(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: భర్తను చంపితే బీమా డబ్బులొస్తాయని ప్లాన్.. ప్రియుడితో కలిసి స్కెచ్.. చివరకు..
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి.. పక్కా స్కెచ్ వేసి.. భర్తను హత్య చేయించింది ఓ భార్య.
వివాహేతర సంబంధం ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. భర్తను చంపితే బీమా డబ్బులు వస్తాయని అనుకుంది ఓ భార్య. ప్రియుడితో కలిసి భర్తను పక్కా ప్లాన్ ప్రకారం చంపించింది. ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. భర్త దూరమయ్యాడు.. ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భీమడోలు మండలం వడ్డిగూడానికి చెందిన వ్యక్తితో కలిసి అంబర్‌పేటకు చెందిన సాయల పెంటయ్య కూలి పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఓ కూలీ భార్యతో పెంటయ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం వివాహిత భర్తకు తెలిసింది. దీనిపై ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇదే విషయాన్ని ప్రియుడు పెంటయ్యకు చెప్పింది. తమ సంబంధాన్ని తొలగించుకోవాలని.. ఇద్దరూ పక్కా ప్లాన్ వేశారు. టైమ్ కోసం ఎదురు చూశారు.
ఓ రోజు ప్రియురాలి భర్త అనారోగ్యంతో బాధపడడ్డాడు. ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పింది. ఇద్దరూ కలిసి వెళ్లేలా ప్లాన్ వేసింది. పెంటయ్యతోపాటు మహిళ భర్త మందుల కోసం కిందటి నెల 3వ తేదీన బయటకు వెళ్లాడు. రాత్రి సమయం కావడంతో తాము అనుకున్న ప్లాన్ అమలు చేశాడు. రోడ్డుపై అటు ఇటు చూశాడు. ఎవరు రాకపోవడంతో.. బండి ఆపి.. మోటారు సైకిల్‌లో పెట్టిన సెంట్రింగ్ రాడ్డుతో ప్రియురాలి భర్త తలపై కొట్టి హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని రోడ్డుపై పడవేశాడు.
అయితే ఈ విషయం ఎవరికీ అనుమానం రావొద్దని.. మోటర్ సైకిల్ ను రాడ్డుతో ధ్వంసం చేశాడు. రోడ్డు ప్రమాదం జరిగినట్టు చిత్రీకరించాడు. తనకు గాయాలు కాలేదని అడుగుతారేమోననుకుని.. పక్కనే ఉన్న.. గొయ్యిలో పడి స్పృహ కోల్పోయినట్టు నటించాడు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే వైఎస్‌ఆర్ బీమా పథకంలో ఐదు లక్షల రూపాయలు వస్తాయని ప్రియురాలితో సహజీవనం కొనసాగించవచ్చునని ఈ పథకం వేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై పోలీసులు అప్పట్లో రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేశారు. కానీ అనుమానం వచ్చి.. విచారణ చేయగా.. వివాహేతర సంబంధం బయటపడింది. నిందితుడు పెంటయ్యతోపాటు మహిళను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ దీలిప్ కిరణ్ తెలిపారు.
Also Read: Crime News: ఆమెతో కలిసి ఆ రోజు లాడ్జికి వెళ్లాడు.. చంపేశాడా? చచ్చిపోవాలనుకున్నారా?
Also Read: Mahabubnagar: ఒకే చీరకు ఉరేసుకున్న వదిన, మరిది.. కారణం తెలిసి స్థానికులు షాక్
Also Read: Mulugu Encounter: తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్... 27న బంద్ కు పిలుపునిచ్చిన మావోలు...