News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Yanam: ప్రియుడు లేని లోకంలో ఉండలేనంటూ యువతి ఆత్మహత్య

AP Crime News: క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడు. అతను లేని లోకంలో తానూ ఉండలేనని ఆత్మహత్యకు పాల్పడిందో యువతి.

FOLLOW US: 
Share:

AP Crime News: ప్రేమించిన యువకుడు వ్యసనాలకు బానిసయ్యాడు. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడు. దీంతో అతను లేని లోకంలో తానూ ఉండలేనని ఆత్మహత్యకు పాల్పడిందో యువతి. రోజుల వ్యవధిలోనే రెండు ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా, యానంలో చోటుచేసుకుంది.

 ఎస్సై నూకరాజు తెలిపిన వివరాల ప్రకారం.... తూర్పు గోదావరి, యానాం సమీపంలోని యూకేవీనగర్‌కి చెందిన మీసాల మౌనిక (22) అనే యువతి తల్లిదండ్రులు పదేళ్ల కిందట చనిపోయారు. మౌనికకు అక్క, చెల్లి ఉండగా ఇద్దరికీ వివాహాలు జరిగి వారివారి అత్తారిళ్లలో ఉంటున్నారు. ఇక మౌనిక ప్రస్తుతం మేనమామ త్రిమూర్తులు వద్ద ఉంటూ తాళ్లరేవు మండలం చొల్లంగిలోని రాయల్‌ కాలేజీలో నర్సింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది.

రెండేళ్ల కిందట కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నాతో మౌనికకు స్నేహం కుదిరింది. వారి స్నేహం కాస్తా ప్రేమకు దారితీసింది. ఐతే చిన్నాకు చెడు వ్యసనాలు ఉన్నాయి ఈ క్రమంలో గంజాయికి బానిసైన చిన్నా రెండు నెలల కిందట తన సోదరుడిని రూ.500 అడిగాడు. ఐతే చిన్నా సోదరుడు డబ్బులివ్వలేదు. దీంతో డబ్బులు ఇవ్వలేదనే కోపంతో చిన్నా ఒంటికి నిప్పంటించుకున్నాడు.

వెంటనే కుటుంబ సభ్యులు మంటలు ఆర్పి బాధితుడిని కాకినాడలోని ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్ర గాయాలపాలైన చిన్నా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రేమించిన వాడు మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక కాలేజీకి వెళ్లడం మానేసింది. చిన్నా జ్ఞాపకాలతో మానసికంగా కుంగిపోయింది. అతనికి సంబంధించిన దుస్తులు, వస్తువులను గదిలో పెట్టుకుని, ఫొటోలు గోడలకు అతికించి కన్నీరుమున్నీరుగా విలపించింది.

ప్రేమించినవాడు ఇకలేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మేనమామ త్రిమూర్తులు పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని, యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.  

ఆత్మహత్య మీ సమస్యకు పరిష్కారం కాదు....
చావే అన్ని సమస్యలకు పరిష్కారం కాదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు సరైనవి కావని, వారు చెబుతున్నారు. తల్లి తిట్టిందనో, తండ్రి మందలించాడనో, తోబుట్టువులు ఆదరించడం లేదని, సమాజంలో విలువలు కోల్పోయామని అనే కొన్ని ఆలోచనల వల్ల ఆత్మహత్య చేసుకున్నందుకు సిద్ధపడుతున్నారు. కానీ వీటికి చావు పరిష్కారం కాదని సమయానుకూలంగా అన్నిటికీ అవే పరిష్కారాలు దొరుకుతాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఆలోచన వల్ల సమస్య పెద్దగా అవుతాయి తప్ప చిన్నవి కాదని చెబుతున్నారు. ఆత్మహత్య వల్ల తల్లిదండ్రులకు, కుటుంబానికి తీరనిలోటని, వారికి కడుపు కోత మిగిల్చిన వారు అవుతారు తప్ప సమస్య పరిష్కారం కాదని వెల్లడిస్తున్నారు.

ఏదైనా సమస్య ఉంటే కుటుంబ సభ్యులతో ఆత్మీయులతో కలిసి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది కానీ చావు పరిష్కారం కాదు. చావే అన్నిటికీ పరిష్కారం అనుకుంటే ఈ భూమి మీద జీవరాసులే తప్ప మనుషులు ఎవరు మిగలరు. కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.

Published at : 22 Aug 2023 03:13 PM (IST) Tags: Yanam

ఇవి కూడా చూడండి

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Tamilnadu Bus Accident : ఘోర ప్రమాదం, లోయలో పడిన బస్సు, 9 మంది దుర్మరణం

Tamilnadu Bus Accident : ఘోర ప్రమాదం, లోయలో పడిన బస్సు, 9 మంది దుర్మరణం

Ujjain Rape Case: 'నా కొడుకుని ఉరి తీయాలి', ఉజ్జయిని రేప్ కేసు నిందితుడి తండ్రి డిమాండ్

Ujjain Rape Case: 'నా కొడుకుని ఉరి తీయాలి', ఉజ్జయిని రేప్ కేసు నిందితుడి తండ్రి డిమాండ్

Nalgonda News: మర్రిగూడ ఎమ్మార్వో అక్రమాస్తులు రూ.4.75 కోట్లు, అవినీతి అధికారిని అరెస్ట్ చేసిన ఏసీబీ

Nalgonda News: మర్రిగూడ ఎమ్మార్వో అక్రమాస్తులు రూ.4.75 కోట్లు, అవినీతి అధికారిని అరెస్ట్ చేసిన ఏసీబీ

Hyderabad Crime News: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్, సైబరాబాద్ ఫ్లైఓవర్ కింద వదిలి వెళ్లిన దుండగులు

Hyderabad Crime News: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్, సైబరాబాద్ ఫ్లైఓవర్ కింద వదిలి వెళ్లిన దుండగులు

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'