అటల్ సేతు బ్రిడ్జ్‌పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య, మృతదేహం కోసం గాలింపు!
Woman Suicide: అటల్ సేతు బ్రిడ్జ్‌పై నుంచి దూకి ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది.
Woman jumps off Atal Setu Bridge: ఇటీవల ముంబయిలో నిర్మించిన అటల్ సేతు బ్రిడ్జ్ పై నుంచి ఓ మహిళ సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. థానే జిల్లాకి చెందిన మహిళా డాక్టర్ నీళ్లలోకి దూకినట్టు పోలీసులు వెల్లడించారు. ఆమె ఆచూకీ కోసం ఇంకా గాలింపు చేపడుతున్నారు. మార్చి 18వ తేదీన ఈ ఘటన జరిగింది. ట్యాక్సీలో ప్రయాణిస్తున్న ఆ మహిళ అటల్ సేతు రాగానే కార్‌ని ఆపాలని డ్రైవర్‌కి చెప్పింది. కార్ దిగిన ఆమె వెంటనే అక్కడి నుంచి కిందకి దూకింది. నీళ్లలో పడిపోయి రెండు రోజులు దాటిపోవడం వల్ల చనిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆమె దూకిన వెంటనే డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ కనుగొనేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఇంకా ఆమె బాడీ దొరకలేదు. అయితే...అదే రోజున భివండిలో ఓ వ్యక్తి తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కంప్లెయింట్ ఆధారంగా ఆమె ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఆ సమయంలోనే ఓ సూసైడ్ నోట్ దొరికింది. దాదాపు 8 ఏళ్లుగా తాను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్టు అందులో రాసింది బాధితురాలు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆ నోట్‌లో ప్రస్తావించింది. తన చావుకి ఎవరూ బాధ్యులు కారని రాసింది. ట్యాక్సీ డ్రైవర్‌కి కూడా దీంతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఈ సూసైడ్ నోట్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
"మార్చి 18న మధ్యాహ్నం మహిళ ట్యాక్సీలో ప్రయాణిస్తోంది. అటల్ సేతు దగ్గరికి రాగానే కార్ ఆపాలని డ్రైవర్‌కి చెప్పింది. కార్ దిగిన వెంటనే పై నుంచి నీళ్లలోకి దూకింది. ఇది చూసిన వెంటనే ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. ఆమె కోసం ప్రత్యేకంగా సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు"
- పోలీసులు