Cross Wheel: తిరుచానూరులో తీవ్ర విషాదం - క్రాస్ వీల్ విరిగి మహిళ మృతి
Tirupati News: తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శిల్పారామంలో క్రాస్ వీల్ విరిగి ఓ మహిళ మృతి చెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.

Woman Dies After Cross Wheel Breaks In Tiruchanur: తిరుపతి జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు (Tiruchanur) పరిధిలోని శిల్పారామం సందర్శించేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలు సరదాగా క్రాస్ వీల్ (జెయింట్ వీల్ లాంటిది) ఎక్కారు. వీరిద్దరూ ఒకే బాక్స్‌లో కూర్చొని తిరుగుతుండగా ఒక్కసారిగా అందులోని ఓ బాక్స్ విరిగి కిందపడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ స్పాట్‌లోనే మృతి చెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన మహిళను తిరుపతిలోని (Tirupati) రుయా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. మృతురాలిని తిరుపతిలోని సుబ్బారెడ్డినగర్‌కు చెందిన లోకేశ్వరిగా గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. సరదాగా క్రాస్ వీల్ ఎక్కగా ప్రమాదవశాత్తు విరిగిపోవడంతో సందర్శకులు భయాందోళనకు గురయ్యారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

