరిపోకపోవడంతో ఏపీలోని విజయవాడలో పరీక్షాకేంద్రాలను కేటాయించారు. అయినా సీబీఎస్‌ఈ తీరు మార్చుకోకపోవడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

✪ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) జనవరి - 2024 వివరాలు..

✦ ప్రైమరీ స్టేజ్ (1 నుంచి 5 తరగతులకు బోధించడానికి) (పేపర్-1)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ లేదా ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) లో డిప్లొమా లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా డిగ్రీతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.

✦ ఎలిమెంటరీ స్టేజ్ (6 నుంచి 8 తరగతులకు బోధించడానికి) (పేపర్ 2)


అర్హత:
 గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/బీఈడీ లేదా 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా నాలుగేండ్ల బీఏ/బీఎస్సీ ఎడ్యుకేషన్, బీఏఈడీ, బీఎస్‌ఈడీ, డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

సీటెట్ నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget