YSR District News : క్రికెట్ శిక్షణకు వచ్చిన బాలికపై లైంగిక వేధింపులు, ఇద్దరు కోచ్ లు సస్పెండ్
YSR District News : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు క్రికెట్ యూత్ క్లబ్ సబ్ సెంటర్ లో ఇద్దరు కోచ్ లు సస్పెండ్ అయ్యారు. క్రికెట్ శిక్షణకు వచ్చిన బాలికపై కోచ్ లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
YSR District News : బాలికపై లైంగిక వేధింపుల ఘటన ప్రొద్దుటూరు క్రికెట్ యూత్ క్లబ్ లో కలకలం రేపుతోంది. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన కడప క్రికెట్ అసోసియేషన్ ఇద్దరు కోచ్ లను సస్పెండ్ చేసింది. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఇద్దరు క్రికెట్ కోచ్‌లు బాలికను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై కడప క్రికెట్ అసోసియేన్ విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఇద్దరు కోచ్ లను సస్పెండ్ చేసినట్లు ప్రొద్దుటూరు క్రికెట్ యూత్ క్లబ్ నాయకులు పేర్కొన్నారు. కడప క్రికెట్ అసోసియేషన్ అనుసంధానంతో ప్రొద్దుటూరు సబ్ సెంటర్ నడుస్తోంది. ఈ సెంటర్ లో గత కొన్ని రోజులుగా బాలిక క్రికెట్ శిక్షణ తీసుకుంటుంది. బాలికపై ఇద్దరు కోచ్ లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై విచారణ అనంతరం ఇదర్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన కోచ్‌ల బాధ్యతలను మహిళా కోచ్‌కు అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు సంబంధిత అధికారులలు. బాలికపై లైంగిక వేధింపులు ఘటన వెలుగులోకి రావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాలికపై సామూహిక అత్యాచారం!
హైదరాబాద్ లో మరో దారుణ ఘటన జరిగింది. ఇటీవలె ఓ బాలికపై కారులో అత్యాచారం చేసిన ఘటన మరువక ముందే ఈ దారుణం వెలుగుచూసింది. ఇంట్లో గొడవ పడి అమ్మమ్మ ఇంటికి వెళ్తున్న బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అయితే ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. బాలిక స్టేట్‌మెంట్ ప్రకారం పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగింది?
హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని ఓ కాలనీకి చెందిన బాలిక(14) ఈనెల 18న చాంద్రాయణగుట్టలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. అయితే ఆ బాలిక అక్కడికి వెళ్లలేదు. బాలిక ఆచూకీ తెలియక పోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు చాంద్రాయణ గుట్ట పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ మరుసటి రోజు ఆదివారం రాత్రి బాలికి ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చిన బాలికను తల్లిదండ్రులు ఏం జరిగిందని ప్రశ్నించగా తనపై ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారని తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘాజిమిల్లత్‌కాలని, హఫీజ్‌బాబానగర్ కాలనీలకు చెందిన ఇద్దరు యువకులు బాలికను 18వ తేదీ రాత్రి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరోజంతా బాలికను గుర్తుతెలియని ప్రదేశంలో బంధించారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి తిరిగివచ్చింది. బాలిక చెప్పిన వివరాలతో పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలికకు వైద్య పరీక్షలు చేయించినట్లు సమాచారం. ఈ విషయంపై పోలీసులు అధికారికంగా వివరాలు తెలియజేయడానికి ఇష్టపడలేదు. దర్యాప్తు కొనసాగుతోందని వివరాలు చెప్పడానికి నిరాకరించారు.